Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్‌తో స్నేహం.. గౌతమ్‌తో విరోధం.. ఇదెక్కడి ట్విస్ట్ బిగ్‌బాస్‌ మావా!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్బుతంగా సాగుతుంది. అదిరిపోయే టాస్క్ లు ఇస్తూ ఎప్పటికప్పుడూ అందరిలోనూ తెగ ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. అలాగే అంతకు మించిన ఎమోషన్లు పండిస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా పదకొండో వారం పూర్తి చేసుకుంటున్న బిగ్ బాస్ షో.. సండే ఫండేగా కాకుండా మండేగా మారిపోయింది. మండే గా అంటే నామినేషన్లలో చోటు చేసుకునే హీటే ఈరోజు కూడా రిపీట్ అయిందని అర్థం. అయితే అంత హీటెక్కిపోవడానికి గల కారణం ఏంటి, నాగార్జున వచ్చే ఎపిసోడ్ లో కంటెస్టెంట్లు అంత ఫైర్ అవ్వడానికి గల రీజన్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సండే.. ఫండే.. కానీ ఇప్పుడు అలా ఉండదు.. ఎందుకంటే బిగ్ బాస్ షో అయిపోయేందుకు దగ్గర పడుతుందని ముందుగానే నాగార్జున చెప్పారు. అలాగే అందరినీ ఆగం చేసే ఓ టాస్క్ కూడా ఇచ్చారు. అదే యాడ్ ఎ ఫ్రెండ్ బ్లాక్ ఎ హౌస్ మేట్ టాస్క్. ఈ టాస్స్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరూ.. తమకు నచ్చిన ఓ వ్యక్తిని ఫ్రెండ్ గా మార్చుకోవడంతో పాటు మరో వ్యక్తిని బ్లాక్ చేయాలని చెప్పారు. ఈక్రమంలోనే ముందుగా నాగార్జున గౌతమ్ కృష్ణను పిలిచారు. నీవు ఎవరితో ఫ్రెండ్ షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావో, ఎవరిని బ్లాక్ చేయాలనుకుంటున్నావో చెప్పు అని అడిగారు.

Pallavi Prashanth Added Friend List And Gautam Krishna in Block List of Bigg Boss Telugu 7 Latest Task

దీంతో గౌతమ్ కృష్ణ ముందుగా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను పిలిచాడు. అతడిని తన స్నేహితుడిగా కొనసాగించాలనుకుంటున్నానని కారణాలు కూడా చెప్పుకొచ్చాడు. గత రెండు వారాలుగా తనతో బాగుంటున్నాడని, ముఖ్యంగా నామినేషన్ల అప్పుడు అంతగా అగ్రెసివ్ అవ్వట్లేదని చెప్పాడు. ఇక ఆ తర్వాత వచ్చిన శోభాశెట్టి.. గౌతమ్ కృష్ణను పిలిచింది. అతడిని బ్లాక్ చేస్తున్నట్లు వివరించింది. ముఖ్యంగా కెప్టెన్సీ టాస్క్ లో కావాలని.. ప్రియాంక గెలవడం నీకు ఇష్టం లేదా, ఇష్టం లేదని డైరెక్ట్ గా చెప్పేస్తే నేను కొట్టడం ఆపేస్తా అంటూ అరిచాడు సార్ అది కరెక్ట్ కాదని నాకు అనిపించిందంటూ శోభా శెట్టి వివరించింది. అలాగే అమర్ దీప్ ను టార్గెట్ చేసి కొట్టడం కూడా తనకు నచ్చలేదని వెల్లడించింది.

ఇక ఆ తర్వాత వచ్చిన అమర్ దీప్.. పల్లవి ప్రశాంత్ తో ఇప్పటి నుంచి స్నేహం చేస్తానని చెప్పాడు. తాను కెప్టెన్ అయ్యేందుకు సహకరిస్తానని చెప్పడం, అలాగే తను బాధలో ఉన్నప్పుడు రైతుబిడ్డ సాయం చేయడం అందరూ చూశాం. దానికి బాగా ఇంప్రెస్ అయిన అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ తో స్నేహం చేస్తానని చెప్పడం గమనార్హం. ఇక ఆ తర్వాత వచ్చిన అశ్విని శ్రీ.. గౌతమ్ కృష్ణను బ్లాక్ చేస్తున్నట్లు చెప్పింది. అందుకు తగిన కారణాలను కూడా వివరించింది. మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో గౌతమ్ కృష్ణ కావాలని అమర్ దీప్ ను కొట్టడం నచ్చలేదని వెల్లడించింది.

Pallavi Prashanth Added Friend List And Gautam Krishna in Block List of Bigg Boss Telugu 7 Latest Task

ఇలా గౌతమ్ కృష్ణను బ్లాక్ చేస్తున్న రెండు ఓట్లు రాగా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను స్నేహితుడిగి చేసుకుంటున్నట్లు ఇద్దరు ఓట్లు వేశారు. హౌస్ మొత్తం రెండు ఓట్లు వచ్చింది వీరిద్దరికే కాగా.. మిగిలిన వారికీ ఒక్కో ఓటు వచ్చింది. ముఖ్యంగా శివాజి అంబటి అర్జున్ తో స్నేహం చేస్తానని చెప్పగా.. అర్జున్... యావర్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు వెల్లడించాడు. ఈరోజుటి ఎపిసోడ్ చూస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసేలా లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X