ప్రశాంత్ - అమర్‌దీప్ ఫ్యాన్స్ ఫైటింగ్: ఆ లేడీ కంటెస్టెంట్ కారు డ్యామేజ్.. కేసు పెట్టిన షో హోస్ట్
బిగ్ బాస్ షో.. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ఎమోషన్‌లా మారిపోయింది. అందుకే ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకులు భారీ రెస్పాన్స్‌ను అందిస్తున్నారు. ఫలితంగా ఈ షోకు దేశంలో మరే దానికీ దక్కనంత రేటింగ్ లభిస్తోంది. దీంతో వరుసగా సీజన్లను జరుపుతూనే వస్తున్నారు.
Recommended Video

ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో తెచ్చి సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఇక, ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే పూర్తైన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి ఫ్యాన్స్ కొట్టుకుని రణరంగం సృష్టించారు. ఆ వివరాల్లోకి వెళ్తే....

గ్రాండ్‌గా ముగిసిన సీజన్: పదిహేను వారాల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్ బాస్ ఏడో సీజన్ గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌తో ముగిసింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఇందులో మాజీ కంటెస్టెంట్లతో పాటు ఫైనలిస్టులు ఆటపాటలతో సందడి చేశారు. అలాగే, కొందరు సెలెబ్రిటీలు సైతం వచ్చి వినోదాన్ని పంచారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ మజాను ఇచ్చేలానే సాగింది.
సీజన్ విన్నర్ ప్రశాంత్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే. వీరిలో అంబటి అర్జున్ ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా వెళ్లిపోయింది. ప్రిన్స్ యావర్ డబ్బు తీసుకుని తప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజి కూడా ఎలిమినేట్ అయిపోయాడు. చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా.. అమర్‌దీప్ రన్నగా మిగిలాడు.
అమర్ వర్సెస్ ప్రశాంత్: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి అభిమానులు వందల సంఖ్యలో అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. ఇది పూర్తైన తర్వాత వాళ్లంతా బయట గొడవ చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలోనే ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వీళ్లంతా రెండు గ్రూపులుగా ఏర్పడి విపరీతంగా కొట్టుకున్నారు.
అశ్విని కారుపైన దాడి: అన్నపూర్ణ స్టూడియో ముందు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి అభిమానులు చెలరేగిపోయారు. ఈ క్రమంలోనే వాళ్లకు కనిపించిన ప్రతి వాహనంపైన కూడా దాడి చేశారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ కంటెస్టెంట్ అశ్విని శ్రీ వాహనం అద్దాలను పగలగొట్టారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేసింది.

ఆర్టీసీ బస్‌ను వదల్లేదు: అమర్‌దీప్ - పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఫైటింగ్‌తో అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అప్పుడు రోడ్డు మీదకు వచ్చిన వాళ్లంతా అటుగా వస్తున్న ఆర్టీసీ సిటీ బస్‌పైన కూడా దాడి చేశారు. ఈ ఘటనలో దాని ముందు భాగంలోని అద్దాలు పగిలిపోయాయి.
హోస్టుపైన.. కేస్ ఫైల్: ఇదే ఘటనలో బిగ్ బాస్ బజ్ హోస్టు గీతూ రాయల్ కారుపైన కూడా కొందరు దాడి చేశారు. దీంతో ఆ వాహనం వెనక భాగంలో ఉన్న అద్దం మొత్తం పగిలిపోయింది. దీనిపై ఆమె మీడియాతో సైతం మాట్లాడి ఘటన జరిగిన తీరును వివరించింది. అనంతరం తన కారుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గీతూ కేస్ పెట్టింది. అశ్విని కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











