Bigg Boss Telugu 7: బిగ్ బాస్ షోలో కలకలం.. నేను అడంగోడిని గాజులు పంపించు.. ప్రశాంత్‌ను తోసేసిన అమర్

తెలుగు బుల్లితెరపై సెన్సేషనల్ కంటెంట్‌ను చూపిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో జనరంజకంగా ప్రసారం చేస్తున్నారు. ఇది ఇప్పుడు చివరి దశకు చేరుకోవడంతో మరింత రంజుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు కొట్టుకున్నంత పని చేశారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

బిగ్ బాస్ ఏడో సీజన్‌ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఇందులో అసలు ఏమాత్రం అంచనాలు వేయని ఎన్నో పరిణామాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నామినేషన్స్ టాస్కులు కూడా గొడవలతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే 14వ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ కొందరి మధ్య ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా నడిచింది.

Pallavi Prashanth and Amardeep Heated Arguments Highlighted in Bigg Boss Telugu 7 Show

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా నామినేషన్స్ టాస్కులో శోభా శెట్టి - ప్రిన్స్ యావర్ మధ్య జరిగిన వాగ్వాదం ఎంతో హైలైట్ అయింది. గత వారంలో తనను నామినేట్ చేసిన రీజన్ నచ్చలేదని, షోలోకి వచ్చినప్పటి నుంచి కలిసికట్టుగా ఆడుతుందని యావర్ ఆరోపించాడు. దీంతో శోభాకు కోపం వచ్చి అతడు పనులు ఏమీ చేయడం లేదని అతడిని తిట్టేసింది.

శోభా శెట్టి ఓవర్ చేస్తూ నోరేసుకుని పడిపోయింది. దీంతో ప్రిన్స్ యావర్‌కు కోపం వచ్చి ఆమె ఎక్కువ సమయం మేకప్ వేసుకోడానికే కేటాయిస్తుందని సైగల ద్వారా కామెంట్ చేశాడు. దీంతో శోభాకు చిర్రెత్తుకొచ్చింది. అప్పుడామె 'మేకప్ అని అంటున్నావ్ ఏంటి? అదే నాకు అన్నం పెడుతుంది. దానిపై నాకు రెస్పెక్ట్ ఉంది' అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ రెచ్చిపోయింది.

శోభా - యావర్ తర్వాత పల్లవి ప్రశాంత్ - అమర్‌దీప్ మధ్యన భీకరమైన గొడవ జరిగింది. అమర్ వంతు వచ్చినప్పుడు ప్రశాంత్‌ను నామినేట్ చేస్తూ 'నువ్వు సిల్లీ రీజన్స్ చెప్పి నామినేట్ చేస్తున్నావు అది నాకు నచ్చడం లేదు' అన్నాడు. దీనికి ప్రశాంత్ అస్సలు తగ్గకుండా 'ఇప్పుడు నువ్వు చేస్తున్నదే సిల్లీ రీజన్' అంటూ సమాధానం ఇచ్చాడు.

Pallavi Prashanth and Amardeep Heated Arguments Highlighted in Bigg Boss Telugu 7 Show

కాసేపు వాదించుకున్న తర్వాత అమర్‌దీప్.. ప్రశాంత్ టైల్‌ను పగలగొట్టేసి మాట్లాడను అన్నాడు. కానీ, అతడు మాత్రం తనకు సరైన సమాధానం చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టాడు. అప్పుడు అమర్‌దీప్ 'ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అదీ మగోడి మాట' అంటూ నోరు జారాడు. దీనికి ప్రశాంత్ 'నువ్వు ఆడోళ్ల మాట మాట్లాడుతున్నావా' అంటూ పెద్ద షాక్‌నే ఇచ్చేశాడు.

ఎప్పుడైతే ప్రశాంత్ ఆడోళ్ల మాట అన్నాడో అప్పుడు అమర్‌దీప్ అపరిచితుడిలా మారిపోయాడు. 'నన్ను ఆడోడు అంటావా? అదేమ్మా గాజులు తీసుకురా వేసుకుంటా. సార్ మీరే విన్నర్ సార్. మేమంతా గోతులు తవ్వుకోనీకి వచ్చినం సార్. నన్ను బయటికి పంపించేయండి.. కప్పు వాడికే ఇచ్చేయండి. నువ్వు చేస్తే పత్తి బిజినెస్.. మాది బూతు బిజినెస్' అంటూ రెచ్చిపోయాడు.

Pallavi Prashanth and Amardeep Heated Arguments Highlighted in Bigg Boss Telugu 7 Show

ఆ తర్వాత కూడా అమర్‌దీప్ 'నేను పోతా నువ్వు కప్పు తీసుకో. నేను ఆడోడిని కదా. గాజులు తెప్పించు వేసుకుంటా' అంటూ సీరియస్ అయ్యాడు. అప్పుడు ప్రశాంత్ 'ఇదే నీ నిజస్వరూపం. నువ్వు నాతో మాట్లాడొద్దు' అంటూ ఫైర్ అయ్యాడు. ఆ సమయంలో ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు వచ్చారు. అప్పుడు అమర్‌దీప్ తన బాడీతో ప్రశాంత్‌ను వెనక్కి నెట్టేశాడు.

ఒక సందర్భంలో ప్రశాంత్ - అమర్ కొట్టుకుంటారా అన్నంతగా పరిస్థితులు కనిపించాయి. శివాజి వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఆ తర్వాత కూడా అమర్‌ ఇదే మాటను పదే పదే అంటూ గొడవకు కాలుదువ్వాడు. మొత్తానికి ఈ వ్యవహారంతో అతడి తీరు విమర్శలకు తావిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X