Bigg Boss Telugu 7: అప్పుడు రాధిక.. ఇప్పుడు రతిక - పల్లవి షాకింగ్ కామెంట్లు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి అందులో ఉన్న కంటెస్టెంట్ల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఎవరెవరు గేమ్ ఎలా ఆడుతున్నారు, ఎవరితో కలిసి ఆడుతున్నారో కూడా రోజూ చూసే వాళ్లకు ఈజీగా తెలిసిపోతుంది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న అమర్ దీప్ టీం, శివాజి టీం మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. నామినేషన్ల సమయంతో పాటు అన్ని గేముల్లోనూ అమర్ దీప్ టీం, అంటే సీరియల్ బ్యాచ్ కలిసే ఆడుతుంది. ముందుగానే నీవు వీళ్లని నామినేట్ చెయ్, నేను వాళ్లని నామినేట్ చేస్తా అంటూ చెప్పుకుంటున్నారు. అలాగే తెలియని వాటికి సమాధానాలు కూడా చెప్పమని అమర్ దీప్ చెప్పడం మరింత ఘోరంగా కనిపిస్తోంది.
ఇదంతా ఇలా ఉంటే.. రతికా రోజ్ రీ ఎంట్రీతో హౌస్ లో కొత్త వాతావారణం ఏర్పడింది. ఇంతకాలం సీరియల్ బ్యాచ్ వాళ్లతోనే ఇబ్బందులు పడ్డ రైతు బిడ్డ.. రాధిక ఎంట్రీతో మరింత భయపడుతున్నాడు. ఈమె మళ్లీ ఏం పెంట పెడుతుందోనని ఆమె దగ్గరకు వచ్చేందుకు కూడా జంకుతున్నాడు. కానీ రతిక మాత్రం తనకు వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకుని మళ్లీ గేమ్ ఆడాలాని బాగానే ప్రయత్నిస్తోంది. అది వాళ్లకు అర్థం అయ్యేలా చెప్పేందుకు.. ఇంట్లోకి రాగానే శివాజి కాళ్లు పట్టుకోవడం, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ తో మాట కలపడం కూడా చేసింది.

ముఖ్యంగా ప్రిన్స్ యావర్, శివాజి, పల్లవి ప్రశాంత్ లతో మాత్రమే తాను మాట్లాడతానని కూడా యావర్ తో చెప్పుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా ఒకెత్తు అయితే.. రతికా రోజ్ కు భయపడుతున్న రైతు బిడ్డ మరోసారి అక్క అని పిలిచాడు. అందుకు ఆమె చాలా ఫీల్ అయింది. అక్క అని ఎందుకు పిలుస్తున్నావ్.. రతికా అని పేరు పెట్టి పిలవమని చెప్పింది. అక్కేడ ఉన్న ప్రిన్స్ యావర్ కూడా పల్లవికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అతడు మాత్రం అస్సలే వద్దంటూ చెప్పుకొచ్చాడు. గతంలో సరిగ్గా మాట్లాడితేనే ఇష్టం వచ్చినట్లు తిట్టింది, నాగార్జున సార్ ముందే నేను ఆమెను గేమ్ ఆడనివ్వట్లేదంటూ చెప్పిందని గుర్తు చేశాడు.

అక్క అని పిలిస్తే ఇద్దరికీ సమస్య ఉండదని అన్నాడు. గతంలో నేనెప్పుడు అలా అన్నానంటూ రతికా రోజ్ అడగ్గా.. అన్నావు గుర్తు తెచ్చుకో అని పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయినా అప్పుడు మాట్లాడిన రతికా వేరు.. ఇప్పుడు మాట్లాడుతున్న రతికా వేరు, ఆ టోన్ వేరు, ఈ టోన్ వేరంటూ పల్లవి ప్రశాంత్ ఏడుస్తూ చెప్పాడు. ఇది చూసిన ప్రతీ ఒక్కరికీ అవును నిజమే కదా అనిపిస్తోంది. గతంలో ఇంట్లో ఉన్నప్పుడు రతికా రోజ్.. అచ్చం డీజె టిల్లు చిత్రంలో రాధికలాగే ప్రవర్తించింది. కానీ బయటకు వెళ్లి వచ్చాక నిజమైన రతికాగా కనిపిస్తోంది.

వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ గొడవ చూసిన శివాజి వారి వద్దకు వచ్చాడు. ఇద్దరూ చెప్పిన మాటలు ఓపికగా విన్నాడు. మీరిద్దరూ చిన్న పిల్లలకు, గతంలో జరిగింది వదిలేసి ఇప్పటికైనా హ్యాపీగా గేమ్ ఆడుకోండిరా అని సూచించాడు. అలాగే ప్రశాంత్ నిజాయితీ పరుడు అని, వాడిలో ఎలాంటి కల్మషం లేదంటూ రతికాకు వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇది చూస్తుంటేనే... శివాజికి పల్లవి ప్రశాంత్ పై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని అంతా అంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుందో.



Click it and Unblock the Notifications











