Bigg Boss 7 Telugu: పల్లవి ప్రశాంత్‌దే విజయం.. రైతు బిడ్డ నయా రికార్డు.. స్ట్రాంగ్ ప్లేయర్లంతా ఔట్

బిగ్ బాస్ షో రియాలిటీ ఆధారంగా నడుస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే దీనికి దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా ప్రసారం అయిన ప్రతిసారీ తెలుగులో ఈ షో సూపర్ సక్సెస్‌ అవుతోంది. దీంతో నిర్వహకులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇటీవలే ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులో ఎవరూ ఊహించని కాన్సెప్టును తీసుకు వచ్చి మజాను పంచుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో పల్లవి ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. ఆ సంగతులు మీకోసమే!

బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఐదో వారంలో మొట్టమొదటి కెప్టెన్సీ టాస్కును తీసుకు వచ్చారు. ఇందులో పది మందిని ఐదు జంటలుగా మార్చి కొన్ని రకాల టాస్కులు ఇచ్చారు. ఇక, చివరి రౌండ్‌లో చిట్టీ ఆయేగా అనే గేమ్ పెట్టారు. దీనిలో నాలుగు జంటలు పాల్గొనగా.. నలుగురు కంటెస్టెంట్లు లెటర్లను, కంటెండర్‌షిప్‌ను త్యాగం చేశారు. దీంతో మిగిలిన నలుగురు కెప్టెన్సీ పోటీలో నిలిచారు.

Pallavi Prashanth Becomes First Captain In Bigg Boss 7 Telugu Show

చివరి రౌండ్ ముగిసిన తర్వాత గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్, పల్లవి ప్రశాంత్‌లు మొదటి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడే కంటెస్టెంట్లుగా నిలిచారు. వీళ్లకు బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' అనే టాస్క్ ఇచ్చాడు. మొత్తం మూడు రౌండ్లుగా జరిగిన ఈ టాస్కులో ఎవరి టీ షర్ట్‌పై ఎక్కువ కలర్ ఉంటే వాళ్లు గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుందని వివరించారు.

'రంగు పడుద్ది రాజా' టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో టేస్టీ తేజ సర్కిల్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతడు ఎలిమినేట్ అయినట్లు సంచాలకురాలు ప్రియాంక జైన్ తెలిపింది. ఆ తర్వాత సందీప్‌కు ఎక్కువ కలర్ ఉందని అతడిని ఎలిమినేట్ చేసింది. దీంతో అమర్‌దీప్ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అలా కాసేపు హైడ్రామా తర్వాత తేజనే తీసేసింది.

తేజ టాస్క్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సందీప్, గౌతమ్ మధ్య కాసేపు గొడవ జరిగింది. దీంతో రెండో రౌండ్‌లో వీళ్లిద్దరూ కలర్ పూసుకోడానికి ప్రయత్నించారు. అప్పుడు ప్రశాంత్ కూడా సందీప్‌నే టార్గెట్ చేశాడు. దీంతో మాస్టర్.. రైతు బిడ్డకు రంగు పూసేందుకు వేగంగా వచ్చాడు. అప్పుడు ప్రశాంత్ తప్పించుకోవడంతో సందీప్ లైన్ దాటాడు. దీంతో ఎలిమినేట్ అయ్యాడు.

'రంగు పడుద్ది రాజా' టాస్కులో చివరి రౌండ్‌ గౌతమ్, ప్రశాంత్ మధ్యన జరిగింది. వీళ్లిద్దరూ పోటాపోటీగా ఒకరిపై ఒకరు రంగులు వేసుకున్నారు. ఇలా చాలా సేపు పోరాటం చేసిన తర్వాత బజర్ మోగింది. ఇక, వీళ్లిద్దరిలో ఎవరు విజేతగా నిలిచారో చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. ప్రశాంత్ విజయం సాధించినట్లు సంచాలకురాలు ప్రియాంక జైన్ ప్రకటించింది.

ఈ విజయంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌లో మొట్టమొదటి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్ రికార్డు క్రియేట్ చేశాడు. స్ట్రాంగ్ ప్లేయర్లు అందరినీ చిత్తు చేసిన అతడు.. తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు.

ఇక, ప్రశాంత్ గెలవడంతో స్టార్ మా బ్యాచ్ రగిలిపోయింది. ముఖ్యంగా అమర్‌దీప్ అయితే పదే పదే రన్నింగ్ కామెంట్రీ చేస్తూ అతడిని నిరుత్సాహపరుస్తూనే వచ్చాడు. దీంతో శివాజి.. ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచి అతడితో గొడవ పడ్డాడు. అనంతరం కెప్టెన్సీ బ్యాడ్‌ను ధరించిన రైతు బిడ్డ తన సంతోషాన్ని అందరితో పంచుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X