Bigg Boss Telugu 7 పల్లవి ప్రశాంత్‌ను ఏడ్పించిన రతికా రోజ్.. రైతుబిడ్డను అంత మాట అనేసిన రాధిక!
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో రతికా రోజ్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ రచ్చ మొదలైంది. రతిక ఇంట్లోకి రావడంతో పల్లవి ప్రశాంత్ గొంతులో వెలక్కాయ పడినంత పనైంది. అయితే రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య పరిస్థితి కొంత గందరగోళంగా మారింది. అయితే తాజాగా వారిద్దరి మధ్య సాగిన సంభాషణ కారణంగా పల్లవి ప్రశాంత్ భోరుమని ఏడుస్తూ కనిపించాడు. రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 ఆరంభంలో రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలైంది. ఆ స్నేహం కాస్త ముదిరి రొమాన్స్ జోన్‌లోకి ప్రవేశించారు. ఒకరికొకరు సున్నితమైన రొమాన్స్‌ను కొనసాగించారు. అయితే వారిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న నేపథ్యంలో వారిద్దరి మధ్య చిన్న గొడవలు చోటు చేసుకొన్నాయి.

అయితే ఉన్నట్టుండికొద్ది రోజుల్లోనే రతిక, పల్లవి ప్రశాంత్‌కు రొమాన్స్‌కు బ్రేక్ పడింది. సడెన్‌గా ఓ రోజు వచ్చి రతికను అక్కా అని పిలువడంతో ఆమె షాక్ తిన్నది. దాంతో పల్లవి ప్రశాంత్ బ్యాడ్‌గా కనిపించాడు. అయితే నన్ను అక్క అనకు. అక్కా అంటే ఊరుకోను అంటూ రతిక హెచ్చరించింది. ఇలా వారి మధ్య గొడవ జరిగిన మరుసటి వారమే రతిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. దాంతో ఆ గొడవకు బ్రేక్ పడిందని అనుకొన్నారు.
కానీ వైల్డ్ కార్డు ద్వారా రతిక మళ్లీ ఎంట్రీ కావడంతో పల్లవి ప్రశాంత్‌కు మళ్లీ ఊహించని షాక్ తిన్నాడు. రతిక రావడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదు. అయితే ఉన్నట్టుండి తాజాగా అక్కా అని పిలవడంతో రతిక షాక్ తిన్నది. అక్క అనకు.. కావాలంటే.. నన్ను రతిక అని పిలవమని చెప్పింది. అయినా వినకపోవడంతో తమ్ముడు అంటూ షాకిచ్చింది.

రతిక రోజ్ నుంచి ఊహించని సమాధానం రావడంతో పల్లవి ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. నన్ను తమ్ముడు అంటుందా అంటూ భోరున ఏడ్చాడు. ప్రశాంత్ అలా ఏడవడంతో ఆమె ఏం చేయాలో తెలియకపోవడంతో భోలే షవాలే వద్ద చర్చ పెట్టారు. పల్లవి ప్రశాంత్, రతిక రోజ్‌కు భోలే నచ్చచెప్పాడు. మీరిద్దరూ పాత విషయాలు మరిచిపోవాలని సూచించారు.
భోలే షవాలే ముందు రతిక, పల్లవి ప్రశాంత్ సుదీర్ఘంగా చర్చించడం చూసి శివాజీ ఎంట్రీ అయ్యాడు. మీరిద్దరూ చిన్నపిల్లలు. గతంలో జరిగిందేదో జరిగిపోయింది. మీరిద్దరూ ఆ విషయాలను తవ్వుకోవద్దు. ప్రశాంత్‌కు నిజాయితీ పరుడు. వాడిలో ఎలాంటి కల్మషం లేదు. మీరిద్దరి ఇంటిలో మంచిగా ఉండి.. బయటకు వెళ్లిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి అని శివాజీ వారికి నచ్చ చెప్పారు.


Click it and Unblock the Notifications











