Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్ చేత కన్నీరు పెట్టించిన అంబటి అర్జున్.. అంత కసేంటయ్యా సామీ!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టాస్క్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ టీం నిర్వాహకులు.. బుల్లితెర ప్రేక్షకులను మెప్పించడంలో సఫలం అవుతున్నారు. ముఖ్యంగా అందరినీ అలరించే టాస్క్ లు ఇవ్వడంతో పాటు ఎమోషన్స్ పండేలా చేస్తున్నారు. అప్పుడే గొడవలు, ఆపై నవ్వులు.. చివరగా పోరులు అంటూ చేస్తున్నారు. ఇప్పటికే 12 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 13వ వారం కొనసాగుతోంది.
ఈక్రమంలోనే బిగ్ బాస్.. టికెట్ టు ఫనాలే టాస్క్ ఇచ్చాడు. గత నాలుగు రోజులుగా ఇదే టాస్క్ నడుస్తోంది. నామినేషన్స్ అయిపోయిన వెంటనే ప్రారంభమైన ఈ టాస్క్.. ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. ముఖ్యంగా బిగ్ బాస్ ఫినాలే అస్త్ర కోసం మొత్తం 12 టాస్క్ లు ఇచ్చారు. ఇప్పటికే పది టాస్క్ లు పూర్తి అయి పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అంబటి అర్జున్ లు చివరగా ఉండగా.. ఈరోజు మరో రెండు టాస్క్ లు పెట్టారు. ఈక్రమంలోనే 11వ టాస్క్ పట్టువదలకురా డింభకా అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఒక తాడులో ముగ్గురూ ఉండి లాక్కుంటూ వెళ్లి జెండాలు కెలక్ట్ చేయాల్సి ఉంటుంది.

అయితే ఈ టాస్క్ లో అందరూ ఊహించనట్లుగానే అంబటి అర్జున్ విన్ అయ్యాడు. చాలా బక్కగా ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ టాస్క్ లో ఓడిపోయాడు. అంబటి అర్జన్ ను, అమర్ దీప్ ను లాగడంలో విఫలం అయ్యాడు. కానీ అంబటి అర్జున్ మాత్రం తన శక్తిని అంతా ఉపయోగించి సూపర్ గా గేమ్ ఆడాడు. తన బలాన్ని చక్కగా వాడుకుంటూ.. ఇద్దరినీ మట్టి కరిపించాడు. ఈక్రమంలోనే పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ లు కింద పడిపోయారు. కానీ ఆయన మాత్రం పట్టించుకోకుండా అలా లాక్కుంటూనే వెళ్లిపోయాడు. ఈక్రమంలోనే రైతుబిడ్డకు దెబ్బ తలిగింది.
పల్లవి ప్రశాంత్ పడిన విషయం గమనించని అర్జున్ అలాగే వెళ్లేసరికి దెబ్బలు తగిలాయి. దీంతో పల్లవి ప్రశాంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. అంతా అరవగానే అంబటి అర్జున్ ఆగిపోయాడు. అలాగే అమర్ దీప్ కూడా వెంటనే బయటకు వచ్చేశాడు. ముఖ్యంగా ఎక్కువ జెండాలు సేకరించని పల్లవి ప్రశాంత్.. ఇలా టికెట్ టు ఫినాలే రేస్ నుంచి బయటకు వచ్చేశాడు. గేమ్ అయిపోయాక కూడా రైతుబిడ్డ కన్నీరు పెడుతూనే కనిపించాడు. అయితే శారీరకంగా తగిలిన దెబ్బలకే అంతలా ఏడ్చాడా లేక గేమ్ ఓడిపోయాననే బాధతో ఏడ్చాడా అనేది మాత్రం తెలియలేదు.

ఇక టాప్ రేస్ లో మిగిలిన అంబటి అర్జున్, అమర్ దీప్ లకు బిగ్ బాస్ మరో అద్భుతమైన టాస్క్ ఇచ్చారు. స్నేక్ అండ్ బాల్ అనే ఈ టాస్క్ లో మూడు బాల్స్ ను పాము నోట్లో వేయాల్సి ఉంటుంది. అయితే అది చేత్తో కాకుండా.. స్నేక్ పై ఉండే హ్యాండిల్స్ తో. మరి ఈ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు... ఫినాలే అస్త్రను ఎవరు గెలుచుకున్నారో తెలియాలంటే మాత్రం ఈరోజుటి ఎపిసోడ్ వచ్చే వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











