Bigg Boss 7 Telugu: పాపం రైతు బిడ్డ.. 5 సెకెన్ల తేడాతో తారుమారు.. ఇమ్యూనిటీ కోల్పోయిన ప్రశాంత్
టెలివిజన్ చరిత్రలోనే సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకున్న ఇది ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను మొదలు పెట్టారు. ఇందులోకి కామన్ మ్యాన్ కోటాలో వచ్చి.. హైలైట్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. తాజా ఎపిసోడ్‌లో అతడికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
వాటిని మరిపించేలా ప్లాన్:బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా సూపర్ హిట్ అవుతుంది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఏడో దానిని కూడా మొదలు పెట్టారు. అయితే, ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త కాన్సెప్టును తీసుకు వచ్చారు. ముఖ్యంగా ఉల్టా పుల్టా అనే పేరుతో వచ్చిన ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తూ టాస్కుల్లో కూడా వైవిధ్యాన్ని చూపిస్తూ ముందుకెళ్తున్నారు.

ఐదు వారాల ఇమ్యూనిటీ:సాధారణంగా బిగ్ బాస్ షోలో ఏదైనా ఒక వారానికి ఇమ్యూనిటీ ఇచ్చేందుకు గతంలో టాస్కులు పెట్టారు. కానీ, ఏడో సీజన్‌లో మాత్రం ఫస్ట్ వీక్‌లోనే ఏకంగా ఐదు వారాలకు గానూ ఇమ్యూనిటీ ఇచ్చేందుకు టాస్కులు పెడుతున్నట్లుగా చెప్పారు. ఇందులో భాగంగానే పలు రౌండ్లను నిర్వహించి.. అందులో గెలిచిన వాళ్లను మెయిన్ టాస్కుకు పోటీదారులను చేస్తామని వెల్లడించారు.

రెజ్లింగ్ పోటీతో సందడి:ఐదు వారాల ఇమ్యూనిటీ పొందే క్రమంగా భాగంగా ఇంటి సభ్యులకు 'ఫేస్ ది బీస్ట్' (రెజ్లింగ్) అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఆడవాళ్ల కోసం ఒక లేడీ రెజ్లర్‌ను, మగవాళ్ల కోసం మేల్ రెజ్లర్‌ను తీసుకు వచ్చారు. రింగ్‌లో ఎవరైతే ఎక్కువ సేపు ఉంటారో వాళ్లే ఈ టాస్కులో విజేతలుగా నిలుస్తారని బిగ్ బాస్ చెప్పాడు. ముందుగా కాసేపు గేమ్ ఆడించి ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పాడు.

ఫన్నీగానే సాగిన టాస్కు:తాజా ఎపిసోడ్‌లో జరిగిన 'ఫేస్ ది బీస్ట్' (రెజ్లింగ్) టాస్కు ఆరంభం నుంచీ ఎంతో ఫన్నీగా సాగింది. ముఖ్యంగా కంటెస్టెంట్ల తీరుపై బిగ్ బాస్ సెటైర్లు వేయడం.. రెజ్లర్లను ఇంటి సభ్యులు బ్రతిమాలడం వంటివి బాగా నవ్వు తెప్పించాయి. ఇక, టాస్కులో గెలిచేందుకు వాల్లంతా చేసిన ప్రయత్నాలు కామెడీగా అనిపించాయి. మొత్తానికి ఈ టాస్కు ఎంతో సందడిగానే జరిగింది.

విజేతలుగా ఆ ఇద్దరు:ఎన్నో సరదా సన్నివేశాల మధ్య ముగిసిన 'ఫేస్ ది బీస్ట్' (రెజ్లింగ్) టాస్కులో ఎక్కువ సేపు రింగ్‌లో ఉన్న ఆట సందీప్ (1.49 నిమిషాలు), ప్రియాంక జైన్ (1.07 నిమిషాలు) విజేతలుగా నిలిచారు. ఇందులో అతి తక్కువగా శివాజి 13.5 సెకెన్లు మాత్రమే రింగ్‌లో ఉన్నాడు. అతడి తర్వాత రతికా రోజ్ 15.8 సెకెన్లు, అమర్‌దీప్ చౌదరి 18.7 సెకెన్లే రింగ్‌లో కొనసాగారు.

ఓటమితో ఏడ్చిన రైతు:'ఫేస్ ది బీస్ట్' (రెజ్లింగ్) టాస్కులో భాగంగానే ఆట సందీప్ విజయం సాధించడంతో పల్లవి ప్రశాంత్ కొద్ది తేడాలో ఓడిపోయాడు. ఇతగాడు రింగులో 1.44 నిమిషాల పాటు ఉన్నాడు. దీంతో ఐదు సెకెన్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. దీంతో పల్లవి ప్రశాంత్ చాలా ఎమోషనల్ అయ్యాడు. తృటిలో టాస్కులో ఓడిపోవడంతో అతడు ఏడ్చేశాడు. దీంతో అందరూ అతడిని ఓదార్చారు.


Click it and Unblock the Notifications











