Bigg Boss Telugu 7: శివాజికి పల్లవి ప్రశాంత్ షాక్.. ఈ సీజన్‌లో తొలిసారి.. ఇది ఎవరూ ఊహించరు భయ్యా!
అస్సలు తెలుగు వాళ్లకు అలవాటు లేని కంటెంట్‌తో ప్రసారం అవుతున్నా.. విశ్లేషకులే షాకయ్యేలా స్పందనను రాబడుతూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. ఇలా ఇది ఏడేళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది. ఫలితంగా నిర్వహకులు వరుస సీజన్లతో సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇందులో గత సీజన్లకు భిన్నమైన కంటెంట్‌ను చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజా ఎపిసోడ్‌లో శివాజికి పల్లవి ప్రశాంత్ షాక్ ఇచ్చాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో అంచనాలకు అందని విధంగా సాగుతోంది. ఇందులో నిర్వహకులు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే 11వ వారంలో 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్క్ తీసుకొచ్చారు. ఇది మొదట అర్జున్ గెలవగా.. టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లతో పోరాడి గెలిస్తేనే పాస్ అతడి దగ్గర ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.

ఎవిక్షన్ ఫ్రీ పాస్ రెండో రౌండ్‌లో భాగంగా అంబటి అర్జున్‌కు బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో తన పోటీదారుడిగా అతడు ప్రిన్స్ యావర్‌ను ఎంచుకున్నాడు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ టాస్కులో యావర్ గెలిచాడు. ఆ తర్వాత అతడు కూడా పల్లవి ప్రశాంత్‌తో ఒక టాస్కును, శోభా శెట్టితో మరో టాస్కును ఆడాడు. ఈ రెండింటిలోనూ ఏకపక్షంగా సాగేలా చెలరేగిపోయాడు.
అప్పటికే మూడు టాస్కులు గెలిచి ఉన్న యావర్‌కు బిగ్ బాస్ బ్యాలెన్సింగ్ టాస్కును ఇచ్చాడు. ఇందులో శివాజి, ప్రియాంకతో అతడు పోటీ పడాల్సి వచ్చింది. ఇది ఎన్నో హైడ్రామాల నడుమ సాగింది. మరీ ముఖ్యంగా ఇందులో సంచాలకులుగా ఉన్న పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి తరచూ తమను డిస్టర్బ్ చేస్తున్నారని శివాజి, యావర్‌లు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్యాలెన్స్ చేసే టాస్కులో సంచాలకుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ తరచూ ఏదో ఒకటి మాట్లాడుతున్నాడని శివాజి తిట్టాడు. ఆ సమయంలోనే అతడు ఈ టాస్కు నుంచి నిష్క్రమించాడు. అప్పుడు మరింత కోపోద్రిక్తుడైన శివాజి.. ప్రశాంత్‌తో పాటు శోభా శెట్టిపైనా సీరియస్ అయ్యాడు. అనంతరం ఈ టాస్కులో ప్రిన్స్ యావర్ ఎక్కువ సేపు ఆడిన తర్వాత ఔట్ అయిపోయాడు.

ఎక్కువ సమయం టాస్కులో ఉన్న కారణంగా ప్రిన్స్ యావర్ గెలిచాడని అతడితో పాటు శివాజి కూడా అనుకున్నారు. అందుకే ఇద్దరూ కలిసి హగ్ చేసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ సమయంలో పల్లవి ప్రశాంత్‌ను శివాజి రమ్మని పిలిచాడు. కానీ, దీనికి అతడు నిరాకరించాడు. అయినప్పటికీ పదే పదే 'రారా.. పిచ్చోడా. ఇప్పుడు ఏమైంది' అంటూ బ్రతిమాలాడు.
శివాజి ఎంత పిలిచినా పల్లవి ప్రశాంత్ మాత్రం వినలేదు. అంతేకాదు, 'నేను ఇప్పుడు రాను అన్నా. గేమ్ అయిపోయినాంక వస్తాను. అయినా నేనెందుకు మీ గేమ్ డిస్టర్బ్ చేస్తాను? ఇంకా యావర్ ఔట్ అవుతాడని జాగ్రత్తలు చెప్పినా' అంటూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో తొలిసారి శివాజిని ప్రశాంత్ ఎదిరించి మాట్లాడినట్లైంది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి.


Click it and Unblock the Notifications











