Bigg Boss Telugu 7: టేస్టీ తేజపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి.. రంగంలోకి పోలీసులు... అసలు విషయం ఏంటంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో 10 వ వారంలోకి అడుగు పెట్టింది. ఇక 9వ వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక బయటకి వచ్చిన తేజకు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన ఫ్యాన్స్ తో కలసి ర్యాలీగా బయలుదేరాడు. అయితే ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పల్టా అంటూ ఆసక్తిగా సాగుతుంది. ఇక హౌస్ లో మొదటి విడుతలో 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. అందులో ఒకరే టేస్టీ తేజ. ఇక మొదటి ఐదు వారాలు గడిచాక... కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక రోజ్, శుభ శ్రీ రాయగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదవ వారంలో బిగ్ బాస్ ఉల్టా పుల్ట అంటూ ఐదుగురు కొత్త కంటెస్తెంట్స్ ను తీసుకు వచ్చాడు.

Pallavi Prashanth Fans Fight with Testy Teja and Police Entered Full Details Here

అందులో అర్జున్ అంబటి, భోలె షవలి, అశ్విని శ్రీ, పూజ మూర్తి, నయని పావని ఉన్నారు. ఇక 5,6 వారాల్లో నయని పావని, పూజ మూర్తి ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత రతిక రోజ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ క్రమంలో.. ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.ఇక గత వారం... టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.

బయటకు వచ్చిన తేజకు ఫ్యాన్స్ భారీ ఎత్తున వెల్కమ్ పలికారు. ఇక తేజ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కొన్ని వీడియోల్లో అన్నా వదిన ఎట్లా ఉంది... అంటూ కామెంట్స్ చేశారు. అయితే వారు శోభ శెట్టి గురించి ఉద్దేశించి మాట్లాడు. ఇక దీన్ని కూడా తేజ ఫన్నీ గానే తీసుకున్నారు. అయితే తాజాగా టేస్టీ తేజపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి పడినట్లు తెలుస్తోంది. టేస్టీ తెజపై ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.

Pallavi Prashanth Fans Fight with Testy Teja and Police Entered Full Details Here

ఇక ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగి... ఘటనను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు టేస్టీ తేజ ఫ్యాన్స్ సైతం.. ఫోటోల కోసం ఎగబడ్డారు. ఇక కారు ఎక్కి తేజ వెళ్ళిపోయారు. అయితే ఫ్యాన్స్ దూసుకొస్తున్న క్రమంలో తేజ.. మీడియాపై విరుచుకుపడినట్లు తెలుస్తుంది. దానికి సంబందించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారాయి.

ఇక ఈ వారం నామినేషన్స్ ఆసక్తిగా సాగాయి. ఈ వారం నామినేట్ అయింది ఐదుగురు కంటెస్టెంట్స్. అందులో శివాజీ, యావర్, రతికా రోజ్, ప్రశాంత్, బోలే షవాలి ఉన్నారు. ఇక ఈ వారం దీపావళి ఎపిసోడ్ సందర్భంగా ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అంటున్నారు. చూడాలి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X