Bigg Boss Telugu 7: శివాజికి ప్రశాంత్ టీమ్ వెన్నుపోటు.. విన్నర్ అవడం కోసం ఇంతకు దిగజారతారా!
సంచలనమైన కంటెంట్‌తో రికార్డు స్థాయి రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏకధాటిగా సీజన్లను ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఇలా ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతోన్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని ఎన్నో రకాల అంశాలను చూపిస్తున్నారు. ఇక, ఇప్పుడు ఇది ఫినాలే వీక్‌లో ఉంది. విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ శివాజికి వెన్నుపోటు పొడుస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు మీకోసం!
14వ వారంలోనే.. శోభా ఔట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన వారిలో 13 వారాల్లో 12 మంది వెళ్లిపోయారు. అయితే, 14వ వారంలోనే ఫైనల్ ఓటింగ్‌ను తీసుకు వచ్చారు. అంటే రెండు వారాల పాటు ఈ ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. ఇందులో తక్కువ పోలింగ్ వచ్చిన శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. ఫలితంగా 14వ వారం ముగిసే సమయానికి ఆరుగురు మిగిలారు.

టైటిల్ కోసం ఈ ఆరుగురు:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా ఉన్నారు. వారిలో శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్‌లు టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీళ్లలో విజేతను నిర్ణయించే ఓటింగ్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారు అన్నది ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.
ఆ ఇద్దరి మధ్య బిగ్ ఫైట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో విజేతను డిసైడ్ చేసే ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్, శివాజినే టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ సారి వీళ్లిద్దరిలోనే ఒకరు విన్నర్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీళ్లకు అమర్‌దీప్ చౌదరి నుంచి కూడా తీవ్ర స్థాయిలో పోటీ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ సీజన్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రశాంత్ ఫ్యాన్స్ స్పీడుగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఫినాలేకు చేరుకున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఈ సీజన్‌లో అతడిని ఎలాగైనా గెలిపించాలని ఫ్యాన్స్ పట్టుదలగా ఉన్నారు. ముఖ్యంగా ప్రశాంత్ టీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయింది. ఇందులో భాగంగానే అతడికి హాట్‌స్టార్, మిస్‌డ్ కాల్స్ ఓట్లు పడేలా విపరీతమైన ప్రచారాన్ని చేస్తున్నారు.
శివాజికి వెన్నుపోటు అని:పల్లవి ప్రశాంత్ ఫినాలేకు చేరడంలో అతడికి మద్దతుగా నిలిచిన శివాజి పాత్ర చాలా ఉందని చెప్పాలి. అంతలా అతడు రైతు బిడ్డకు మానసికంగా, శారీరకంగా సపోర్టు చేశాడు. అలాంటిది ఇప్పుడు ప్రశాంత్‌ను గెలిపించుకోవడం కోసం అతడి టీమ్ శివాజికి వెన్నుపోటు పొడిచినట్లు తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో కనిపించిన వీడియోతో ఇది చర్చనీయాంశం అయింది.

శివాజి కొడుకే చెప్పాడని:శివాజి చిన్న కొడుకు రిక్కీ తన తండ్రి గెలవకపోయినా పర్లేదు కానీ.. అందరూ ప్రశాంత్ అన్నకు ఓట్లు వేసి గెలిపించండి అని చెప్పినట్లుగా ఓ యూట్యూబ్ థంబ్‌నెయిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది. దీన్ని పల్లవి ప్రశాంత్ అభిమానులు ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. తద్వారా రైతు బిడ్డకు తండ్రిలా అండగా ఉన్న శివాజికే వెన్నుపోటు పొడుస్తున్నారని అంటున్నారు.
రిక్కీ ఏం చెప్పాడంటే:ఇటీవలే రిక్కీ 'నేను మీ శివన్న కొడుకు రిక్కీని. ఇంత కాలం మీ శివన్న మనల్ని గెలిపించాడు. ఇప్పుడు మనం గెలిపించాల్సిన సమయం వచ్చింది. ఈ పద్నాలుగు వారాలు మా నాన్నకు ఎలా అయితే ఓట్లు వేసి సేఫ్ చేశారో.. ఈ ఫినాలే వీక్ కూడా అలాగే ఓట్లు వేసి గెలిపిస్తారని అనుకుంటున్నా. అందరికీ నా తరపున, మా డాడీ తరపున చాలా థ్యాంక్స్' అని చెప్పొకొచ్చాడు.


Click it and Unblock the Notifications











