రైతు బిడ్డ రిచ్చు బిడ్డ కాదట... పల్లవి ప్రశాంత్ ఆస్తులపై అతని తండ్రి ఏం చెప్పారంటే?
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఎన్నో సీజన్స్ నుంచి కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఇస్తున్నా ఈసారి మాత్రం ఓ రైతుబిడ్డగా ఫేమస్ అయిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ హౌస్‌లో అడుగుపెట్టాడు. సోషల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్‌బేస్ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డగానే సుపరిచితం, ఎందుకంటే ఆయన మళ్లొచ్చిన అనే డైలాగుతో హౌస్ లోకి వచ్చాడు. అయితే అతని ఆస్తుల గురించి జరుగుతున్న ప్రచారం గురించి అతని తండ్రి క్లారిటీ ఇచ్చారు.
నిజానికి బిగ్‌బాస్‌లో పదేపదే తాను రైతుబిడ్డ అని చెప్పుకోవడం, సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడు అని భావించి మిగతా కంటెస్టెంట్లు అతడిని విమర్శిస్తూ నామినేషన్లు కూడా చేశారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రశాంత్ టార్గెట్ అయ్యాడు. ఆటను పేదవాడేమీ కాదు, 26 ఎకరాల భూమి, నాలుగు ఖరీదైన కార్లు, ఒక బంగ్లా కోట్ల ఆస్తి ఉందంటూ కొద్దిరోజుల నుంచి జోరుగా ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రచారంపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ మా వాడి గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారని అవేమీ నిజం కావని అన్నారు. 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవనాలు ఉన్నాయంటున్నారు కదా ఒకవేళ నిజంగా అవన్నీ ఉంటే మా అబ్బాయి బిగ్‌బాస్‌కు ఎందుకు వెళతాడు? అని ఆయన ప్రశ్నించాడు.
నాలుగు కార్లు ఉంటే పెద్ద ఉద్యోగం చేసుకునే వాడు కదా? అని పేర్కొన్న ఆయన అసలు మా వాడికి 26 ఎకరాల పొలం ఎక్కడున్నాయో చూపించమని ఆయన కోరారు. తమకి కేవలం ఆరెకరాల పొలం మాత్రమే ఉందని దాన్ని అందరికీ పంచితే ప్రశాంత్‌కు కేవలం రెండెకరాలు వస్తాయని చెప్పుకొచ్చారు. నా బిడ్డపై చిన్నచూపు చూస్తుంటే చాలా బాధేస్తుందని ఆయన ఎమోషనల్ అయ్యాడు.
ఒకవేళ నా కొడుకు బిగ్‌బాస్ గెలిస్తే వాడు చెప్పినట్లుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకోటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే ప్రాణాలు విడిచారన్న వారు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసని ఆయన అన్నారు.
పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ కోటాలో హౌస్లో అడుగు పెట్టిన ఆయనకి ప్రేక్షకులు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. మొదటి రెండు వారాలు పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నా అందరికంటే ఎక్కువ ఓట్లు అతనికి దక్కాయని అంటున్నారు.


Click it and Unblock the Notifications











