Pallavi Prashanth: అసలు రైతు బిడ్డవేనా ప్రశాంత్.. కప్ పట్టుకెళ్లి దాన్ని ఎలా వదిలేశావ్?
బిగ్ బాస్ తెలుగు 7 ఎట్టకేలకు ముగిసినా... పల్లవి ప్రశాంత్ అభిమానుల రచ్చ మాత్రం ముగియడం లేదు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాక ప్రశాంత్ స్టేజీ మీద ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు రూ.35లక్షల ప్రైజ్ మనీతో పాటు ఓ బ్రేజా కారు, 15లక్షల విలువైన ఆభరణాలు వచ్చాయి. అయితే రైతుల కోసం డబ్బును, నాన్న కోసం కారు, అమ్మ కోసం నగలు, తనకు ట్రోపీ అంటూ స్టేజీ మీద చెప్పుకువచ్చాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ కప్ కొట్టుకెళ్లిన ప్రశాంత్.. దాన్ని మాత్రం మరిచిపోయాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7లో ఓ కామన్ మ్యాన్ సంచలనం సృష్టించాడు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. మొదట హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రశాంత్.. రైతు బిడ్డ అంటూ గర్వంగా చెప్పుకున్నాడు. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. ఆ రోజున పల్లవిప్రశాంత్ కు నాగార్జున ఓ మిర్చి మొక్కను ఇచ్చాడు. దాన్ని నేను కాపాడుకుంటా అంటూ చెప్పి.. పల్లవి ప్రశాంత్ లోపలికి అడుగుపెట్టాడు.

ఇక ఇంట్లోకి వెళ్లాకా ప్రశాంత్, రతికాతో పులిహోర కలుపుతూ పక్కదారిపట్టాడు. మొదటి వారం ఎక్కడ చూసిన ఈ జంటే సపరేట్ గా కనిపించింది. ఇక ఈ సీజన్ లో వీరే లవ్ బర్డ్స్ అవుతారు అనిపించింది. ఇక రతికతో ప్రేమాయణం నడుపుతూ... మిర్చి మొక్కను మరిచిపోయాడు. ఇక రెండో వారం నామినేషన్స్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై ఇంటి సభ్యులు విరుచుకుపడ్డారు.
ఇక రతిక కూడా పల్లవిప్రశాంత్ పై విరుచుకుపడింది. ఇక రతికా రివర్స్ అవ్వడంతో.. ప్రశాంత్ షాక్ అయిన సంగతి తెలిసిందే. ఇక వీకెండ్ ఎపిసోడ్ లో ప్రశాంత్ మొక్క ఎండిపోవడంపై నాగార్జున క్లాస్ కూడా పీకాడు. నువ్వు అసలు రైతు బిడ్డవేనా అంటూ సిరియస్ అయ్యాడు. ఇక ప్రశాంత్ కూడా సారీ అంటూ ఆవేదన చెందాడు. ఇక మరో మొక్కను ఇచ్చిన నాగార్జున ఇది నీకు రెండో అవకాశం అంటూ చెప్పుకువచ్చాడు.

ఇక రెండోసారి మొక్కను జాగ్రత్తగా కాపాడుకున్నాడు ప్రశాంత్. బాధ వచ్చిన, సంతోషం వచ్చినా అక్కడే కూర్చోని సెంటిమెంట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక మిర్చి మొక్కతో క్రేజ్ సింపతి క్రియేట్ చేసుకున్న పల్లవి ప్రశాంత్... టైటిల్ విన్ అయ్యాక దాన్ని తీసుకువెళ్లడం మరిచిపోయాడు.

నాగార్జున.. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాక ఎమోషనల్ అయ్యాడు. రైతులకు రుణపడి ఉంటాను అంటూ వెల్లడించాడు. అంతే కాదు.. తన ప్రైజ్ మనీని రైతుల కోసం వాడుతాను అని తెలిపాడు. అయితే పల్లవి ప్రశాంత్ కప్ కొట్టుకెళ్లాడు కానీ మిర్చి మొక్కను మరిచిపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతలా మిర్చి మొక్కతో డ్రామా చేసిన పల్లవి ప్రశాంత్.. దాన్ని ఎలా బిగ్ బాస్ ఇంట్లోనే వదిలేశావ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలురైతు బిడ్డవేనా అంటూ సిరియస్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











