Bigg Boss Telugu 7: శివాజికి కోలుకోలేని షాకిచ్చిన ప్రశాంత్.. ఒక్క రోజులోనే అంతా ఉల్టా పుల్టా

పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కంటెంట్‌తో ప్రసారం అవుతున్నా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న షో బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా మారి.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్‌ను సరికొత్త కాన్సెప్టుతో నడుపుకుంటోంది. ఇందులో ఊహించని ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో శివాజికి ప్రశాంత్ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసమే!

ఏడో సీజన్‌ను సూపర్ సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వహకులు ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో వచ్చారు. ఇందులో ఏడో వారానికి సంబంధించి కెప్టెన్సీ టాస్కును ఏలియన్స్ స్పేస్ షిప్ కాన్సెప్టుతో ఇచ్చారు. పొరపాటున గులాబీపురం, జిలేబీపురం సరిహద్దులో ల్యాండ్ అయిన తమను మెప్పించేందుకు రెండు ఊర్లలోని సభ్యులు కొన్ని టాస్కులు ఆడాల్సి వచ్చింది.

Pallavi Prashanth Gives Shock to Sivaji in Bigg Boss Telugu 7 Show

గులాబీపురం, జిలేబీపురం వాళ్లకు కొన్ని పాత్రలను ఇవ్వగా వాళ్లు అలాగే నటిస్తూ ఏలియన్స్‌ను మెప్పించాలి. అలాగే మధ్యలో వాళ్లు ఇచ్చే టాస్కులను రెండు గ్రూపుల వాళ్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా మొదటి రౌండ్‌లో జిలేబీపురం వాళ్లు గెలుపొందారు. ఇక, గురువారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో సైతం రెండో రౌండ్‌ను ఆ టీమ్ సభ్యులే గెలుపొందారు.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వైర్లకు సంబంధించిన మరో టాస్కును కూడా ఇచ్చారు. స్పేస్ షిప్‌కు అనుసంధానం చేయాల్సి అన్ని వైర్లు చిక్కుపడి ఉంటాయి. వాటిని కరెక్టుగా తీసి ప్లగ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక వైరును సెట్ చేసిన తర్వాత ఆ టీమ్ సభ్యుడు తమ టీమ్ పేరిట ఉన్న జెండాను అక్కడ గుచ్చాలి. మొత్తం తొమ్మిది వైర్లలో 5 కరెక్టుగా పెట్టిన వాళ్లు గెలుస్తారు.

వైర్ల టాస్కులో భాగంగా జిలేబీపురం నుంచి పల్లవి ప్రశాంత్, గులాబీపురం నుంచి గౌతమ్ కృష్ణలు పోటీ పడ్డారు. అతి కష్టమైన టాస్కులు వీళ్లిద్దరూ ఎంతో శ్రమించి ఆడారు. చివరకు క్షణాల వ్యవధిలోనే టార్గెట్‌ను పూర్తి చేసిన గౌతమ్ తమ గులాబీపురం జట్టును గెలిపించాడు. దీంతో 3లో 2 రౌండ్లు గెలిచిన జిలేబీపురం టీమ్ సభ్యులే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని ప్రకటించారు.

Pallavi Prashanth Gives Shock to Sivaji in Bigg Boss Telugu 7 Show

పల్లవి ప్రశాంత్ ఓడిపోయిన తర్వాత సరికొత్త చర్చ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏలియన్స్ టాస్కులో భాగంగా మొదటి రౌండ్‌లో జిలేబీపురం వాళ్లు గెలిచిన తర్వాత సంచాలకుడు శివాజి 'నాకు తెలుసురా మీరే గెలుస్తారని. ప్రశాంత్ గాడు ఉన్న టీమ్ ఇప్పటి వరకూ ఓడిపోలేదు' అంటూ పొగిడాడు. దీంతో అతడి మాటలకు కొందరు అభ్యంతరం చెప్పారు.

పల్లవి ప్రశాంత్ టాస్కుల్లో ఓడిపోలేదు అని శివాజి చెప్పిన మరుసటి రోజునే అతడు గౌతమ్ కృష్ణ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇలా రైతు బిడ్డ.. తన గురువుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హైలైట్ చేస్తున్నారు. శివాజి అన్న మాటలు, ప్రశాంత్ ఓడిపోయిన వీడియోను కలిపి షేర్ చేస్తూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X