Bigg Boss 7 Telugu: ఆ అమ్మాయికి కిస్ ఇచ్చిన ప్రశాంత్.. లవ్ సింబల్ వేసి మరీ.. కెమెరాకు చిక్కడంతో!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో స్పందనను సంపాదించుకుని.. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతూ.. నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. టెలివిజన్ రంగంలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసేలాంటి కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతోందీ షో.

ఫలితంగా సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఓ అమ్మాయికి కిస్ ఇచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

నిజంగా ఉల్టా పల్టా కాన్సెప్టే: భారతదేశంలోని చాలా భాషల్లో వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై మాత్రమే బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అందుకే నిర్వహకులు క్రమం తప్పకుండా సీజన్లను తీసుకుని వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడిపిస్తున్నారు. ఇందులో గతంలో కంటే భిన్నమైన కంటెంట్‌ను చూపిస్తూ మజాను పంచుతున్నారు.

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

జంటగా హైలైట్ చేశారుగా: బిగ్ బాస్ షోలో ఎక్కువగా హైలైట్ అయ్యేది కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే లవ్ ట్రాకులే అని చెప్పుకోవచ్చు. వాళ్ల మధ్య లవ్ ఉన్న లేకున్నా.. నిర్వహకులు మాత్రం జోడీలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లోనూ కనీసం ఒక్క జంటనైనా హైలైట్ చేస్తున్నారు. ఇలా ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య ట్రాకును బాగా ఫోకస్ చేస్తున్నారు.

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

లేడీ లక్.. దిల్ ఇస్తానంటూ: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కామన్ మ్యాన్‌ కోటాలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వగా.. హీరోయిన్‌గా రతికా రోజ్ వచ్చింది. ఆరంభంలో నవీన్ పోలిశెట్టి వచ్చి అతడిని నీ లేడీ లక్ ఎవరని అడిగాడు. దీంతో రతికా పేరు చెప్పాడు. అప్పటి నుంచి వీళ్ల బంధం ఏర్పడింది. ఆ తర్వాత రతికా ఏకంగా తన దిల్‌ను ప్రశాంత్‌కు ఇస్తానని చెప్పడంతో అది ఇంకా ఇంకా బలపడింది.

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

నోట్లో ముద్ద పెట్టమంటూ: బిగ్ బాస్ హౌస్‌లో రతికా రోజ్ - పల్లవి ప్రశాంత్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు జోరుగా మీడియాలో కథనాలు వస్తునే ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లోనే వీళ్లిద్దరి వ్యవహార శైలి సైతం దానికి బలం చేకూర్చే విధంగానే ఉంటోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిపోడ్‌లో రతిక అన్నం తినిపిస్తానని అనడంతో.. ప్రశాంత్ ఏకంగా తనకు నోట్లో ముద్దలు పెట్టాలని డిమాండ్ చేశాడు.

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

చేతిలో ముద్ద.. తియ్యగా: ప్రశాంత్ తనకు నోట్లో అన్నం ముద్దలు పెట్టాలని అడగడంతో రతికా రోజ్ మాత్రం అతడికి చేతిలోనే పెట్టింది. అది తిన్న తర్వాత అతడు 'తియ్యగా ఉంది. ఈరోజుకు ఇది చాలు. గుర్తు పెట్టుకుంటాను' అంటూ తెగ మురిసిపోయాడు. ఆ తర్వాత ముద్దను నోట్లో పెట్టమని అడగ్గా రతిక మాత్రం చేతిలోనే పెట్టింది. దీంతో ప్రశాంత్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు.

 Pallavi Prashanth Kiss to Rathika Rose in Bigg Boss Show

లవ్ సింబల్ వేసి పేర్లు: అన్నం తినేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లి ఓ సోఫాలో కూర్చున్న పల్లవి ప్రశాంత్.. దానిపై లవ్ సింబల్ వేసి 'PR' అని రాశాడు. అప్పుడే రతికా రోజ్ అక్కడకు వచ్చి 'ఆ డబ్బా పక్కకు పెడదాం ఒకసారి వస్తావా' అని అడిగింది. ఆ తర్వాత అతడు రాసింది చూసి ఎందుకు అలా రాశావు అని ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్ 'అందులో ఉన్నది నా పేరే' అని చెప్పాడు.

నీక్కూడా కిస్ ఇస్తానని: సోఫాపై పేరు రాసిన తర్వాత అటు వైపు చూస్తూ ప్రశాంత్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో రతికా 'నీ పేరు రాసుకుని నీకు నువ్వే కిస్ ఇచ్చుకున్నావా' అని ప్రశ్నించింది. దీంతో ప్రశాంత్ 'అయితే నీకు ఇవ్వనా' అంటూ ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. దీంతో సిగ్గు పడిన రతికా చుట్టూ చూసింది. అప్పటికే వాళ్లను కెమెరా బంధించడంతో బుక్కైపోయామని సిగ్గు పడిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X