Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రశాంత్ మాస్ వార్నింగ్.. పంచ ఊడిపోకుండూ చూస్కో అంటూ..!
బిగ్ బాస్ తెలుగు తెలుగు సీజన్ 7 షో మరికొన్ని వారాల్లో ముగియబోతుంది. ప్రస్తుతం 12వ వారానికి చేరుకున్న ఈ షోలో ఈరోజు నామినేషన్ల పర్వం రసవత్తరంగా సాగింది. ఎప్పటిలాగే ఫుల్లు గొడవలు, అరుపులు, అగ్రెషన్ల మధ్య నామినేషన్స్ వేశారు హౌస్ మేట్స్. ఆదివారం ఎపిసోడ్ లోనే పల్లవి ప్రశాంత్ ను స్నేహితుడిగా స్వీకరిస్తున్నానని చెప్పిన గౌతమ్ కృష్ణ.. సోమవారం రోజు ఆయననే నామినేట్ చేయడం విచిత్రంగా తోస్తోంది. ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడే తప్ప నిజంగానే లోపల నుంచి పల్లవి ప్రశాంత్ తో స్నేహం చేసే ఉద్దేశం గౌతమ్ కృష్ణకు లేనట్లు అర్థం అవుతోంది.
ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో చాలా వాడీవేడీగా వీరిద్దరి మధ్య సంభాషలణలు చోటుచేసుకున్నాయి. ముందుగా పల్లవి ప్రశాంత్.. గౌతమ్ కృష్ణను నామినేటే చేసేందుకు పిలిచి కారణాలు చెప్పాడు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా... గౌతమ్ కృష్ణ కొన్ని కామెంట్లు చేశాడు. ముఖ్యంగా నా పంచ ఆనవాయితీ లాగా నీకు ఆ ఆనవాయితీ ఉందంటూ చెప్పుకొచ్చాడు. దీనికి వెంటనే పల్లవి ప్రశాంత్ ఆ పంచ ఊడిపోకుండా చూస్కో అంటూ నోరుజారాడు. దీనికి గౌతమ్ కృష్ణ చాలా కోప్పడ్డాడు.

పంచ అనేది తెలుగోడి సంస్కృతి నువ్వు దాని గురించి మాట్లాడకూ అంటూ చెప్పుకొస్తాడు. నువ్వు ఇట్ల మాట్లాడుడు మంచిది కాదంటూ గట్టిగా అరుస్తాడు. అందుకు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అపరిచితుడు సినిమాలో రాములా మారిపోయి సరే సరే అంటూ ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు చాలా వెటకారంగా ఉన్నాయి. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ.. ఎక్కువ తక్కువ మాట్లాడకు అంటూ రైతుబిడ్డ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. ఆ తర్వాత గౌతమ్ కృష్ణ నీతో ఇలా మాట్లాడడం వేస్ట్ అని చెబుతూ వెనక్కి వెళ్లిపోవడం చూపించారు.
ఇదంతా అయిపోయాకా.. పల్లవి ప్రశాంత్ ఓ భారీ డైలాగ్ కొట్టాడు. సింహానికి ఆకలి ఎక్కువ, పల్లవి ప్రశాంత్ కు పవర్ ఎక్కువ.. సింహం వేటాడుతది, పల్లవి ప్రశాంత్ ఆకలి కోసం ఆటాడుతడు అంటూ చివర్లో చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అయితే ఈ వారం నామినేషన్లలో టాప్ కంటెస్టెంట్లు ఉన్నారు. బిగ్ బాస్ ముద్దుబిడ్డలు.. శోభాశెట్టి, ప్రియాంక జైన్ తప్ప అంతా నామినేషన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. నామినేషన్స్ లో ఎక్కువగా ప్రిన్స్ యావర్ కు ఓట్లు పడినట్లు తెలుస్తోంది.

ఇలా 12వ వారంలో భాగంగా మొత్తం 8 మంది నామినేషన్లలోకి వచ్చారు. టాప్ కంటెస్టెంట్లు.. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, రితికా రోజ్, అశ్విని శ్రీలు నామినేట్ అయ్యారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని నాగార్జున ఇప్పటికే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఏం జరగనుంది అనేది. ఎవరెవరు ఎలిమినేట్ కాబోతున్నారు అని.


Click it and Unblock the Notifications











