Bigg Boss Telugu 7: పల్లవి ప్రశాంత్‌ ఎలిమినేట్.. ఫినాలే ముందు షాకింగ్ ట్విస్ట్.. విన్నర్ ఆ ఇద్దరిలో!

ఎన్నో అంచనాలతో ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఫినాలే ఎపిసోడ్ కూడా జరగనుంది. దీంతో షో నిర్వహకులు షోను మరింత రంజుగా సాగేలా ప్లాన్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా కఠినమైన టాస్కులు ఇచ్చి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఈ సీజన్‌లో ప్రస్తుతం 'టికెట్ టు ఫినాలే' టాస్కును నిర్వహిస్తున్నారు. ఇందులో ఊహించని ఎన్నో పరిణామాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీని నుంచి ఓ షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

టికెట్‌ టు ఫినాలే.. ఫైనల్ అస్త్ర
గ్రాండ్ ఫినాలే వీక్‌కు రెండు వారాల ముందే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు 'టికెట్ టు ఫినాలే' అనే టాస్కును ఇస్తూ ఉంటారు. ఇది గెలుచుకున్న ఒక సభ్యుడు నేరుగా ఫైనల్‌లోకి అడుగు పెడతాడు. ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి ఈ టాస్క్‌ను 'ఫైనల్ అస్త్ర' అనే పేరుతో మంగళవారం ఎపిసోడ్‌ నుంచి ప్రారంభించారు. ఇందులో కంటెస్టెంట్లతో ఎన్నో గేమ్స్ ఆడిస్తున్నారు.

 Pallavi Prashanth Out From Final Astra Race in Bigg Boss Telugu 7 Show

వాళ్లంతా ఎలిమినేట్ అయ్యారు
బిగ్ బాస్ ఫైనల్ అస్త్ర టాస్కులో భాగంగా ముందుగా దీని నుంచి శివాజి, శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యారు. వాళ్లు తమ పాయింట్లను అమర్‌దీప్ చౌదరికి ఇచ్చారు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా ఔట్ అయింది. ఆమె పాయింట్లను గౌతమ్‌కు ఇచ్చేసింది. అనంతరం యావర్ ఎలిమినేట్ అవడంతో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.

గౌతమ్ కూడా ఎలిమినేషన్‌తో
ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఫైనల్ అస్త్ర పోటీలో గురువారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, అంబటి అర్జున్, గౌతమ్ కృష్ణలు నాలుగు స్థానాల్లో నిలిచారు. ఐదో ఆ తర్వాత జరిగిన టాస్కులో గౌతమ్ ఓటమి పాలయ్యాడు. దీంతో అతడు ఈ టాస్కు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నేటి ప్రోమోలో సైతం చూపించిన విషయం తెలిసిందే.

 Pallavi Prashanth Out From Final Astra Race in Bigg Boss Telugu 7 Show

అమర్‌కు 1000 పాయింట్లు
ఫైనల్ అస్త్ర పోటీ నుంచి తప్పుకున్న గౌతమ్ కృష్ణ తన పాయింట్లను అమర్‌దీప్ చౌదరికి ఇచ్చాడు. అంతేకాదు, 'ఇప్పుడు నేను ఇస్తున్న పాయింట్లు ప్రియాంకవేరా. నువ్వు ఇంకెప్పుడూ తనను ఏమీ అనొద్దు' అని చెప్పాడు. దీంతో శోభా శెట్టి, అమర్‌దీప్‌ చౌదరికి కోపం వచ్చింది. ఇక, గౌతమ్ ఇచ్చిన వాటితో కలుపుకుని అమర్‌దీప్‌ ఖాతాలో 1000 పాయింట్లు వచ్చి చేరిపోయాయి.

మరో రెండు టాస్కులు కూడా
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఫైనల్ అస్త్ర నుంచి గౌతమ్ ఎలిమినేట్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్‌లకు మరో రెండు టాస్కులను కూడా ఇచ్చినట్లు తెలిసింది. ఈ రెండింటిలోనూ పల్లవి ప్రశాంత్ ఓటమి పాలయ్యాడని ఓ న్యూస్ లీకైంది. తద్వారా అతడు ఈ రేసు నుంచి ఎలిమినేట్ అయిపోయాడని సమాచారం.

ఫినాలే ముందు బిగ్ ట్విస్టు
వాస్తవానికి ఫైనల్ అస్త్ర రేసులో పల్లవి ప్రశాంత్ అద్భుతంగా ఆడాడు. అతడితో పాటు అర్జున్ కూడా తనదైన ఆటతీరును కనబరిచాడు. దీంతో ఈ రేసులో వీళ్లిద్దరే టాప్ 2 స్థానాల్లో ఉండాల్సింది. కానీ, పాయింట్లను ఇవ్వడం అనే కాన్సెప్టును తీసుకు రావడంతో అమర్‌దీప్ అందరి కంటే టాప్‌లో నిలిచాడు. ఇప్పుడు ప్రశాంత్ దీని నుంచి వెళ్లిపోవడం బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి.

 Pallavi Prashanth Out From Final Astra Race in Bigg Boss Telugu 7 Show

విన్నర్ ఆ ఇద్దరిలో ఒకరు
ముందుగానే చెప్పుకున్నట్లు ముగ్గురిలో నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమినేట్ అవడంతో ఫైనల్ అస్త్ర రేసులో ఇప్పుడు అమర్‌దీప్ చౌదరి, అంబటి అర్జున్ మాత్రమే మిగిలారు. అంటే వీళ్లిద్దరిలోనే ఒకరు ఈ సీజన్‌లోని ఫైనల్ అస్త్రాన్ని గెలుచుకుంటారు. అదే జరిగితే ఈ సీజన్‌లో ఫినాలేకు చేరుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్‌గా నిలుస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X