జైలు నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్ మొదటి పార్టీ.. అదికూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్లతో.. ఎవరెవరు వచ్చారో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్ల గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని స్థాయిలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న ఈ షో విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచాడనే విషయం అందరికీ తెలిసిందే. అయితే అతడు విన్నర్ గా గెలవడం.. గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు రావడంతో అసలు కథ ప్రారంభం అయింది. కంటెస్టెంట్లపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేయడం.. కార్లు, బస్సులను ధ్వంసం చేయడం అందరికీ తెలిసిందే.
ఇలా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఫుల్ రచ్చ చేయడంతో.. పోలీసులు రైతుబిడ్డపై కేసు పెట్టారు. ఆయనతో పాటు ఆయన అభిమానులను కూడా కొందరిని అరెస్ట్ చేశారు. జైల్లో కూడా పెట్టగా.. ఎట్టకేలకు పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. అయితే హౌస్ లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ కు శివాజి, ప్రిన్స్ యావర్ లు ఎంతో అండగా ఉన్నారు. వారితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన భోలె షవాళి కూడా సాయంగా నిలిచారు. ఇలా హౌస్ లో చాలా క్లోజ్ గా ఉన్న వీళ్లు బయట రైతుబిడ్డ అరెస్టు తర్వాత పెద్దగా స్పందించకపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.

ముఖ్యంగా శివాజి స్పందించకపోవడంతో పెద్ద రచ్చే చేశారు. ప్రిన్స్ యావర్, భోలె షవాళి, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్ లు బాగా సపోర్ట్ చేశారు. రైతుబిడ్డను బయటకు తీసుకు వచ్చేందుకు హల్ప్ చేశారు. అయితే ఇక్కడ శివాజి కనిపించకపోవడంతో స్పై బ్యాచ్ ఫ్యాన్స్ అంతా ఫుల్ నిరాశలో కూరుకుపోయారు. కానీ శివాజి ఓ వీడియో విడుదల చేసి వారికి సమాధానం చెప్పారు. ఈక్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ రావడం.. జైలు నుంచి ఆయన ఇంటికి రావడం చకచకా జరిగిపోయాయి. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అతడు బయటకు వచ్చాక దాన్ని అస్సలే ఆస్వాదించలేకపోయారు.
అయితే ఇప్పుడిప్పుడే ఆయన పార్టీలు స్టార్ట్ చేశారు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతోనే తాను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీకి హాజరు కాని శివాజి పల్లవి ప్రశాంత్ ఇంటికి రావడం గమనార్హం. ఆయన ఒక్కడే కాకుండా ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, నయని పావని, భోలె షవాళి కూడా వచ్చారు. ఇలా అంతా కలిసి రైతుబిడ్డ కోసం రావడం.. అతడితో కలిసి ఆయన ఇంట్లోనే భోజనం చేయడం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన స్పై బ్యాచ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. మీరెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ కోరుకుంటున్నారు.

ప్రస్తుతం యూట్యూబ్ లో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన వీడియోనే వైరల్ గా మారింది. మీరూ ఓసారి ఈ వీడియో చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి. అలాగే హౌస్ లో ఉన్నంత సేపు మాత్రమే శివాజి సింపతీ కోసం రైతుబిడ్డకు సాయం చేశాడు అనుకునే వాళ్లు కూడా ఈ వీడియో చూస్తే స్పై బ్యాచ్ గురించి అర్థం అవుతుంది. మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఓసారి లుక్కేయండి.


Click it and Unblock the Notifications











