Pallavi Prashanth: పరారీలో పల్లవి ప్రశాంత్.. వీడియో రిలీజ్ చేసి సంచలనం
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా ఉన్న పల్లవి ప్రశాంత్ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయగా ఇప్పటికే డ్రైవర్లను అరెస్ట్ చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళితే అక్కడ లేడని పరారీలో ఉన్నాడని మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం మీద స్పందిస్తూ ప్రశాంత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే...
సోషల్ మీడియాలో రైతు బిడ్డ అంటూ పాపులారిటీ దక్కించుకున్న పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 తెలుగులో కామన్ మ్యాన్ క్యాటగిరీలో ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే తనదైన శైలిలో సింపతి దక్కించుకుంటూ అందరితోనూ మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫైనలిస్ట్ గా మారి చివరికి కప్పు కూడా దక్కించుకున్నాడు. ఇక కప్పు దక్కించుకున్న తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పరిస్థితి బాలేదని పోలీసులు వెనుక గేట్ నుంచి ప్రశాంత్ అండ్ కోరి పంపించేశారు.

అయితే తాను గెలిచాను ఎవరికో భయపడి వెళ్ళిపోయేదేంటి అని పల్లవి ప్రశాంత్ పోలీసులు చెబుతున్న వినకుండా మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చాడు. అప్పటికే పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెబుతున్న చాలామంది అమరదీప్ గీతు అశ్విని శ్రీ వడ్డీ వారి కారులను ధ్వంసం చేసి దాదాపు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పోలీసులు ప్రశాంతను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతున్న వినకుండా ప్రశాంతంగా రైతు బిడ్డని తనను ఇలా వెనక్కి లాగడం ఏమాత్రం కరెక్ట్ కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపద్యంలోనే పోలీసులు అతని మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో A1 ముద్దాయిగా పల్లవి ప్రశాంత్ పేరును చేర్చారు. ఇదే కేసులో A4, A5గా ఉన్న పలోవి ప్రశాంత్ కార్ల డ్రైవర్లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడంతో పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతుండగా ఆ విషయం మీద తాజాగా ప్రశాంతి స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ... అన్నా నేను ఎక్కడికి పోలే... అన్ని తప్పుడు సమాచారాలు.. నేను ఇంటికాడనే ఉన్నాను... అంటూ చెప్పుకువచ్చాడు. ఆ తర్వాత గ్రామస్థుల దగ్గరకు వెళ్లి వాళ్లతో మాట్లాడించారు. వాళ్లంతా ప్రశాంత్ ఇక్కడే ఉన్నాడు అని చెప్పుకువచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్ ఓ మాల వేసుకున్న అతని దగ్గరకు వెళ్లి మాట్లాడించారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ... పడి పూజ ఉండటం వల్ల అక్కడికి వచ్చాడు అని ఆయన చెప్పుకువచ్చాడు. ఇక అక్కడి గ్రామస్థులతో కూడా మాట్లాడించాడు.
ఆ తర్వాత వారంతా ప్రశాంత్ ఎక్కడికి పోలేదు అంటూ చెప్పుకువచ్చారు. తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయొద్దు అంటూ వెల్లడించారు. ప్రశాంత్ మాట్లాడుతూ... నేను ఎక్కడికి పోలేదు.. ఇంట్లోనే ఉన్నాను.. నేను ఎక్కడికి పోలేదు.. నా వల్ల ఇబ్బంది కలిగితే క్షమించండి. నేనేమి తప్పు చేయలేదు. నా ఫోన్ స్విచ్ఛాఫ్ అయిందని ఫోన్ చూడలేదు. నేను ఇంటికాడనే ఉన్నాను. టెన్షన్ పెడుతున్నారు అందరూ.. అంటూ వెల్లడించారు. జై జవాన్ జై కిసాన్.. మల్లొచ్చినా అంటే తగ్గేదేలే అంటూ చెప్పుకువచ్చాడు. అందరికీ థ్యాంక్యూ సో మచ్ అని వివరించాడు.


Click it and Unblock the Notifications











