Bigg Boss Telugu 7: ప్రేమపై పెదవి విప్పిన పల్లవి ప్రశాంత్.. ఆ పని చేస్తున్నాడని మరో కుర్రాడితో!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకుని.. దాదాపు ఏడేళ్లుగా రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అందుకే నిర్వహకులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సీజన్లను తీసుకు వస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని వినూత్నంగా నడుపుతున్నారు. ఇక, ఇందులో కామన్ మ్యాన్‌గా వచ్చి సంచలనం అయిన పల్లవి ప్రశాంత్ తాజాగా తన ప్రేమకథను బయట పెట్టేశాడు. ఆ సంగతులేంటో మీరు కూడా చూసేయండి మరి!

కామన్ మ్యాన్‌గా సంచలనం: ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏడో దానిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా స్టార్ట్ చేశారు. ఇందులోకి 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడని చెప్పాలి. ఆరంభంలోనే తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచాడు.
దూరం పెట్టేసి.. క్లోజ్‌గా మారి: బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కొత్తలో పల్లవి ప్రశాంత్‌తో శివాజి, ప్రిన్స్ యావర్ తప్ప ఎవరూ పెద్దగా కలిసేవారు కాదు. కొందరు కంటెస్టెంట్లు అయితే కావాలనే దూరం పెట్టారు. అలాంటిది ఇప్పుడు చాలా మంది అతడికి ఫ్రెండ్స్ అయిపోయారు. అంతలా ఈ సీజన్‌లో ప్రశాంత్ తనదైన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకున్నాడు. హౌస్‌లోనే కాదు బయట కూడా ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
ఎవిక్షన్ పాస్.. ఫైనల్ అస్త్ర: ప్రిన్స్ యావర్ ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేయడంతో 12వ వారంలో దీన్ని మరోసారి నిర్వహించారు. అయితే, ఈ సారి హౌస్‌లోని అందరు కంటెస్టెంట్లకు 'బ్యాలెన్స్' టాస్కును ఇచ్చారు. ఇందులో అదరగొట్టిన ప్రశాంత్.. ఈ పాస్‌ను గెలుచుకున్నాడు. అలాగే, 13వ వారం జరిగిన 'ఫైనల్ అస్త్ర' పోటీలోనూ టాప్ 3లో నిలిచాడు. తద్వారా తన సత్తాను నిరూపించుకున్నాడు.
ప్రేమపై ప్రశాంత్ స్పందన: 'ఫైనల్ అస్త్ర' టాస్క్ జరుగుతోన్న సమయంలో బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లతో కాసేపు సరదాగా వ్యవహరించాడు. ఇందులో భాగంగానే వాళ్లకు టీ టైంను ఇచ్చి.. ప్రేమ కథలను చెప్పమని అడిగాడు. అప్పుడు అందరూ తమ లవ్ స్టోరీలను వెల్లడించారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ తన మొదటి ప్రేమ గురించి ఎమోషనల్ అవుతూ తొలిసారిగా పెదవి విప్పేశాడు.
ముఖం అద్దంలో చూశాడా: పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షోలో తన ప్రేమకథను వివరిస్తూ.. 'నేను స్కూల్‌కు పోయేటప్పటి నుంచి అమ్మాయిలతో పెద్దగా మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే ఒక అమ్మాయి నా కలర్ గురించి మాట్లాడింది. వాడి ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడా అని కామెంట్ చేసింది. అప్పటి నుంచి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది' అంటూ చెప్పుకొచ్చాడు.
నెంబర్ తీసుకుని మెసేజ్: ప్రశాంత్ కంటిన్యూ చేస్తూ.. 'ఒక అమ్మాయి పొలం దగ్గర ఉంది. నేను టాక్టర్ మీద స్టైల్‌గా పోతుంటే ఒక రోజు హాయ్ చెప్పింది. ఆ తర్వాత నా నంబర్ తెలుసుకొని హాయ్ అంటూ మెసేజ్ కూడా చేసింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమె నాకు మరదలు అవుతుందని తెలిసింది. అలా కొద్ది రోజులు బాగానే మాట్లాడింది. కానీ, మా మధ్యలోకి ఒకడు వచ్చాడు' అని వెల్లడించాడు.
అనుమానం రాలేదు కానీ: ప్రశాంత్ కొనసాగిస్తూ.. 'నాతోనే ఎప్పుడూ మాట్లాడే ఆ ఫ్రెండ్ వచ్చిన తర్వాత నాకు దూరం అవుతూ వచ్చింది. అప్పటి నుంచి ఎందుకనో మాటలు తగ్గించింది. నన్ను చూడడమే మానేసింది. నేను వంద మెసేజ్‌లు చేసినా రిప్లై ఇవ్వలేదు. చివరికి పొలం పనులు మానేస్తే ప్రేమిస్తా అంది. నేను కుదరదు అన్నా. దీంతో వాడితో వెళ్లిపోయింది' అంటూ ఫెయిల్యూర్ లవ్ రివీల్ చేశాడు.


Click it and Unblock the Notifications











