Bigg Boss 7 Winner పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ కావాలంటే పొలంలో పని చేయాలా.. ఇదేం వితండ వాదన మాస్టారు?
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి. ఇక ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఈవెంట్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ అత్యుత్సాహంతో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే విన్నర్ అయ్యాక పల్లవి ప్రశాంత్ చాలా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నట్లు నెట్టింట్లో వీడియోలో హల్ చల్ చేస్తున్నాయి. తన ఇంటర్వ్యూ ఇవ్వాలంటే.. తన పోలంలో పని చేయాలి అంటూ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఎట్టకేలకు ముగిసింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ పాపులర్ రియాలిటీ షో 105 రోజుల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. ఇక ఈ సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. అమర్ దీప్ రన్నరప్ గా నిలవగా.. శివాజీ మూడవ స్థానం కైవసం చేసుకున్నారు.

ఒక కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ హౌస్ లో అడుగుపెట్టి... రైతు బిడ్డ అనే ట్యాగ్ తో ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్నాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత సేపు వినయ విధేయ ప్రశాంత్ అన్నట్లు బిహేవ్ చేసిన ప్రశాంత్.. విజేతగా నిలిచిన అనంతరం రూడ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. హౌస్ లో అమాయకుడు.. ఏమి తెలియదు.. అన్నట్లు యాక్ట్ చేసిన ప్రశాంత్.. బయటకు వచ్చాక తన రెండో ముఖాన్ని చూపిస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నాడు.
బిగ్ బాస్ ట్రోపీ గెలిచిన అనంతరం పలువురు యూట్యూబర్స్ ప్రశాంత్ దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరారు. దానికి ప్రశాంత్ మీరేమైనా ఒక్క రైతుకు అయినా హెల్ప్ చేశారా నేను ఎందుకు ఇవ్వాలి.. నా పొలంలోకి పోదాం.. నా పొలంలో ఒక్క రోజైనా పని చేశారా అంటూ కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానెల్ రైతుకు ఏం ఇస్తుంది.. అంటూ రూడ్ గా బిహేవ్ చేశాడు. రైతులకు ఏం ఇస్తారో ఇవ్వండి అంటూ మళ్లీ రైతు సెంటిమెంట్ తీసుకువచ్చాడు.

ఇక ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రశాంత్ రెండు ముఖాలు చూసి నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి పోయేందుకు అన్నా మల్లొచ్చినా అంటూ అడుక్కున్న ప్రశాంత్... ఈరోజు బిగ్ బాస్ టైటిల్ విన్ అయ్యాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి పోయేందుకు ఎన్నో యూట్యూబ్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రశాంత్.. ఇప్పుడు గెలిచాక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే పొలం దగ్గరకు రావాలి అంటూ కండిషన్స్ పెడుతున్నాడు.
ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు. మరోవైపు ఆయన ఫ్యాన్స్ సైతం రూడ్ గా బిహేవ్ చేసిన సంగతి తెలిసిందే. అమర్ దీప్ ఫ్యామిలీ, గీతు రాయల్, అశ్విని కార్లను ధ్వంసం చేశారు. టీఎస్ ఆర్టీసీ బస్సులపై కూడా దాడికి పాల్పడ్డారు. మరోవైపు ప్రశాంత్ పై కేసులు సైతం నమోదు అయ్యాయి.


Click it and Unblock the Notifications











