Bigg Boss 7:మోనితపై డాక్టర్ బాబు అశ్లీల సైగలు..నామినేషన్స్‌లో పల్లవి ప్రశాంత్ కామెంట్స్..ఒప్పుకున్న జ్యూరీ!
బిగ్ బాస్ సీజన్ 7 నాలుగోవారంలోకి ఎంటర్ కాగా... నాలుగో వారం నామినేషన్స్ ముగిశాయి. ఇక హౌజ్లోని కంటెస్టెంట్స్... ఒకరిపై ఒకరు వాదనలు చేసుకుంటూ... గొడవలకు దారి తీశారు. ఇక ఈ వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి. ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తంలో శోభా శెట్టి, సందీప్, శివాజీ జ్యూరీగా అంటే జడ్జిలుగా వ్యవహరించారు. ఈసారి కంటెస్టెంట్స్‌లో ఎవరు నామినేట్ అవ్వాలి అనే విషయాన్ని సగం వరకు కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే.. తుది నిర్ణయం వీరు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ నామినేట్ గౌతమ్ కృష్ణను నామినేట్ చేశాడు. ఇక ఆయన చెప్పిన రీజన్ ఏంటి.. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతోంది. ఇక నాలుగో వారం నామినేషన్స్ హాట్ హాట్ గా ముగిశాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటూ... మొత్తానికి పూర్తయ్యాయి. ఇక హౌజ్ మేట్స్ గా ఎంపిక అయిన శోభా శెట్టి, సందీప్, శివాజీ ఈ నామినేషన్స్ ప్రక్రియలో జ్యూరీగా వ్యవహారించారు. ఇక ఎవరు నామినేట్ అవ్వాలి అని కంటెస్టెంట్స్ సగం వరకు డిసైడ్ చేస్తే... వీరు తుది నిర్ణయం తీసుకుంటారు. ఇక పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ విషయానికి వస్తే... అమర్‌దీప్‌ను, గౌతమ్ కృష్ణను నామినేట్ చేశాడు.

ఇక అమర్ దీప్.. కంటెండర్ షిప్ విషయంలో తప్పు పడుతూ పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. ఇక ఆ విషయం పక్కన పెడితే... గౌతమ్ కృష్ణ విషయానికి వస్తే... శోభా శెట్టితో గౌతమ్ గొడవను గుర్తుచేస్తూ తనను నామినేట్ చేశాడు. పవర్ అస్త్రా విషయంలో గౌతమ్ కు, శోభా శెట్టికి మధ్య వార్ జరిగిన విషయం తెలిసిందే. అదే సమయంలో గౌతమ్.. కోపంతో షర్ట్ విప్పి.. నా బాడీ నా ఇష్టం అంటూ శోభాశెట్టి ముందు అరిచాడు.
పల్లవి ప్రశాంత్.. నామినేషన్ కు ఆ విషయాన్ని కారణంగా చూపిస్తూ... గౌతమ్ కృష్ణను నామినేట్ చేశాడు. బాడీ చూపించడంతో పాటు షో ఆఫ్ చేస్తున్నావంటూ శోభాకు చేతితో అసభ్యంగా సైగలు చేసి చూపించాడని పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. శోభా కూడా ఏదో మ్యానరిజం చూపించావు అంటూ ప్రశాంత్ ఆరోపణతో ఒప్పుకుంది. అమ్మాయి ముందు షర్ట్ విప్పడం కరెక్ట్ కాదని పల్లవి ప్రశాంత్ చెప్పుకువచ్చాడు. ఈ విషయంపై కాస్త వాదనలు జరిగాయి.
ఇక గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ... అందరూ తనను రోజూ షర్ట్ లేకుండా చూస్తున్నారు కదా అని అన్నాడు. అది వేరు.. ఇదివేరంటూ ప్రశాంత్ చెప్పుకువచ్చాడు. శోభా శెట్టి కూడా చేతితో గౌతమ్ సైగలు చేసి చూపించాడని ఒప్పుకుంది శోభా శెట్టి. దీంతో పల్లవి ప్రశాంత్ ఆరోపణ మరింత బలంగా మారి గౌతమ్ నామినేట్ అయ్యాడు.
అయితే పల్లవి ప్రశాంత్ ఆరోపించిన వ్యాఖ్యల్లో... క్లారిటీ అయితే లేదు. అయితే ఆ గొడవ జరిగిన సమయంలో గౌతమ్ మాట్లాడుతూ... నా ఫిజికాలిటీ గురించి నువ్వు మాట్లాడావు. నీ ఫిజికాలిటీ గురించి నేను మాట్లాడలేదు అంటూ చేతితో సైగలు చేసి చూపించాడు. షో ఆఫ్ చేస్తున్నావ్ అంటూ సైగలు చేశాడని ప్రశాంత్ చెప్పిన దాంట్లో నిజం లేదని తెలుస్తోంది. ఈ వివాదానికి నాగార్జున తెర వేస్తారో లేదో వీకెండ్ ఎపిసోడ్ లో చూడాలి.


Click it and Unblock the Notifications











