Pallavi Prashanth: రూ.50 లక్షలు వస్తే వారికి ఇచ్చేస్తా.. పల్లవి ప్రశాంత్ సంచలన నిర్ణయం
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ షో ముగియనుందని తెలుస్తోంది. ఇక ఈ షోలో ప్రస్తుతం 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌస్ లో ఉండేది కేవలం 7 మంది. వీరిలో ఎవరు టాప్ 5 కంటెస్టెంట్స్... ఎవరు విజేత, ఎవరు రన్నరప్ అనేది ఆసక్తిగా మారింది. ఇక ప్రైజ్ మనీని కూడా నాగార్జున ఇవాళ్టి షోలో వెల్లడించనున్నారు. అయితే బిగ్ బాస్ విన్నర్ అయితే ఆ డబ్బుతో ఏం చేస్తానో చెప్పుకువచ్చాడు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలుగలో అత్యధిక ఆదరణతో బుల్లితెరపై దూసుకుపోతున్న షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7. ఇక ఈ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. మరో రెండు వారాల్లో అంటే డిసెంబర్ 17న ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాంఢ్ ఫినాలే జరుపుకోనుంది. ఇక ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అవ్వగా.. హౌస్ లో కేవలం 7 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, అర్జున్ అంబటి ఉన్నారు.

ఇక అర్జున్ అంబటి హౌస్ లో ఫస్ట్ ఫైనాలిస్టుగా ఎంపిక అయ్యాడు. ఇక మిగతా ఆరు మంది కంటెస్టెంట్స్ లో ఎవరు టాప్ 4 ఉంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇక ఎవరు విజేతగా నిలుస్తారు.. ఎవరు రన్నరప్ అవుతారు.. అనేది ఉత్కంఠగా మారింది. ఇక నాగార్జున ఈ వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తారు. విన్నర్ కు 50 లక్షలతో పాటు ఓ కారు, జోయాలుక్కాస్ 15లక్షలు.. అంటూ టెంప్టింగ్ ఆఫర్స్ ప్రకటిస్తాడు.
ఇక ఈ ప్రైజ్ మనీతో ఎవరు ఏం చేయనున్నారు అనేది నాగార్జున హౌస్ మెట్స్ అడుగ్గా.. పల్లవి ప్రశాంత్ మాత్రం సంచలన విషయాలు వెల్లడించారు. తాను విజేతగా నిలిస్తే... రైతుల కోసం ఖర్చు పెడతాను అంటూ చెప్పుకువచ్చాడు. రైతుల కోసం.. చనిపోయిన రైతు కుటుంబాల కోసం, వారి పిల్లల కోసం ఆ 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తాను అని చెప్పుకువచ్చాడు.
ప్రశాంత్ తీసుకున్న నిర్ణయాన్ని నాగార్జున, హౌస్ మేట్స్ అందరూ అభినందించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సామాన్యులు సైతం.. ప్రశాంత్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. ఓ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి... ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడం ఇదే మొదటి సారి. అంతే కాదు.. విజేతగా నిలిస్తే.. ఆ డబ్బును రైతుల కోసం ఖర్చు చేస్తాను అని చెప్పడం గొప్ప విషయం.
ఇక ప్రశాంత్.. రైతుబిడ్డగా హౌస్ లో అడుగుపెట్టి ఈ స్టేజీలో ఉన్నాడు. ఆ విషయాన్ని మరవకుండా.. ఒకవేళ తాను గెలిస్తే.. ఆ ప్రైజ్ మనీనీ రైతుల కోసమే ఖర్చు చేస్తాను అనడంపై ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. ఈసారి విజేత రేసులో ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్.. వీరిలో ఎవరు కానున్నారో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











