Bigg Boss Telugu 7: తొలిసారి పల్లవి ప్రశాంత్ బూతులు.. వాళ్ల రొమాన్స్ చూడలేక.. ఆమెను కా** అంటూ!

తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కాన్సెప్టులతో షోలు ప్రసారం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువగా ఇలాంటి వస్తున్నాయి. కానీ, దేనికీ రానంత ఆదరణను సొంతం చేసుకున్న షోనే బిగ్ బాస్. టెలివిజన్ హిస్టరీలోనే టాప్ షోగా మారిపోయిన ఇది.. వరుస సీజన్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో కామన్ మ్యాన్‌గా వచ్చి సెన్సేషన్ అయిన పల్లవి ప్రశాంత్ తొలిసారి బూతులు మాట్లాడాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరే చూడండి!

ఆరంభంలోనే ఫుల్ హైలైట్:ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఏడో దానిపై ఆరంభంలోనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులోకి మొదట 14 మంది, ఆ తర్వాత ఐదుగురు కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అందులో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడు. అందుకు తగ్గట్లే ఆడుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు.

Pallavi Prashanth Shocking Comments on Ashwini in Bigg Boss Telugu 7 Show

దూరం పెట్టి.. ఫ్రెండ్ అని:పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన కొత్తలో అతడితో శివాజి, ప్రిన్స్ యావర్ తప్ప ఎవరూ పెద్దగా కలిసేవారు కాదు. కొందరు కంటెస్టెంట్లు అయితే కావాలనే దూరం పెట్టేవారు. అలాంటిది ఇప్పుడు చాలా మంది అతడికి ఫ్రెండ్స్ అయిపోయారు. అంతలా ఈ సీజన్‌లో ప్రశాంత్ తనదైన ఆటతీరు, మాటతీరుతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నాడు.

శివాజి మాట నమ్మి డెడ్‌గా:12వ వారంలో బిగ్ బాస్ మ్యాన్షన్ టాస్కులోభాగంగా పల్లవి ప్రశాంత్‌ను చంపాలని శివాజికి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. అందుకోసం అతడు ఎంతగానో ప్రేమగా దాచుకుంటోన్న మొక్కను ఎవరూ చూడకుండా తీసుకుని వెళ్లి పోస్టు బాక్సులో వేయాలని చెప్పాడు. దీనికోసం ప్రశాంత్‌ను శివాజి సీక్రెట్‌ రూంలో పెట్టి తాళం వేయించాడు. తర్వాత మొక్క దాచి డెడ్ చేసేశాడు.

Pallavi Prashanth Shocking Comments on Ashwini in Bigg Boss Telugu 7 Show

వాళ్లిద్దరు కూడా డెడ్ అయి:బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్కులో భాగంగా ప్రశాంత్ తర్వాత శివాజికి అశ్వినిని డెడ్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందుకోసం అద్దంపై ఆమెను గెట్ అవుట్ అని రాయాలని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే శివాజి రాసి అశ్విని డెడ్ చేసేశాడు. ఆ తర్వాత అతడు గౌతమ్‌ను చంపడంలో విఫలం అవడంతో ప్రియాంక ఆ పని పూర్తి చేసింది. దీంతో అతడు కూడా డెడ్ అయిపోయాడు.

నాకు నువ్వే కావాలంటూ:దెయ్యాలుగా మారిన అశ్విని, గౌతమ్‌, ప్రశాంత్‌లు బిగ్ బాస్ గ్రేవ్ యార్డ్‌లో ఉండాల్సి వచ్చింది. అందరూ టాస్కులో యాక్టివ్‌గా ఉంటే వీళ్లు మాత్రం అందులోనే కూర్చుని ఉన్నారు. ఆ సమయంలోనే గౌతమ్, అశ్విని రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ కొన్ని విన్యాసాలు చేశారు. అప్పుడామె 'నీకు జిలేబీ కావాలా? గులాబీ కావాలా' అంటూ వెనుక నుంచి చిలిపి పని చేసింది.

Pallavi Prashanth Shocking Comments on Ashwini in Bigg Boss Telugu 7 Show

కామ పిశాచివి అంటూ:గౌతమ్‌తో అశ్విని కొంటెగా మాట్లాడుతుండడంతో పక్కనే ఉన్న ప్రశాంత్ ఆమెను 'కామ పిశాచి' అని అనకూడని మాట అన్నాడు. దీంతో అశ్వినిని కోపం వచ్చింది. అప్పుడు అతడితో గొడవకు దిగింది. ఆ సమయంలో గౌతమ్ కలుగజేసుకుని సర్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, అశ్విని మాత్రం సీరియస్ అవుతూనే ఉంది. అప్పుడు ప్రశాంత్ సారీ చెప్పడంతో గొడవ సర్ధుమణిగింది.

కావాలని అనకపోయినా:బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్ నోటిని అదుపులో పెట్టుకునే కనిపించాడు. కానీ, తొలిసారి అతడు అశ్విని బూతు లాంటి మాట అనేశాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఆ తర్వాత దీన్ని సాగదీయకుండా ఆమెకు సారీ చెప్పాడు. అయితే, ఇప్పుడు ప్రశాంత్ వ్యతిరేకులు దీన్ని హైలైట్ చేసి అతడిపై విమర్శలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X