Pallavi prashanth: శివన్న తులసి మొక్క.. రతికా రోజ్ ను ఏ మొక్కతో పోల్చాడో తెలుసా?
బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈయన తాజాగా రైతులకు సాయం చేశాడు. ముఖ్యంగా ఓ కుటుంబానికి లక్ష రూపాలయ ఆర్థిక సాయం చేశాడు. అయితే ఈ సందర్భంగానే మాట్లాడుతూ రైతుబిడ్డ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా బీబీ7 కంటెస్టెంట్లు అందరినీ మొక్కలతో పోల్చాడు. శివాజీని తులిసి మొక్కగా వర్ణించిన ఈయన రతికా రోజ్ ను ఏ మొక్కతో పోల్చాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా టిక్ టాక్ లో వీడియోలు చేసుకునే పల్లవి ప్రశాంత్.. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడయోలు చేసుకుంటూ తన కెరియర్ ను సాగించాడు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసుకుంటూ రైతులు పడుతున్న కష్టాలను చూపిస్తూ.. వ్లాగ్స్ చేస్తూ పాపులారిటీ సంపాధించుకున్నాడు. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లాడు. ముఖ్యంగా అమాయకుడిగా వెళ్లి తన విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో మరింత రెచ్చిపోయేవాడు. ఇలా అద్భుతమైన ఆట తీరుతో గేమ్ ఆడిన ఈయన చివరకు విన్నర్ గా నిలిచాడు.

అయితే విన్ అయినప్పుడు తాను గెలుచుకున్న డబ్బునంతా రైతులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మాట ప్రకారమే ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకున్నాడు. శివాజి, భోలే షావలి సమక్షంలో ఆ రైతు ఫ్యామిలీకి తన వంతుగా లక్ష రూపాయల నగదును అందించాడు. వారి పిల్లల పేరిట ఆ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. అయితే ఈక్రమంలోనే ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన తనతో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు అందరి గురించి మాట్లాడాడు. ముఖ్యంగా వారందరినీ మొక్కలతో పోల్చాడు.
శివాజీ తులసి మొక్క అని చెప్పిన పల్లవి ప్రశాంత్.. భోళె షావళిని వరితో పోల్చాడు. ఇప్పటికీ తాను వాళ్ల ఇంటికి వెళ్తే భోజనం పెట్టకుండా పంపిండని వివరించాడు. ప్రిన్స్ యావర్ ను ప్రకృతితో పోలుస్తున్నట్లు వెల్లడించాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ గురించి చెబుతూ ఆమె మిరపకాయ చెట్టు అని పేర్కొన్నాడు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజను మొక్కజొన్న కంకితో పోలుస్తానని వివరించాడు. అలాగే గౌతమ్ కృష్ణను వేప చెట్టుతో పోల్చాడు. ఆ చెట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని అందుకే ఆ చెట్టుతో పోల్చానని వివరించాడు.

అలాగే బిగ్ బాస్ తెలుగు 7 రన్నరప్ అమర్ దీప్ బంతిపూలతో పోలుస్తానని చెప్పాడు. ఆ తర్వాత శోభాశెట్టిని సీతాఫలం చెట్టుతో పోల్చాడు. అలాగే తనను ఎంతగానో బాధించిన రతికా రోజ్ ను దానిమ్మ చెట్టుతో పోల్చాడు. ఇలా అందరితో తనకు ఉన్న బంధాలను మరోసారి గుర్తు చేసుకుని తెగ సంబురపడిపోయాడు.


Click it and Unblock the Notifications











