Bigg Boss Telugu 7: ఆ విషయంలో ప్రశాంత్ స్ట్రాటజీ సూపర్... ఇక టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయమే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజు రోజుకు ఆసక్తి పెంచుతోంది. ఇక ఈ వారం రతికా రోజ్, అశ్విని శ్రీ ఎలిమినేట్ కానున్నారు. డబుల్ ఎలిమినేషన్ ముందే చెప్పారు. అయితే ఎలిమినేషన్ లో అంతా పల్లవి ప్రశాంత్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ వాడుతారు అనుకున్నారు. దానితో ఎవరు ఎలిమినేట్ కానున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే పల్లవి ప్రశాంత్ తీసుకున్న నిర్ణయం.. సూపర్ అని అంటున్నారు ప్రేక్షకులు. అసలు ఎవిక్షన్ పాస్ విషయంలో పల్లవి ప్రశాంత్ ఏం నిర్ణయం తీసుకున్నారు.. అనే విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇక ఆ విషయం పక్కన పెడితే... ఎవిక్షన్ పాస్ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్.. దాన్ని ఏం చేశాడు అనే ఆలోచన చాలా మందికి రావొచ్చు. ఈ వారం దానితో రతికాను ఎలిమినేట్ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ రతికాపై రివేంజ్ తీర్చుకున్నాడు అంటూ కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ప్రశాంత్ ఆ ఎవిక్షన్ పాస్ విషయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న నెటిజన్స్... ప్రశాంత్ నిర్ణయం సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రశాంత్ ఆ ఎవిక్షన్ పాస్ ను ఈ వారం ఉపయోగించుకోలేదు. నాగార్జున అడిగిన కూడా... ప్రశాంత్ నేను వాడుకోను అంటూ చెప్పారంట. దాన్ని 14వ వారంలో తన కోసం వాడుకుంటా అని క్లారిటీ ఇచ్చాడంట. అంటే గ్రాండ్ ఫినాలేకి ముందు వారం ఎవిక్షన్ పాస్ వాడుకుంటాడు ప్రశాంత్. ఆ టైంలో ఎవరిని ఎలిమినేట్ చేయాలి.. ఎవరిని సేవ్ చేయాలి అనేది ప్రశాంత్ చేతిలో ఉందని తెలుస్తోంది.

మరి ఆ ఎవిక్షన్ పాస్ తో ప్రశాంత్ 14వ వారంలో ఎవరిని సేవ్ లేదా ఎలిమినేట్ చేస్తారో అనే టెన్షన్ కూడా ఉంది. అయితే ప్రశాంత్ ఇప్పుడు ఆ ఎవిక్షన్ పాస్ వాడకుండా మంచి పని చేశారంటున్నారు నెటిజన్స్. ఎలాగూ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిపారు. ఇక ఆ ఎవిక్షన్ పాస్ యూజ్ చేసి... ఓ వారం ఎలిమినేషన్ ఉండకపొవచ్చుని తెలుస్తోంది.
ఇక ఈ సారి టైటిల్ విన్నర్ కూడా ప్రశాంత్ అని అంటున్నారు. శివాజీ నెగిటివిటీ వల్ల.. ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఇక అమర్ టాప్ 2 లేదా 3లో ఉండొచ్చని సర్వేలు చెబుతున్నాయి. ఈ సీజన్ విన్నర్ మాత్రం ప్రశాంత్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











