Bigg Boss 7 Telugu: షోలో ఊహించని సీన్.. నిన్ను లవ్ చేస్తున్నానా? చెల్లి అని చెప్పలేదా అంటూ!

ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులు తీసుకు రావడంతో పాటు కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్, గొడవలు, రొమాన్స్, ప్రేమ కహానీలు ఇలా రకరకాల ఆసక్తికరమైన సంఘటనలను చూపిస్తూ రక్తి కట్టిస్తోన్న షోనే బిగ్ బాస్. తెలుగు బుల్లితెరపై కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకుల నుంచి మద్దతును కూడగట్టుకుని సూపర్ డూపర్ హిట్ షోగా మారిన ఇది.. ఇటీవలే ఏడో దానితో వచ్చేసింది. ఇందులో తాజాగా జరిగిన నామినేషన్స్ టాస్కులో చాలా మంది కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు. దీంతో ఓ ఊహించని సీన్ కనిపించింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ట్విస్టులతో సాగుతున్న సీజన్:బిగ్ బాస్ ఆరో సీజన్ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదు. దీంతో ఏడో దాన్ని ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని నిర్వహకులు పట్టుదలతో వచ్చారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెస్టుతో ప్లాన్ చేశారు. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ట్విస్టులు.. సర్‌ప్రైజ్‌లను ఇస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ మజాను అందిస్తోంది.

Pallavi Prashanth Unexpected Question to Rathika Rose in Bigg Boss Show

14 మందిలో అతడు హైలైట్:గతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడని చెప్పాలి. అందుకు తగ్గట్లుగానే అతడు తరచూ వార్తల్లో నిలుస్తూనే వస్తున్నాడు.

రతికాతో ట్రాక్.. జంటగా క్రేజ్:బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచే పల్లవి ప్రశాంత్, రతికా రోజ్ మధ్య స్నేహం మొదలైంది. మొదట్లో హౌస్‌లో ఉండేందుకు కాస్త ఇబ్బంది పడిన అతడితో ఆమె క్లోజ్‌గా మాట్లాడింది. తర్వాత ప్రశాంత్ తన లేడీ లక్ రతికానేనని చెప్పడంతో స్నేహం మొదలైంది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ హౌస్‌లో ఎంతో క్లోజ్‌గా ఉంటున్నారు. ముఖ్యంగా లవర్స్‌లా కనిపిస్తూ మజా పంచుతున్నారు.

Pallavi Prashanth Unexpected Question to Rathika Rose in Bigg Boss Show

నామినేషన్స్‌లో అతడిపైనే:బిగ్ బాస్ రెండో వారానికి జరిగిన నామినేషన్స్ టాస్కు ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ముఖ్యంగా చాలా మంది కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్‌నే టార్గెట్ చేశారు. అందులో అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్‌లు మాత్రం శృతి మించి మరీ ఈ యువ రైతును విమర్శలు చేశారు. వాళ్లకు రతికా కూడా తోడు అవడంతో ప్రశాంత్‌కు కోలుకోలేని షాక్ తగిలినట్లు అయింది.

Pallavi Prashanth Unexpected Question to Rathika Rose in Bigg Boss Show

నువ్వు ఆమె వెంట పడ్డావు:నామినేషన్స్ టాస్కులో భాగంగా ప్రశాంత్ తనను చెల్లి అని పిలిచినా ఎవరికీ చెప్పకుండా కెమెరాలతోనే మాట్లాడాడని శోభా శెట్టి ఆరోపిస్తూ అతడిని నామినేట్ చేసింది. ఆ తర్వాత 'ఇప్పుడు కనిపిస్తున్న ప్రశాంత్ అన్నయ్య వేరే.. నీలో రెండు ఫేస్‌లు కనిపిస్తున్నాయి. రతిక వెనుక ఎందుకు పడ్డావు? టైటిల్ కోసం వచ్చావా? అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా' అని ప్రశ్నించింది.

Pallavi Prashanth Unexpected Question to Rathika Rose in Bigg Boss Show

నిన్ను లవ్ చేశానా అంటూ:శోభా శెట్టి మాటలకు పల్లవి ప్రశాంత్ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. 'నన్ను అన్నయ్య అన్నావని రతికతో చెప్పానో లేదో అడిగి అప్పుడు మాట్లాడు. ఆమె వెనుక పడినా అంటున్నావు కదా.. రతికా నేనెప్పుడైనా నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పినానా' అంటూ సూటిగా ప్రశ్నించాడు. దీనికామె మౌనంగా ఉండిపోయింది. మొత్తానికి ఒకే దెబ్బకు ఇద్దరు లేడీస్‌కు ఇచ్చి పడేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X