Bigg Boss Telugu 7: రైతుబిడ్డ రతికా బిడ్డ కాదు.. కసిబిడ్డ అని ప్రూవ్ చేసుకున్నాడుగా!
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో రోజురోజుకూ మరింత ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. 2.0 ఉల్లా పుల్టాతో సరికొత్త టాస్కులు తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. ఏ సీజన్ లోనూ లేని చాలా విషయాలు ఈ సీజన్ లో జరిగాయి. అలాగే ఎప్పుడూ జరగని గ్రూపు గేములు, గ్రూపు నామినేషన్లు కూడా ఈ సీజన్ లో జరగడం నిజంగా ఆసక్తికరంగానే ఉంది. అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, సందీప్ మాస్టర్, టేస్టీ తేజలు.. ఓ గ్రూపుగా మారి మిగిలిన వాళ్లలో ఒక్కొక్కరిని నామినేట్ చేయడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
ముఖ్యంగా రెండు గ్రూపులుగా ఉన్న బ్యాచులు పెట్టుకునే గొడవలతో పాటు వాళ్లు ఆడే గ్రూపు గేములు చూస్తుంటే ఎవరికైనా రోజూ షో చూడాలనే ఆత్రం పెరిగిపోతుంటుంది. అయితే నామినేషన్లలో తీవ్రమైన గ్రూపిజాన్ని చూపించిన సీరియల్ బ్యాచ్.. కాప్టెన్సీ టాస్కుల్లోనూ అలాంటి పనులే చేస్తున్నారు. అందరూ కంటెండర్ షిప్ గెలుచుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ మొదటగా జరిగిన పోటీలో ప్రియాంక జైన్ గెలవగా.. శోభాశెట్టి రెండో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత టేస్టీ తేజ చివరగా.. అమర్ దీప్ నిలిచారు. దీంతో అమర్ దీప్ కంటెండర్ షిప్ నుంచి తొలగిపోయాడు.

ఇక రెండో గేమ్ లో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ పోటీదారులుగా నిలిచారు. వీరికి డబ్బాలు కలిపే టాస్కు ఇవ్వగా.. ఇందులో రైతుబిడ్డ చాలా కసితో ఆడాడు. ఎక్కడా తడబడకుండా.. కేవలం 9 సెకన్లలోనే గేమ్ పూర్తి చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రిన్స్ యావర్ గేమ్ పూర్తి చేశాడు. వీరిద్దరి తర్వాత గౌతమ్ కృష్ణ కూడా గేమ్ పూర్తి చేయగా.. చివరగా రతికా రోజ్ నిలిచింది. తన టాస్కును పూర్తి కూడా చేయలేకపోయింది. ఇలా రతికా రోజ్ పై పల్లవి ప్రశాంత్ గెలిచాడు. ఈ రెండో టాస్కులో పల్లవి ప్రశాంత్ విన్ అవ్వగా.. రతికా రోజ్ కంటెండర్ షిప్ నుంచి తొలగిపోయింది.
ఇదంతా చూసిన ప్రేక్షకులు.. రైతు బిడ్డ రతికా బిడ్డ కాదని.. కసి బిడ్డ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఆడిన గేమ్ నిజంగా అద్భుతంగా ఉందని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా రతికా రోజ్ పై గెలవడం అందరికీ అద్భుతంగా అనిపించిందని చెబుతున్నారు. ఇంకా అమర్ దీప్ పై ఈ గేమ్ గెలిచి ఉంటే మరింత బాగుండేదని వివరిస్తున్నారు. ఏది ఏమైనా రైతుబిడ్డ.. చాలా కసిగా గేమ్ ఆడి గెలవడం ప్రేక్షకుల్లో సంతోషాన్ని కల్గిస్తోంది.

పల్లవి ప్రశాంత్ కు మొదటి నుంచి ఫుల్ సింపతీ తోడు అయింది. అందుకు తగ్గట్లుగానే సీరియర్ బ్యాచ్ కంటెస్టెంట్లు చేసే రచ్చతో రైతుబిడ్డ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఇక రతికా రోజ్ చేసిన పనికి.. అందరూ రైతుబిడ్డ బలయ్యాడని అనుకున్నారు. ఈక్రమంలోనే తీవ్ర నెగిటివిటీతో రతికా రోజ్ బయటకు వచ్చేసింది. కానీ మళ్లీ అదృష్టంతో ఇంట్లోకి అడుగు పెట్టింది. ఇక లోపలికి వెళ్లినప్పటి నుంచి పల్లవి ప్రశాంత్, శివాజిలతో చాలా బాగుంటుంది. ఎవరితోనూ గొడవ పడకుండా తన గేమ్ తాను ఆడుకుంటుంది. సీరియర్ బ్యాచ్ కంటెస్టెంట్లు ఎన్ని గ్రూపు గేములు ఆడినా చివరకు గెలిచేది శివాజి లేదా రైతు బిడ్డ అని బయట టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











