Pallavi Prashanth: కప్ కొట్టిన రోజే రెండో ముఖం బయట పెట్టిన పల్లవి ప్రశాంత్.. ఇంత వరస్ట్‌గా ఉన్నాడేంటి?
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్ గెలిచిన రోజే తన రెండో ముఖాన్ని బయటపెట్టాడు. రైతుల సాయం గురించి మాట్లాడుతూ.. వరస్ట్ గా బిహేవ్ చేశాడు. కప్ కొట్టిన అనంతరం ర్యాలీగా బయలుదేరిన ప్రశాంత్.. అక్కడ మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు వేశారు. అక్కడే ప్రశాంత్ వరస్ట్ బిహేవియర్ బయటపడింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తికర పరిణామాల మధ్య ముగిసింది. ఇక ఈ షో ముగిసిన అనంతరం పల్లవి ప్రశాంత్ వర్సెస్ అమర్ దీప్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగింది. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే.. అభిమానం పేరుతో హద్దులు దాటి ప్రవర్తించారు. అమర్ దీప్, గీతు, అశ్విని కార్లపై దాడి చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులు టీెఎస్ ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. ఇక దీనిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

ఆ విషయం పక్కన పెడితే ఇక పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌస్ లో కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి విన్నర్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో వినయ విధేయ ప్రశాంత్ గా కనిపించిన ఈ వ్యక్తి.. టైటిల్ కొట్టిన తర్వాత వరస్ట్ బిహేవియర్ కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజు.. టైటిల్ అనౌన్స్ మెంట్ తర్వాత ప్రశాంత్.. తన డబ్బును రైతులకు ఖర్చు పెడుతాను.. తగ్గేదేలా అంటూ చెప్పుకువచ్చాడు.
ఇక బిగ్ బాస్ షో అనంతరం పల్లవి ప్రశాంత్ తమ అభిమానులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. ఇక ఈ క్రమంలోనే ఓ ప్రముఖ మీడియా రిపోర్టర్ ప్రశాంత్ ను పలు ప్రశ్నలు వేశాడు. రైతు బిడ్డగా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి విజయం సాధించారు... మల్లన్న సాగర్ రైతుల కుటుంబాల కోసం ఏమైనా చేస్తారా అని రిపోర్టర్ అడిగాడు. దానికి పల్లవి ప్రశాంత్... నేను రైతుబిడ్డగా వెళ్లాను.. అంతే కానీ నేనేం సీఎం ను కాను అంటూ వెటకారంగా మాట్లాడాడు.

అంతే కాదు.. నన్ను సీఎంను చేయండి.. నేను వాళ్లుకు ఏదో ఒకటి చేస్తాను అంటూ వరస్ట్ బిహేవియర్ చూపించాడు. నేను రైతు బిడ్డను అంతే.. ఇవన్నీ నేనుందుకు చేస్తా అంటూ చెప్పుకువచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశాంత్ ఏంటి ఇంత వరస్ట్ గా ఉన్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా నటించావ్... బయటకు రాగానే నీ అసలు రంగు బయటపడిందని కామెంట్స్ చెస్తున్నారు.
అమర్ దీప్ చెప్పింది నిజమే.. పల్లవి ప్రశాంత్ కు రెండు ముఖాలు ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ ప్రశాంత్ కు ప్రైజ్ మనీ కింద రూ.35లక్షలను ఇచ్చింది. మరి నిజంగానే పల్లవి ప్రశాంత్ రైతుల కోసం బిగ్ బాస్ ఇచ్చిన సొమ్మును ఖర్చు పెడతాడా లేదా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











