Bigg Boss Telugu 7 టాప్ 5 లో ఆ ఐదుగురు కంటెస్టెంట్స్.. టైటిల్ రేసులో ఎవరెవరు అంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. ఇక ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా సాగుతోంది. మొదట 14 మంది ఎంటర్ అవ్వగా... ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ తర్వాత మరో ఐదు మంది వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ సీజన్ మరింత ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో పలువురి పేర్లు బయటకు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే....

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆరోజున 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. అలనాటి హీరోయిన్ కిరణ్ రాథోడ్, శృంగార తార షకీలా, సింగర్ దామిని, నటి శుభ శ్రీ రాయగురు, మరో నటి రతికా రోజ్, సీరియల్ హీరో అమర్ దీప్, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, హీరో శివాజీ, సందీప్, పల్లవి ప్రశాంత్, యావర్, గౌతమ్, శోభా శెట్టి.. ఇలా మొత్తం 14 మంది హౌస్ లో అడుగు పెట్టారు.

Pallavi Prashanth, Yawar, Arjun, Shobha Shetty, Sivaji are the Top 5 Contestants in Bigg Boss Telugu 7

ఇక మొదటి ఐదు వారాలు గడిచాక.. ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, శుభ శ్రీ, రతికారోజ్.. ఐదుగురు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ మిని లాంఛ్ జరిగింది. ఇక ఈ లాంఛ్ లో ఐదుగురు హౌస్ లో అడుగుపెట్టారు. అందులో అర్జున్ అంబటి, బోలే షవాలి, నయని పవని, పూజా మూర్తి, అశ్విని శ్రీ ఉన్నారు.

ఇక హౌస్ లో ఆరో వారంలో నయని పవని ఎలిమినేట్ అయిపోయి.. ప్రస్తుతం హౌస్ లో కేవలం 13 మంది ఉన్నారు. ఇక వీరిలో టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్, నటుడు ప్రిన్స్ యావర్, సీరియల్ నటి శోభాశెట్టి, సీరియల్ నటుడు అర్జున్ అంబటితో పాటు హీరో శివాజీ పేర్లు ఉన్నాయి. అయితే ఈ వారం శివాజీ.. హౌస్ నుంచి వెళ్లి పోనున్నారని టాక్ వినిపిస్తుంది.

శివాజీ తన హెల్త్ సమస్యల కారణంగా గత కొంత కాలంగా హాౌస్ లో డల్ అయ్యారు. అంతే కాదు బిగ్ బాస్ ముందుకు వచ్చి తన ఆరోగ్యం గురించి చెప్తూ బాధ పడుతున్నాడు. తనను పంపించాలంటూ వేడుకుంటున్నాడు. ఇక ఈ వారం శివాజీ వాలెంటరీ కింద హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో శివాజీ ఉంటే కనుగ.. ఆయన టాప్ 5లో నిలుస్తారని టాక్ వినిపిస్తుంది.

Pallavi Prashanth, Yawar, Arjun, Shobha Shetty, Sivaji are the Top 5 Contestants in Bigg Boss Telugu 7

ఇక శివాజీ తప్పుకుంటే.. టాప్ 5 కంటెస్టెంట్స్ లో నిలిచే వారిలో అమర్ దీప్, గౌతమ్, ఆట సందీప్ పేర్లు వినిపిస్తున్నాయి. అమర్ దీప్ మొదటి నాలుగు వారాలు.. నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. ఈ మధ్యే ఆయనలో మార్పు మొదలు అయినట్లు తెలుస్తోంది. ఇలాగే ఆడితే కనుక తను కూడా టాప్ 5 లో నిలిచే కంటెస్టెంట్ అంటున్నారు. మరోవైపు సందీప్, గౌతమ్ కూడా నిలిచే అవకాశాలు కాస్త ఉన్నాయి. చూడాలి మరి.. ఎవరు టాప్ 5లో నిలుస్తారో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X