Bigg Boss 7 Telugu: టాప్‌ 5కి చేరుకునే కంటెస్టెంట్లు వీళ్లే.. టైటిల్ రేసులో ఉన్నది మాత్రం?

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగుతోంది. ఇక గత సీజన్స్ కంటే.. ఈ సీజన్ ఆసక్తిగా సాగుతోంది. ముఖ్యంగా ఆడియెన్స్ కు బిగ్ బాస్ షాకులు, ట్విస్టులు ఇవ్వడంతో.. షోపై ఆసక్తి నెలకొంటుంది. ఇక ఇదిలా ఉండగా..ఈ సీజన్ లో మొదట 14 మంది అడుగుపెట్టగా.. రెండో విడుతలో మరో ఐదు మంది అడుగుపెట్టారు. ఇక 8 వారాలుగా ఆసక్తిగా సాగుతున్న ఈ షో.. మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఏంటి అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం, పోలింగ్ వివరాల ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Pallavi Prashanth, Yawar, Sivaji, Priyanka Jain, Arjun Ambati Are The Top 5 Contestants in Bigg Boss Telugu Telugu 7

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇక ఆ రోజున 14 మంది కంటెస్టెంట్స్... బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక ఐదు వారాలు ఆసక్తిగా సాగిన బిగ్ బాస్... ఐదో వారంలో మాత్రం ప్రేక్షకులకు పెద్ద ట్విస్టును ఇచ్చారు. ఐదు వారాలకు కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికా రోజ్, శుభ శ్రీ ఎలిమినేట్ అవ్వగా.. ఐదో వారంలో ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఇంట్లో అడుగుపెట్టారు.

Pallavi Prashanth, Yawar, Sivaji, Priyanka Jain, Arjun Ambati Are The Top 5 Contestants in Bigg Boss Telugu Telugu 7

ఇక ఐదో వారంలో అర్జున్ అంబటి, బోలే షవాలి, నయని పవని, పూజా మూర్తి, అశ్విని శ్రీ లు హౌస్ లో ఎంటర్ అయ్యారు. వారిలో నయని పవని, పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఆట సందీప్ ఉంటాడు అని అనుకోగా.. మొన్నటి వారంలో ఆయన ఎలిమినేట్ అయిపోయారు. ఇక మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాను అంటున్నారు.

Pallavi Prashanth, Yawar, Sivaji, Priyanka Jain, Arjun Ambati Are The Top 5 Contestants in Bigg Boss Telugu Telugu 7

ఇక ఆ విషయం పక్కన పెడితే.. హౌస్ లో ప్రస్తుతం శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, టేస్టీ తేజ, గౌతమ్, అర్జున్ అంబటి, బోలే షవాలి, అశ్విని శ్రీలు ఉన్నారు. ఇక వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ కానున్నారో తెలియాల్సి ఉంది. డేంజర్ లో జోన్ లో మాత్రం శోభా శెట్టి, అశ్విని శ్రీ పేర్లు వినిపిస్తున్నాయి.

Pallavi Prashanth, Yawar, Sivaji, Priyanka Jain, Arjun Ambati Are The Top 5 Contestants in Bigg Boss Telugu Telugu 7

అయితే టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ సోషల్ మీడియాలో పలువురి పేర్లు వైరల్ గా మారాయి. అంతే కాదు బిగ్ బాస్ నిర్వాహకుల సమాచారం మేరకు టాప్ 5 లో కొంత మంది పేర్లు వినిపిస్తుంది. ముఖ్యంగా అందులో మొదటగా వినిపించే పేరు శివాజీ. ఈయన మొదటి నుంచి మైండ్ గేమ్ తో ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత కామన్ మ్యాన్ గా హౌస్ లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. ఈయన కూడా టాప్ 5 లో ఉంటారని తెలుస్తోంది.

Pallavi Prashanth, Yawar, Sivaji, Priyanka Jain, Arjun Ambati Are The Top 5 Contestants in Bigg Boss Telugu Telugu 7

ఇక వారి తర్వాత యావర్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కూడా టాప్ 5 బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఉంటారని సమాచారం. ఇక టైటిల్ విన్నర్ అనేది కీలకంగా మారింది. ఈ సీజన్ మ్యాగ్జిమం టైటిల్ విన్నర్ శివాజీ అనే పేరు వినిపిస్తుంది. కానీ ఆయన సరిగా ఆటనే ఆడలేదు.. ఎలా ఇస్తారు అనే వాదన కూడా వినిపిస్తుంది. ఇక ఆయన తర్వాత పేర్లు యావర్, ప్రశాంత్ వినిపిస్తున్నాయి. మరి వీరిలో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X