'జానకి కలగలేదు'కు ఎండ్ కార్డ్.. గృహలక్ష్మి క్యాస్టింగ్‌తో సరికొత్త సీరియల్ పలుకే బంగారమాయెనా?

తెలుగు ధారావాహికలు అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఎంత మక్కువో చెప్పనక్కర్లేదు. ఇంటిల్లిపాది కూర్చుని సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నాళ్లుగా అలరించిన జానకి కలగనలేదు సీరియల్ నేటితో ముగిసింది. దీని స్థానంలో గృహలక్ష్మి కాస్టింగ్ తో సరికొత్త సీరియల్ పలుకే బంగారమాయే ప్రారంభం కానుంది. ఆ వివరాల్లోకి వెళితే...

జానకి కలగనలేదు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రియాంక, అమర్ దీప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సీరియల్ చాలా కాలం పాటు మాటీవీలో ప్రసారమయింది. అయితే ఈ సీరియల్లో అలనాటి అందాల తార రాశి కూడా ఒక ప్రధాన పాత్రలో నటించింది. ఈ సీరియల్ మొదట మాటీవీలో రాత్రి 8:30 నిమిషాలకు ప్రసారం చేసేవారు. కానీ కొన్ని కారణాలవల్ల ఈ సీరియల్ ని మధ్యాహ్నం 1:30 నిమిషాలకి ప్రసారం చేశారు.

 Paluke Bangaramayena

అయినప్పటికీ జానకి కలగనలేదు సీరియల్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ సీరియల్ కు నేటితో గుమ్మడికాయ కొట్టేశారు. దీని స్థానంలో గృహలక్ష్మి సీరియల్ కాస్టింగ్ తో ప్రసారం కాబోతున్న పలుకే బంగారమాయే ధారావాహిక ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదల అయిన ప్రోమోలు ఆకట్టుకుంటున్నాయి. ఓ తండ్రి కూతుళ్ల కథగా ఈ ధారావాహిక ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రోమోలు విడుదల చేయగా.. అందులో హీరోయిన్ కు సరిగ్గా మాటలు రావు అని అర్థం అవుతుంది. ఇక హీరోయిన్ పై తన తండ్రికి కోపం ఉంటుంది. మాటలు రావని అవహేళన చేస్తూంటాడు. ఇక మరో ప్రోమోలో.. హీరోయిన్ తండ్రి.. తన కూతురికి ఓ వ్యక్తితో పెళ్లి కుదుర్చుతాడు. ఆ వ్యక్తితో కలిసి హీరోయిన్.. కారులో వెళ్తుంటుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి యాక్సిడెంట్ చేస్తాడు. కేసు అవుతుంది. ఇక అక్కడ హీరో పోలీస్ ఆఫీస్ గా ఉంటాడు. అక్కడ హీరోయిన్ సాక్షిగా కోర్టులో చెప్పమంటాడు.

 Paluke Bangaramayena

మాటలే రాని ఇది.. కోర్టులో సాక్ష్యం చెబుతుందా అని తండ్రి అవహేళన చేస్తాడు. ఆమె అప్పుడు నోరు విప్పే.. అతనే యాక్సిడెంట్ చేశాడు అని చెబుతుంది. దీనితో తండ్రి, కూతుళ్ల బంధానికి బ్రేక్ పడుతుంది. మొత్తానికి ప్రోమోతోనే ఈ సీరియల్ కథేంటో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు ఈ సీరియల్ సరికొత్త కథతో జానకి కలగనలేదు స్థానంలో రాబోతుంది.

ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు వుంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులువుంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఇక ఈ సీరియల్ లో గృహలక్ష్మిలో ఆకట్టుకున్న నందు, ప్రేమ్ వంటి నటులు ఇందులో నటించారు.

 Paluke Bangaramayena

ఏదో సాధించాలనేతపన వున్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ. తడబడే అడుగుల నుంచి వడివడినడకలా వరకు ఒక జంట ఎంత అపురూపంగా ప్రయాణంచేసిందో అద్భుతంగా చెప్పిన ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులను ఉర్రూతలూగించబోతోంది. ఓడించాలనుకున్న జీవితాన్నిగెలుచుకున్న ఆ ఇద్దరూ, వాళ్ల కుటుంబాలు తెలుగు లోగిళ్లలోప్రతి కుటుంబానికి నచ్చుతాయని చెబుతున్నారు మేకర్స్. మీరు సరికొత్త సీరియల్ కోసం చూస్తుంటే.. ఈ ధారావాహికను మిస్ అవ్వకండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X