Naga Panchami: నాగలోకపు యువరాజు ఫణీంద్రతో పంచమి పెళ్లి.. భర్తను కాపాడుకోవడానికేనా?
Naga Panchami December 22nd Episode: నాగ పంచమి సీరియల్ రోజురోరుజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ట్విస్టులతో సీరియల్ ను రక్తి కట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో నాగలోకపు యువరాజు ఫణీంద్ర, పంచమిల పెళ్లి జరగబోతున్నట్లు చూపించారు. ముఖ్యంగా యువరాజు ఫణీంద్ర సిగ్గు పడుతూ రాగా.. పంచమి కూడా అక్కడకు వస్తుంది. నాగ కన్య రూపంలో పంచమి చాలా అందంగా కనిపిస్తోంది. ఈక్రమంలోనే ఒకరికి ఒకరు ఎదరుగా రావడం.. పంచమి సిగ్గుపడడం.. ఫణీంద్ర తన మంత్ర శక్తితో పూల మాలలు తెప్పించడం చూపించారు. ఇలా వచ్చిన ఆ పూల మాలలను పంచమి, ఫణీంద్రలు ఒకరి మొడలో ఒకరు వేసుకుంటారు. ఇక ఆ తర్వాత పంచమి యువరాజు చిటికెన వేలు పట్టుకోగా.. ఏడడుగులు వేస్తారు.
అయితే ఇదంతా చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ.. యువరాజు ఫణీంద్ర ఈ కల కనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే భర్తకు పూర్తిగా నాగలోకం శాపం పోవాలని.. అందుకోసం ఆమె నాగ లోకానికి వెళ్లాలని అనుకుంటుంది కాబట్టి యువరాజు ఇలా అక్కడకు వెళ్లాకా తమ పెళ్లి జరుగుతుందని కలలు కంటున్నాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో చూపించబోతుండగా... నిన్నటి ఎపిసోడ్ లో.. పంచమియే పాముగా మారినప్పుడు నంబూద్రీని చంపినట్లు తెలిపింది. అంతేకాకుండా కరాళీకి కూడా మంత్ర శక్తులు ఉన్నట్లు వివరించింది. మీరు భయపడతారానే ఈ విషయం చెప్పలేదని పంచమి వివరిస్తుంది. అలాగే మోక్ష ఏ తప్పూ చేయలేడని, అందుకే కాపాడుకోగల్గుతున్నానని చెప్పుకొచ్చింది.

నాగమణికి చాలా శక్తులు ఉన్నాయని తెలుసు కానీ.. కరాళీ ద్వారా మాత్రమే దానితో ప్రాణాలు కాపాడవచ్చని తెలుసుకున్నట్లు కూడా వివరించింది. అయితే మోక్ష మాత్రం.. నువ్వు తల్లివి అయితే నేను హాయిగా ప్రాణాలు విడుస్తానని చెప్పాడు. మిమ్మల్ని కాపాడడం నా వల్ల కాకపోతే ఇదే చిట్ట చివరి అవకాశం అని పంచమి అంటుంది. ఆ తర్వాత పడుకుంటారు. ఉదయం పంచమి బయట ఉండగా.. అక్కడకు మోక్ష వస్తాడు. ఏంటి యువరాజా.. మీరు నా వెనకాలే వస్తున్నారని పంచమి అడగ్గా.. పాముగా ఉన్న అతను మనిషిగా మారుతాడు.
నాగలోకానికి వద్దని నాగ దేవత చెప్పిందని.. మరెందుకు మీరు నా వెంట వస్తున్నారని అడిగారు. దీనికి ఫణీంద్ర అలా అని మీరు పూర్తిగా ఇక్కడే ఉండిపోవాలని అనుకోకూడదు.. నాగ లోకం వచ్చి తీరాల్సిందేనని అంటాడు. నువ్వు తల్లి అయితే తప్పు పౌర్ణమికి పాముగా మారడం నుంచి తప్పించుకోగలవు.. అలా చేస్తే మోక్ష ప్రాణాలు పోవడం ఖాయం అంటూ చెబుతాడు. మరణం తప్పదు అనుకున్నప్పుడు మా ప్రయోజనాలు మేము చూస్కుంటామని పంచమి చెబుతుంది. అంతోలనే యువరాజు.. నీకోసం నేను నాగ దేవతను వేడుకుంటాను.. నువ్వు నాగ లోకం రాకపోతే అసలు రాణీయే ఉండదని ఫణీంద్ర చెబుతాడు. భర్త ప్రాణాలు కాపాడితేనే తాను వస్తానని అంటుంది. అలా కుదరదు అని ఫణీంద్ర చెబుతాడు.

కానీ నువ్వు పాముగా మారిన వెంటనే మోక్షను కాటేసి.. నాగ లోకం రావాలి. అక్కడ నీకు రాణిగా అభిషేకం జరిగిన తర్వాత మెల్లిగా ఎవరికీ తెలియకుండా నాగమణి తీసుకు వచ్చి మోక్షకు ఆనిస్తే అతడు ప్రాణాలతో బయట పడతాడు. లేదంటే కష్టం. అలాగే మోక్షను కాపాడిన వెంటనే నాగమణిని తీసుకెళ్లి మళ్లీ యథాస్థానంలో పెట్టాలి. లేదంటే నాగ లోకం అంతా అతాలకుతలం అవుతుంది. అందరికీ శక్తుని ఇచ్చే ఆ నాగమణి అక్కడే ఉండాలి. ఎవరి చేతుల్లో పడినా సమస్యలు తప్పవని హెచ్చరిస్తాడు. దీంతో పంచమి ఆలోచనలో పడుతుంది. మరి ఆ రెండ్రోజుల పాటు మోక్ష శరీరాన్ని ఎవరు కాపాడతారు అనగానే.. నా వద్ద ఓ నాగ కన్య ఉంది. ఆమే దగ్గరుండి మోక్షను చూసుకుటుందని చెబుతాడు.
అంతేకాకుండా రేపు ఉదయం గుడికి వస్తే ఈ నాగకన్యను పరిచయం చేస్తానని కూడా చెబుతాడు. అంతలోనే అక్కడకు వచ్చిన చిత్ర.. వారిద్దరినీ చూసి జ్వాలను తీసుకు వస్తుంది. పంచమి ఎవర్నో రప్పించుకుని మాట్లాడుతుందంటూ నూరిపోస్తుంది. కానీ అక్కడకు వచ్చేసరికి ఎవరూ ఉండరు. పాము వారి వెంట పడి భయపెడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. మరోసారి పంచమి.. మోక్షకు నాగమణి గురించి చెబుతుంది. దాని వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని.. గతంలో నా దూరపు బంధువుగా పరిచయం చేసుకున్న ఫణీంద్రయే నాగలోకపు యువరాజు అని చెబుతుంది. అదంతా వద్దని నువ్వు తల్లి అయితే చాలంటూ మోక్ష చెబుతాడు. మరి పంచమి ఏం చేయబోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











