Naga Panchami 12th February: మరో కొత్త ప్లాన్ వేసిన పంచమి, ఖుషీలో మోక్ష.. వీరిద్దరినీ చంపాలని కరాళీ నిర్ణయం!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో కరాళీ రూపంలో ఉన్న మేఘనతో.. పంచమి మమాట్లాడుతూ కనిపిస్తుంది. ముఖ్యంగా మేఘన.. మంచి నిర్ణయం తీసుకున్నావు పంచమి.. మోక్ష, నువ్వు కలిసి ఉండటమే నాకు కావాలి అంటు చెబుతుంది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.. మీరిద్దరూ చాలా సంతోషంగా ఉండండి అంటూ వివరిస్తుంది. ఇదంతా విన్న పంచమి వద్దు మేఘన నువ్వు ఇక్కడే ఉండాలని అటుంది.
ఆ తర్వాత పంచమి నీతో నేను అన్నీ వివరంగా చప్పలేను.. మేఘన కానీ నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి.. నేను నీకు, మోక్షకు పెళ్లి చేయాలనే ఈసారి ఇలా ప్లాన్ చేశానంటూ వివరిస్తుంది. మోక్షను నానుంచి దూరం చేయడానికే కరాళీ నిన్ను బలి పశువును చేసిందంటూ చెబుతుంది. నీకు అన్యాయం జరగనివ్వను.. కచ్చితంగా మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని పేర్కంటుంది. ఇదంతా విన్న మేఘన.. మనసులో.. కరాళీని పట్టుకోవాలనుకుంటూ కరాళికే చిక్కావు అంటూ అనుకుంటుంది. నీ చేతులతోనే మోక్షను బలిపశువును చేయనున్నావు అంటూ ఫైర్ అవుతుంది.

ఆ తర్వాత జ్వాలను చూస్తూ.. చిత్ర, వారి ఇద్దరు భర్తలు ఫైర్ అవుతారు. జ్వాలకు ఏదో జరిగిందని భయపడుతుంటారు. కానీ చిత్ర మాత్రం జ్వాల అక్క చాలా క్రూయల్ అంటూ అనగా జ్వాల భర్త ఫీల్ అవుతాడు. వెంటనే చిత్ర భర్త లారిద్దరికీ ఉన్న చనువు వల్లే తను అలా మాట్లాడుతుంది అంటూ అనగానే.. జ్వాలలోంచి నంబూద్రీ ఆత్మ వెళ్లిపోతుంది. ఇక వెంటనే తనను డాక్టర్ కు చూపించాలని చెబుతారు. ఇలా అక్కడి నుంచి అందరూ వెళ్లిపోతారు. మరోవైపు కరాళీ తన అన్న నంబూద్రీ ఆత్మను పిలిచి మాట్లాడుతుంది.
నంబూద్రీ కరాళీని మంచి మార్చాలని చూస్తాడు. మోక్షను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని అంటాడు. కానీ ఆమె మాత్రం తన శక్తులు రావాలని కోరుకుంటున్నట్లు వివరిస్తుంది. శక్తులు వచ్చాకా ఏం చేస్తావు.. నీకు సరైన లక్ష్యం లేనప్పుడు నువ్వు ఏం చేసిన వృథానే అనగా... అదేం లేదు అన్నయ్య నాకు సరైన సంకల్పమే ఉందని అంటుంది. ఆ తర్వాత తన మనసులోని కోరికను బయటపెడుతుంది. నీ నోటి నుంచి వచ్చినప్పుడు నాగమణిని దక్కించుకోవాలనుకున్నాను.. దక్కించుకుని తీరుతానని శపథం చేస్తుంది. ఆ తర్వాత నంబూద్రీ పంచమిని తానే చంపుతానని.. మోక్షను మాత్రం నువ్వు చూసుకో అంటాడు.

ఇక పంచమి గురించి ఆలోచిస్తూ.. మోక్ష లోలోపలే మురిసిపోతుంటాడు. అప్పుడే గదిలోకి పంచమి రాగా సంతోషంతో ఎత్తుకుని తిప్పేస్తాడు. రెడీ అవ్వు బయటకు వెళ్లాలని అంటాడు. నా మీదే ప్రేమే... నువ్వు మా అమ్మకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేలా చేసిందని పేర్కొంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి హాల్లోకి వస్తారు. మేము బయటకు వెళ్తున్నామంటూ పంచమికి శబరికి చెబుతారు. మీరిద్దరూ ఇలాగే సంతోషంగా.. నిండు నూరేళ్ల జీవించాలని దీవిస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. అక్కడే సుబ్బు కనిపించగా.. తెగ సంబుర పడిపోతూ ఉంటారు.


Click it and Unblock the Notifications











