Naga Panchami December 30th: సుబ్రహ్మణ్య స్వామి పాదాల వద్ద పంచమిచనిపోయిందా..! సుబ్బు ఏం చేయబోతున్నాడు?

నాగ పంచమి సీరియల్ ప్రతిరోజూ రసవత్తరంగా సాగుతోంది. సినిమాకు ఏమాత్ర తగ్గకుండా థ్రిల్ ను పంచడంలో సఫలం అవుతోంది. ముఖ్యంగా అద్భుతమైన ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను రక్తి కట్టించడంలో ఎప్పుడూ ముందుంటున్నారు సీరియల్ నిర్వాహకులు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి దగ్గరకు వస్తుండడం.. ఆలోపే పంచమి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. మరో అద్బుతమైన ట్విస్ట్ ఇచ్చారు. మోక్ష తల్లి వైదేహి.. పంచమిని ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఇంట్లోని కుటుంబ సభ్యులు అంతా ఆమె కోసం వెతుకుతుండగా... నాగలోకపు యువరాజు ఫణీంద్ర కూడా పంచమి గురించి తెగ టెన్షన్ పడుతున్నాడు.

ఈక్రమంలోనే మేఘనతో మాట్లాడుతూ.... నీక మంత్ర శక్తులు ఉన్నాయి కదా పంచమి ఎక్కడ ఉందో చూడు అంటాడు. అందుకు వెంటనే మేఘన తన మంత్రశక్తిని ఉపయోగించి పంచమి ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె అంజనం వేయగా... ఏవేవో చెట్లు, పొదలు మాత్రమే కనిపిస్తాయి. ఇలా కనిపిస్తుందంటే.. పంచమి ఏదో లోయలోనో, గుట్టల పైనుంచో దూకి చనిపోయినట్లు అనిపించట్లేదని.. ఆమె చనిపోయి ఉంటే ఇలా కనిపించి ఉండేది కాదని అంటుంది. ఇక ఆ తర్వాత పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుహకు వెళ్లి అతడికి దండం పెడుతుంది. ఆ తర్వాత నా జీవితం అంతా అంధకారం అయిపోయింది.. ఇక బతికి లాభం లేదంటూ స్వామి పాదాల వద్దే తల బద్ధలు కొట్టుకుంటుంది.

Panchami at the feet of Subrahmanya Swamy on December 30th Episode Number 240 in Naga Panchami Telugu Serial

అదే పనిగా, విపరీతంగా తల బద్ధలు కొట్టుకోవడంతో స్పృహ తప్పి పడిపోతుంది. అయితే నుదురు అంతా రంగు రావం చూస్తుంటే ఆమె ప్రాణాలు కోల్పోయిందేమో అనిపిస్తుంది. కానీ స్వామి వారి పాదాల చెంత కాబట్టి సుబ్బు ఆమెను మళ్లీ బతికాస్తాడని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరనగనుంది అనేది. మరోసారి పంచమి వెంటనే సుబ్బు ఇంటికి వస్తాడా.. లేక ఆయన ఏమైనా శక్తులను పంచమికి ప్రసాదిస్తాడా అనేది. పూర్తి వివరాలు తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

భర్త చెంపపై కొట్టగానే ఏడుస్తూ పంచమి తన గదిలోకి వెళ్తుంది. ఆ వెంటనే ఫణీంద్ర బయటకు రావడం నాగదేవత ప్రత్యక్షం అవడం జరుగుతుంది. నీ పనులు ఎంత వరకు వచ్చాయని నాగ దేవత అడగా.. త్వరలోనే శుభవార్తతో వస్తానని అంటాడు. రావాల్సింది వార్తతో కాదు పంచమితో అని నాగ దేవత అనగా.. తనను తీసుకునే వచ్చేందుకే ఏర్పాట్లు చేస్తున్నానని.. భార్యాభర్తలు గొడవ పడిన విషయాన్ని కూడా చెబుతాడు. విజయోస్తు అని దేవత వెళ్లగానే.. అతడు పంచమి గదికి వెళ్తాడు. మేఘన కూడా అక్కడే ఉంటుంది. ఫణీంద్ర మానవుడు మిమ్మల్ని కొట్టడం ఏంటి.. అతిడి కాటేసి మనం నాగలోకం వెళ్లిపోదామని అంటాడు.

అదంతా విన్న పంచమి గట్టిగా ఫైర్ అవుతుంది. తను నా భర్త ఏం చేసినా నేను భరిస్తానంటూ క్లారిటీ ఇస్తుంది. అలాగే అతడి పర్మిషన్ ఉంటేనే నేనేమైనా చేయగలను.. ముఖ్యంగా నాగలోకం రావాలంటే ఆయన అనుమతి కావాలంటూ వివరిస్తుంది. ఆ తర్వాత మేఘన.. భర్తను ఒప్పించుకుని ఫణీంద్రకు నాగలోకం వస్తానని చెప్పు.. అతడే సాయం చేస్తాడు మోక్ష ప్రాణాలు కాపడవచ్చని పేర్కొంటుంది. ఆ తర్వాత తెల్లారడం మేఘన పూజ చేయడం.. ఇంట్లో వాళ్లను బుట్టలోవేసుకునే పనిలో పడుతుంది. ఇల్లు తుడిచి పూజ చేసి.. అందరికీ హారతి ఇస్తుంది. ఆ తర్వాత స్వయంగా కాఫీ పెట్టి తీసుకు వస్తుంది.

అప్పుడే కిచెన్ లోకి వచ్చిన చిత్ర, జ్వాలలను ఓ పట్టు పడుతుంది మేఘన. తన మంత్ర శక్తితో కాఫీని చల్లగా, వేడిగా చేస్తూ వాళ్ల నోళ్లు కాలుస్తుంది. మీరేంటి తేడాగా ఉన్నారంటూ అనుకుంటూ హాల్లోకి వచ్చేస్తుంది. నీకెందుకుమ్మా ఈ పనులన్నీ అంటూ శబరి అనగా.. మీరంతా నన్ను మీ కుటుంబంలో ఒకదానిలా చూస్తున్నారు, ఈ మాత్రం పని చేస్తే తప్పేముంది అంటుంది. అలా అంతా కాఫీలు తాగగానే.. మోక్ష నిద్ర లేవడంతో గొడవ ప్రారంభం అవుతుంది. ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఇక్కడ పడుకున్నావేంటి అని మోక్ష తల్లి అడగ్గా... గదిలో నిద్ర పట్టలేదని చెబుతుంది. అలా చెప్పకు మోక్ష రాత్రి జరిగిన గొడవ మేము చూశాము... తను నిన్ను ఎంత ఇబ్బంది పెడితే నువ్వాలా ప్రవర్తించావో తెలుస్తుందంటూ చెబుతుంది.

ఇలా అంతా ఒక్కో మాట అంటూ ఉంటారు. శబరి అయితే అలా ఎలా కొట్టావు.. అంత పెద్ద తప్పేం చేసింది పంచమి అంటూ ఫైర్ అవుతుంది. ఇలా మనిషికో మాట అంటుండగానే వైదేహి.. పూర్తిగా పంచమిని వదిలేయమని చెబుతుంది. రాత్రి గొడవ జరిగిన తర్వాత తానే పంచమిని ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పినట్లు వివరిస్తుంది. దీనికి మోక్ష చాలా ఫైర్ అవుతాడు. మా మధ్య ఏవైనా గొడవలు ఉంటే మేము చూస్కుంటాం.. మీరు కల్గజేసుకోవద్దు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంతటితో ఈరోజుట ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X