Naga Panchami: నాగలోకానికి వెళ్లేందుకు పంచమి ప్రయత్నాలు, మోక్షను చంపితేనే ప్రవేశం ఉంటుందన్న నాగదేవత!
Naga Panchami November 4th Episode: నాగ పంచమి సీరియల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. పంచమియే పాము అని.. తన భార్యే తనను చంపేందుకు ప్రయత్నించిందని ఇప్పటికే మోక్ష తెలుసుకున్నాడు. ఈక్రమంలోనే తన భార్య గురించి తెలుసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు ప్రాణంగా ప్రేమించిన భర్తకు తన అవసరం లేదని అనిపిస్తోందని.. ఇక ఈ లోకంలో ఉండాల్సిన పని కూడా లేదంటూ పంచమి కన్నీరు పెట్టుకుంటుంది. ప్రత్యేక పూజలు చేసి మరీ నాగ దేవతను ప్రసన్నం చేసుకుంటుంది. మానసికంగా చాలా అలసిపోయాను, ఇక నేను ఈ లోకంలో ఉండలేను... ఈ క్షణమే తనను ఇక్కడి నుంచి తీసుకెళ్లమంటూ కన్నీరు పెడుతుంది.
కానీ నాగ దేవత మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పంచమికి తనపై గౌరవం, అభిమానం ఏమాత్రం లేవని.. అందుకే మహారాణి అని కూడా పిలిచేందుకు తన మనస్సు ఒప్పుకోవట్లేదని అంటుంది. మోక్షను చంపే వరకు ఎట్టి పరిస్థితుల్లో నీకు నాగ లోక ప్రవేశం ఉండదని హెచ్చరించి మాయమైపోతుంది. మరోవైపు పంచమి స్వగ్రామానికి వెళ్లిన మోక్ష స్వామి వారితో మాట్లాడి పంచమి జన్మ రహస్యం గురించి తెలుసుకుంటాడు. పంచమి నాగ కన్య అని ఒక్క పౌర్ణమి రోజు మాత్రమే ఆమె పాములా మారుతుందని.. ముఖ్యంగా మోక్షను చంపితేనే ఆమె నాగలోకానికి వెళ్లగలదని తెలుసుకుంటాడు. ఇది తమ ఇద్దరి మధ్య గొడవ అని.. నేరుగా దీన్ని పంచమితోనే తేల్చుకుంటానని వెళ్తాడు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది.

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా మోక్ష.. తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ కనిపిస్తాడు. పంచమిని అస్సలే ఇంటికి పంపనని.. తనను కాటేసేందుకు వచ్చిన పాము గురించి పూర్తిగా తెలుసుకుంటానని వివరిస్తాడు. అసలు ఆ పాము ఒక్క పౌర్ణమి రోజు మాత్రమే తనపై ఎందుకు దాడి చేయాలనుకుంటుందో తెలుసుకుంటానని.. ఆ తర్వాతే పంచమి గురించి ఆలోచిస్తానని అంటాడు. మోక్ష తల్లి కచ్చితంగా ఇంటి నుంచి పంచమిని పంపించేయాల్సిందేనని చెప్పినప్పిటకీ.... మోక్ష మాత్రం వినడు. అన్నీ విషయాలు తెలుసుకునే వరకు పంచమి ఇక్కడే ఉంటుందని అంటాడు. ఇక ఆ తర్వాత మోక్ష అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక ఆ తర్వాత కరాళీ పూజలు చేస్తూ కనిపిస్తుంది. ముఖ్యంగా నాగమణిని పొందేందుకు కాళికామాతకు ప్రత్యేక పూజలు చేస్తుంది. కఠినమైన తపస్సు చేసి మరీ అమ్మవారిని రప్పిస్తుంది. మరోసారి తనకు సాయం చేయాలని కోరుతుంది. కానీ లోకమాత మాత్రం.. ఇప్పటికే నీ అన్న నంబూద్రీని నీకోసం బతికించానని.. అలాంటి తప్పుడు వ్యక్తిని కాపాడినందుకే చాలా చింతించానని అంటుంది. ఇప్పుడు కూడా నీ అన్నను కాపాడుకునేందుకు నాగమణిని సంపాధించడం సరికాదని.. దానికి నేను అస్సలే సహకరించనని వివరిస్తుంది. కానీ కరాళీ మాత్రం ఎలాంటి పూజలు చేసైనా సరే మిమ్మల్ని మళ్లీ మళ్లీ రప్పిస్తానని అంటుంది. ఇందుకు కాళికామాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. పంచమికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి మాయమైపోతుంది.
కానీ కరాళీ మాత్రం కచ్చితంగా నాగమణిని సంపాధించుకుంటానని.. ముఖ్యంగా మోక్షను అడ్డు పెట్టుకుని పంచమి ద్వారా నాగమణిని పొందుతానని అంటుంది. ఇక ఆ తర్వాత మోక్ష తాను పాముల గురించి రీసెర్చ్ చేస్తున్న చోటుకి వెళ్తాడు. ఇష్టరూప ధారిణి నాగినిల గురించి తెలుసుకుంటాడు. ఆ జాతి ఇప్పటికీ ఉందా అని పుస్తకాలు తిరగేస్తాడు. ఆ తర్వాత తనకు తెలిసిన ఓ సార్ వద్దకు వెళ్లి అడుగాతాడు. అతనికి తెల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి.. ఈ పాముల గురించి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే పంచమిని అడగమని... ఆమె స్వగ్రామంలోని వారందరికీ పాముల గురించి ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుందని చెబుతాడు.

అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఓ చోట కూర్చుని ఉండగా.. నెమలి వస్తుంది. స్వామీ.. మీరు పంచమికి ఇచ్చిన గడువు పూర్తయింది వెళ్లిపోదామా అని ప్రశ్నిస్తాడు. కానీ సుబ్బు మాత్రం పంచమికి ఇఫ్పుడే అసలైన కష్టాలు ప్రారంభం అయ్యాయని.. తన భక్తురాలి కోసం తాను ఇప్పుడు ఇక్కడే ఉండాలని చెబుతాడు. పూర్తిగా తానే కాపాడకపోయినా.. ధైర్యం ఇచ్చేందుకు అయినా వెంట ఉండాలనుకుంటున్నట్లు చెప్పుకొస్తాడు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది. చూడాలి మరి పంచమి మోక్షను చంపి నాగ లోకానికి వెళ్తుందా... లేక పూర్తిగా ఇక్కడే ఉండిపోతుందా అనేది.


Click it and Unblock the Notifications











