Naga Panchami January 12th: మోక్షను కాటేసి నాగలోకం వెళ్లిపోయిన పంచమి.. అటే ఉండిపోతుందా, తిరిగి వస్తుందా?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ అద్భుతంగా సాగుతుంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న ఈ సీరియల్ చూసేందుకు అంతా తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు... నేరుగా నాగలోకపు యువరాణి పంచమియే భర్త మోక్షను కాటేయడం హైలెట్ గా నిలిచింది. ఇంతకాలం నుంచి భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న పంచమి.. పాముగా మారి కాటేసింది. ఆ తర్వాత మనిషిగా మారి మోక్ష బాబు, మోక్ష బాబు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఆ తర్వాత నాగలోకానికి వెళ్లేందుకు సిద్ధం అయింది. నాగ సాధువుతో పాటు, మేఘన, ఫణీంద్రలు ఆలస్యం అవుతుంది పదా అనగానే నాగలోకం వెళ్లేందుకు సిద్ధం అయ్యారు.

ఇలా మళ్లీ పాముగా మారిని పంచమిని చూసి ఫణీంద్ర కూడా పాముగా మారాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి నాగలోకం వెళ్లేందుకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే వెంటనే నాగ సాధువు మోక్షను కాటేసిన చోట ఓ తాడు కట్టాడు. కళ్లు మూస్తే విషం తలకెక్కుతుందని చెబుతూ.. కళ్లు మూయొద్దు అని వివరిస్తాడు. ఆ తర్వాత మేఘన కూడా.. పంచమి నాగమణి తీసుకు వస్తుంది మీరు భయపడకండి అని అంటుంది. మేఘన అలా చెప్పగానే నాగసాధువు ఆమెను చూస్తాడు. అయితే నాగలోకం వెళ్లిన పంచమి నాగమణిని తీసుకు వస్తుందా లేదా అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే.

Panchami Bite Moksha And Go to Nagalokam on Naga Panchami January 12th Episode

ఇక ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా చిత్ర, జ్వాలలు కుటంబ సభ్యులకు పంచమి పాము అని చెబుతూ కనిపిస్తారు. పంచమి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే అనేక సమస్యలు వస్తున్నాయని తనను ఇంట్లోంచి పంపిస్తేనే సమస్యలు తగ్గుతాయని జ్వాల చెబుతుంది. దీంతో మోక్ష తల్లి వైదేహి.. ఏవండి ఆ పాము మన ఇంట్లో వద్దండి అంటూ ఏడుస్తూ చెబుతుంది. అది విన్న మోక్ష తండ్రి.. వారు తిరిగి వచ్చాక వారికి విడాకులు ఇప్పిస్తానని అందుకోసం లాయర్ తో కూడా మాట్లాడతానంటూ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఇక ఆ తర్వాత పంచమి, మోక్షలు నాగులవరం వెళ్తూ కనిపిస్తారు.

అడవుల్లోంచి నడిచి వెళ్లి మరీ నాగ సాధువును కలుస్తారు. అప్పటికే అక్కడ యాగం చేస్తున్న స్వామి.. వీరిని చూసి దగ్గరకు వస్తాడు. ఈక్రమంలోనే పంచమి నాకు సాయం చేయండి స్వామీ అనగా... ఓ నాగకన్యకు సాయం చేసే భాగ్యం కల్గిందంటే ఓ నాగ సాధువుగా నాకు అంతకంటే సార్థంకం ఇంకేముందంటూ ఆయన చెబుతారు. ఆ తర్వాత నాగమణిని తీసుకు వచ్చి భర్తను కాపాడుకోవాలనుకున్నట్లు పంచమి చెబుతుంది. నాగమణిని తీసుకు వచ్చి ప్రాణాలు కాపాడవచ్చని కానీ.. అది తీసుకు రావడం అసంభవం అని అంటాడు. దానికంటే చంద్రకాంత మొక్కను తీసుకు వస్తే ప్రాణాలు కాపాడుకోవడం సులువు అని అంటాడు.

Panchami Bite Moksha And Go to Nagalokam on Naga Panchami January 12th Episode

దానికి పంచమి.. చనిపోయిన వారిని దానితో బతికించలేమని అనగానే.. అవును కానీ మోక్షను కాటేసిన తర్వాత తలకు విషం ఎక్కుకుండా కొన్ని ఆకు పసర్లు రాసి కాపాడవచ్చని వివరిస్తాడు. అదే విషయాన్ని మనుసులో ఉంచుకుంటుంది పంచమి. ఇక ఆ తర్వాత వీరి దగ్గరకి ఫణీంద్ర వస్తుండగా.. నాగ దేవత ప్రత్యక్షం అవుతుంది. యువరాజా మీరు మాట తప్పారు అంటూ ఫైర్ అవుతుంది. ఎప్పుడు నాగలోకానికి వస్తారు. అసలు మీరు ఆ కార్యం చేయగలరా లేదా అని ప్రశ్నిస్తుంది. దానికి ఫణీంద్ర కచ్చితంగా చేయగలను ఈరోజే నాగలోకం వస్తానని అంటాడు. నువ్వు ఆ కార్యం చేయలేకపోతే ఇప్పుడు నాగలోకం వచ్చేయమని లేదంటే ఈ ఒక్కరోజే నీకు సమయం ఇస్తున్నానని చెబుతుంది.

ఇక ఆ తర్వాత నాగ సాధువు, మేఘన, ఫణీంద్రల మధ్యనే పంచమి.. పాముగా మారి మోక్షను కాటేస్తుంది. ఆ తర్వాత మనిషిగా మారి మోక్షను క్షమించమని అడుగుతుంది. ఇక ఆ తర్వాత మళ్లీ పాముగా మారి నాగలోకం వెళ్లేందుకు సిద్ధం అవుతుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తి అయింది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X