Naga Panchami 15th January: మోక్షను కాటేసిన పంచమి, నాగలోకంలో కరాళీ.. నాగమణి దొంగిలించగలదా?

Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ మరింత అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో దుమ్మ రేపుతున్న ఈ షోకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. ముక్కోటి ఏకాదశి రావడం వెళ్లిపోవడం ఇప్పటికే జరగ్గా.. తాజాగా మరో అద్భుతమైన ట్విస్ట్ ఇచ్చారు సీరియల్ నిర్వాహకులు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో పంచమి అనుకుని.. కరాళీకి మంత్రం చెప్పేశాడు ఫణీంద్ర. దీంతో ఆమె నాగలోకం వెళ్లనుంది. మరోవైపు ఫణీంద్ర ఎలాగూ మంత్రం చెప్తాడని పంచమి పాముగా మారి మోక్షను కాటేసింది. ఈక్రమంలోనే అతడు నొప్పితో విలవిల్లడాతున్నాడు. అది గమనించిన పంచమి భయంతో గజగజా వణికిపోతుంది.

వెంటనే ఫణీంద్ర.. పంచమికి నాగలోకం వెళ్లమని చెబుతాడు. అయితే మంత్రం చెప్పండి వెళ్తానని ఆమె అనగా.. అదేంటీ అప్పుడే చెప్పానుగా అంటూ ఫణీంద్ర అంటాడు. దీంతో పంచమిలో టెన్షన్ మొదలవుతుంది. మరోవైపు మోక్ష నొప్పితో ఏడుస్తూ, అరుస్తూ ఉంటాడు. అసలేం జరగుతుందో తెలియక నాగ సాధువు కూడా వారినే చూస్తుంటాడు. అయితే దీన్నంతటిని మనం రేపటి ఎపిసోడ్ లో చూడవచ్చ. అయితే ఈ రోజుటి ఎపిసోడ్ లో మాత్రం.. పంచమి, ఫణీంద్ర, మోక్షలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. నాగమణిని తీసుకు రావడం అసాధ్యం అని నాగ సాధువు చెప్పడం చంద్రకాంత మొక్కే ప్రాణాలు కాపాడగలదని వివరించడం చేస్తారు.

Panchami Bite Moksha And Karali in Nagalokam on Naga Panchami January 15th Episode

అయితే చంద్రకాంత మొక్క మాత్రమే తేవాలని ప్లాన్ చేసుకుంటారు. ఆ మొక్క కోసం అయితే నేను అవసరం లేదు.. మీరే వెళ్లమని పంచమి అంటుంది. నాపై నమ్మకం లేదా అని ఫణీంద్ర అంటాడు. అలా ఏం లేదని కానీ నాకు మొక్క తెలియదు కదా అని పంచమి వివరించగా.. నేనో మంత్రం చెబుతాను.. అది ఒక్కరికి ఒక్కసారి మాత్రమే పని చేస్తుంది దీని వల్ల నేరుగా నాగలోకం వెళ్లిపోవచ్చని ఫణీంద్ర అంటాడు. తాను కూడా మోక్ష వద్దే ఉండి విషయం లాగేస్తానని ఫణీంద్ర వివరించగా.. పంచమి ఓకే చెబుతుంది. అలాగే నాగ సాధువు కూడా మూలికలు తీసుకు వస్తానని చెబుతాడు. ఆ తర్వాత మోక్ష, పంచమిలు ఇద్దరే మిగలగా బాధ పడుతూ ఉంటారు.

మరోవైపు కరాళీ వీరు మాట్లాడుకున్నదాన్నంతా చూసి మహాకాళిని ఆవాహనం చేసుకుంటుంది. తన రూపం పోయి పంచమి రూపం వచ్చేలా వరం ఇవ్వమని అంటుంది. మహాకాళి కూడా ఇందుకు ఒప్పుకుంటుంది. కానీ నాగలోకం వెళ్లాక మాత్రం తాను ప్రసాదించిన మంత్ర శక్తులు ఏవీ పని చేయవని అనగా.. కరాళీ సరేనని అంటుంది. ఇలా పంచమి రూపంలోకి మారిపోయిన కరాళీ... ఫణీంద్ర వద్దకు వస్తుంది. మంత్ర ఉపదేశించమని అడుగుతుంది. అయితే అడిగింది పంచమియే అనుకుని మంత్రం చెబుతాడు. దీంతో కరాళీ మనసులోనే తెగ మురిసిపోతుంది.

Panchami Bite Moksha And Karali in Nagalokam on Naga Panchami January 15th Episode

ఇక అక్కడి నుంచి కరాళీ వెళ్లిపోతుంది. ఈక్రమంలోనే మోక్షను కాటేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని.. మోక్షను కాటేస్తుంది పంచమి. ఈక్రమంలోనే మంత్రం చెప్పమని అఢగా.. తాను అప్పుడే చెప్పానని అంటాడు. ఇలా వీరికి నిజం తెలుస్తుంది. మరి ఎవరికి మంత్రం చెప్పాడు, నాగలోకాన్ని, నాగమణిని కాపాడగలడా లేదా అన్నది తెలియాలంటే మాత్రం రేపటి వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X