Naga Panchami: మళ్లీ మోక్ష ఇంట్లో చేరిన కరాళీ.. శాశ్వతంగా నాగలోకానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!

నాగ పంచమి సీరియల్ మహా అద్భుతంగా సాగుతోంది. రోజుకో రకమైన ట్విస్ట్ ఇస్తూ సీరియన్ ను మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ముఖ్యంగా పంచమి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుండడం. ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో పంచమి నాగ కన్య అనుకుని కరాళీని మరోసారి ఇంట్లోకి తీసుకు వచ్చింది. తన భర్తను తాను కాటేసిన తర్వాత ఆమే కాపాడుతుందని అలా చేసింది. అయితే కరాళీని తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత పంచమికి తన అత్త షాక్ ఇస్తుంది. నీ కోసం నా కొడుకు పిచ్చి వాడైపోతున్నాడు నువ్వు లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

నువ్వు మోక్ష కళ్లకు కూడా కనిపించనంత దూరంగా ఇంట్లోంచి వెళ్లిపోవాలని పంచమిని వేడుకుంటుంది. దీనికి పంచమి ఒక్కసారిగా షాకవుతుంది. ఈక్రమంలోనే తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని మరింతగా బాధ పడుతుంది. కానీ మోక్ష తల్లి మాత్రం తన కొడుకు గురించి స్వార్థంగా ఆలోచిస్తూ... ఇంట్లోంచి వెళ్లిపోమంటూ ప్రమాణం చేయించుకుంటుంది. అయితే ఇప్పటికే పంచమి తన భర్తను కాపాడుకోవడానికి నాగలోకం వెళ్తానని నిర్ణయించుకోగా... తన అత్తపై ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ ముగిసిపోగా... నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Panchami Decided to go to Nagaloka Forever on December 23rd Episode Number 234 in Naga Panchami Telugu Serial

నిన్నటి ఎపిసోడ్ లో.. ముందుగా చిత్ర, జ్వాలలను చూపించారు. వారు ఫణీంద్రను చూసిన విషయం మోక్షకు చెబుతారు. పంచమిపై నీకు నమ్మకం ఉందా అంటూ అడిగి.. ఆ తర్వాత అతడు మనలా బట్టలు వేసుకోలేదని.. కింగ్ లాగా ఉన్నాడని అంటారు. దానికి మోక్ష మనసులో నాగలోకపు యువరాజే కావచ్చు అనుకున్నప్పటికీ.. పంచమికి చాలా మంది పాము స్నేహితులు ఉన్నారు.. ఇంట్లో ఇద్దరిపై అవి పగ బట్టాయటా కాటేస్తాయి కావచ్చు అంటూ మోక్ష వదినలను భయ పెట్టాడు. ఇలా తీవ్రంగా భయపెట్టగా.. వారు భయపడిపోతారు. ఇక ఆ తర్వాత మీరు జాగ్రత్తగా ఉండండంటూ ఆట పట్టించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఆ తర్వాత ఫణీంద్ర, కరాళీలు గుడిలో వేచి చూస్తూ ఉంటారు. యువరాణి వస్తుందా లేదా అని.. ఒకవేళ ఆమె వచ్చి నాగలోకం వస్తానంటే.. మీరు కచ్చితంగా నాగమణిని భూలోకానికి తీసుకు రావాలని కరాళీ అంటుంది. లేదంటే మనకు చాలా పాపం తగులుతుందని భయపెడుతుంది. అందుకు ఫణీంద్ర కూడా సరేనని అంటాడు. ఆ తర్వాత పంచమి గుడికి వస్తుంది. వచ్చీ రాగానే ఫణీంద్ర.. ఈమె పేరు మేఘన. ఈమె ఓ నాగకన్య అంటూ కరాళీని పరిచయం చేస్తాడు. ఆమె కూడా యువరాణికి ప్రణామాలు అంటుంది. ఆ తర్వాత పంచమి.. నిజంగానే నాగమణితో మోక్ష ప్రాణాలు కాపాడవచ్చా లేదా అని అడుగుతుంది. అందుకు కచ్చితంగా కాపాడవచ్చని అంటారు.

కానీ ఆ విషయం తన భర్తకు చెబితే నమ్మట్లేదని పంచమి చెప్పగా... నాగమణి శక్తులు తెలియని వాళ్లంతా అలాగే మాట్లాడతారంటూ మేఘన చెబుతుంది. ఆ తర్వాత ఫణీంద్ర... నువ్వు మోక్షను కాటేసిన వెంటనే నాగలోకం రావాలని.. అప్పుడు మేఘన మోక్షను కాపాడుతుందని చెబుతాడు. అక్కడకు వెళ్లి పట్టాభిషేకం అయిన వెంటనే నాగమణి తీసుకొచ్చి మోక్ష ప్రాణాలు కాపాడి.. మళ్లీ నాగలోకం వచ్చేయాలని అంటాడు. అందుకు పంచమి సరేనంటుంది. అలా అయితే తాను నాగలోకం వెళ్లి నాగ దేవతను.. పంచమి నాగలోకం వస్తానని అంటుందని వేడుకుంటానని అంటాడు. ఇక ఆ తర్వాత పంచమి ఇంటికి వెళ్లిపోతుంది.

నాగరాజు ఫణీంద్ర మాత్రం పంచమి నాగలోకం వస్తానంటేనే చాలా సంతోషంగా అనిపిస్తోందని.. ఇక ఆమె పూర్తిగా అక్కడే ఉండిపోతనంటే మరింత సంతోషం అని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత మోక్ష ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధ పడుతూ ఉంటాడు. అప్పుడే అతడి తల్లి అక్కడకు రావడం.. ఏమైంది మోక్ష అలా ఉన్నావు నీ గండాలన్నీ తప్పిపోయాయి కదా అంటుంది. మోక్ష అవేం పట్టించుకోకుండా వెళ్లిపోవాని చూడగా.. కుటుంబ సభ్యులంతా అక్కడకు వచ్చేస్తారు. పంచమి ఎవరితోనే మాట్లాడుతోందని చిత్ర చెప్పగా.. అవన్నీ అబద్ధాలే అంటూ అంతా తిడతారు. కానీ మోక్ష మాత్రం అది నిజమేనని అతడు.. పంచమి దూరపు బంధువు అని చెబుతాడు. ఇక ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X