Naga Panchami: గరుడతో పంచమి ఫైటింగ్ - ఆమె పామని ఇంట్లో వాళ్లకు చెప్పిన దుష్టుడు

Naga Panchami October 21st Episode: నాగ పంచమి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో చాలానే విశేషాలు జరిగాయి. ముఖ్యంగా పంచమి వెళ్లి నంబూద్రీకి వార్నింగ్ ఇవ్వడం హైలెట్ గా నిలిచింది. ముందుగా నిన్నటి ఎపిసోడ్ లో చిత్ర.. పంచమికి పాలు ఇచ్చి మల్లెపూలు కూడా పెట్టి మరీ మోక్ష దగ్గరకు పంపిస్తుంది. అక్కడకు వెళ్లిన పంచమి లోలోపల భయపడుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే మోక్ష పాలు మొత్తం తాగేస్తాడు. ఆ తర్వాత పంచమితో రొమాంటిక్ గా మాట్లాడతాడు. ఆపై ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు.

ఆ తర్వాత పంచమి వద్దు మోక్ష బాబు.. వదిలేయండి, వదిలేయండి అంటూ చెబుతుంది. కానీ మోక్ష మాత్రం అందుకు అస్సలే ఒప్పుకోడు. చివరకు ఎలాగోలా వదిలించుకునే సరికి మోక్ష కింద పడిపోతాడు. ఏమైందో తెలియక పంచమి తెగ ఇబ్బంది పడుతుంది. మోక్షబాబు, మోక్ష బాబు అంటూ పిలుస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అతను స్పందించకపోవడంతో చిత్ర పాలు ఇచ్చిన విషయం గుర్తుకు వస్తుంది. వెంటనే ఆమె వద్దకు వెళ్తుంది. కానీ ఆలోపే చిత్ర, జ్వాలకు జరిగిన విషయం చెబుతుంది. పంచమికి ఇచ్చిన పాలల్లో నిద్రమాత్రలు కలిపినట్లు చెబుతుంది.

Panchami Demand to Nambudris on October 21st Episode Number 180th in Naga Panchami Telugu Serial

దాని వల్ల మోక్ష పడిపోతే... కుటుంబ సభ్యులు అంతా కలిసి పంచమిని ఇంట్లోంచి పంపించేస్తారని వివరిస్తుంది. అందుకు జ్వాల కూడా అవును నిజమేనంటూ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. అప్పటికే అక్కడ నిల్చొని ఇదంతా విన్న పంచమి... దేవుడే తమ ఇద్దరిని ఒక్కటి కానివ్వట్లేడోమోనని భయపడుతుంది. ఇక ఆ తర్వాత పంచమి నంబూద్రీ వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. తన తండ్రితో పాటు నాగేశ్వరిని విడిచి పెట్టకపోతే నీ ప్రాణాలు తీస్తానని చెబుతుంది. అలాగే నంబూద్రీ కూడా పంచమికి రిటర్న్ వార్నింగ్ ఇస్తాడు.

నాగమణిని తెచ్చిస్తే నిన్ను ప్రాణాలతో విడిచి పెడతానని.. దాంతో పంచమి, మోక్షలు కలిసి ఉండవచ్చని అంటాడు. కానీ నీ చావు నా చేతిలోనే ఉంది.. అది ఎప్పటికీ తప్పదని పంచమి హెచ్చరిస్తుంది. ఇక ఆ తర్వాత నంబూద్రీ గరుడను పిలుస్తాడు. పంచమి పాము అని ఇంట్లో అందరికీ తెలిసేలా చేయమంటాడు. ఇక ఆ తర్వాత సుబ్బు కనిపిస్తాడు. ఆయన వాహనం అయిన నెమని అతడి వద్దకు వచ్చి స్వామి ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటారని ప్రశ్నిస్తాడు. అందుకు సుబ్బు నా భక్తులు ఆపదలో ఉన్నప్పుడు కాపాడేందుకు ఎంతకాలమైనా ఉండాలి కదా అని చెబుతాడు. వెంటే ఉండి మరీ ఆమెను కాపాడతానని అంటాడు.

Panchami Demand to Nambudris on October 21st Episode Number 180th in Naga Panchami Telugu Serial

పంచమి పాముగా మారి నాగలోకానికి వెళ్లిపోతుందా లేక మనిషిగా ఇక్కడే మోక్షతో కలిసి ఉంటుందా అని నెమలి సుబ్బును అడగ్గా.. వీటన్నిటికి కాలమే సమాధానం చెబుతుందని అంటాడు. ఇక ఆ తర్వాత పంచమి, గరుడలు ఫైట్ చేయడం మనం చూడొచ్చు. గరుడ పంచమి మెడ పట్టుకొని పైకి ఎత్తగా మోక్ష పరిగెత్తుకు వస్తాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడతాడు. ఆ తర్వాత ఎందుకిలా చేశావని ప్రశ్నించగా... పంచమి మనిషి కాదని పాము అని గరుడ చెబుతాడు. కాటేసే కాల నాగు ఈమె అంటూ భయపెడతాడు. అంతా ఫుల్లుగా భయపడిపోతారు. మోక్ష కూడా పంచమి మొహం చూస్తాడు. ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X