Naga Panchami 1st February: మేఘనను పెళ్లి చేసుకుంటే మోక్ష చావు ఖాయం.. పంచమి ఏం చేయబోతుంది?
Naga Panchami: నాగ పంచమి సీరయల్ రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా షో చాలా బాగుండగా.. మోక్ష మేఘనను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా చిత్ర, జ్వాలలు బయట కూర్చొని కనిపిస్తారు. ఆ తర్వాత అటు వైపు నుంచి మేఘన రావడం చూసి రమ్మని పిలుస్తారు. అక్కడికి వెళ్లిన వెంటనే ఏంటి ఎక్కడకు వెళ్లావు అని అడుగుతారు. అందుకు మేఘన గుడికి వెళ్లానని సైగలతో చెబుతుంది. అది చూసిన చిత్ర మాటలు రావట్లేదా అని అడిగితే.. జ్వాల మంత్రాలు రాలిపోతాయని అలా చేస్తోందంటూ సెటైర్ వేస్తుంది.
ఆ తర్వాత నీ గురించి, నీకు మంత్రాలు వచ్చనే విషయం గురించి మాకు చాలా బాగా తెలుసు అని జ్వాల అంటుంది. దీనికి మనసులో మేఘన.. నా మంత్రశక్తులు తిరిగి వచ్చిన వెంటనే మిమ్మల్ని కుక్కలుగా మార్చి నా గేటు దగ్గర కాపాలాగా పెట్టుకుంటానని అనుకుంటుంది. అలా చూస్తున్నావేంటి.. నీ గదిలో ఓ సంచి దొరికింది.. దాంట్లో చేయి పెట్టగానే తాము దెయ్యాలుగా మారి ఒకరినొకరు కొట్టుకున్న విషయం గురించి చెబుతారు. దాని గురించి నాకు తెలియదు.. అప్పుడప్పుడు నాకే ఏవేవో శబ్దాలు వినిపించి భయం వేస్తుంది అని అంటుంది. నువ్వు మోక్షను పెళ్లి చేసుకోవడానికి వీళ్లేదని అంటారు.

ఇక ఆ తర్వాత పంచమి నాగ సాధువు వద్దకు వెళ్తుంది. పాము రూపంలో ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటాడమ్మా.. అతడు కుదురుగా ఉండడం చూడలేదని చెబుతాడు. తను నన్ను నాగలోకం తీసుకెళ్లాలలని అనుకుంటున్నాడని పంచమి అనగా.. అది నీ చేతిలో లేదు పంచమి.. నీ జన్మ నాగ అంశతో ముడిపడి ఉన్నా.. నీ జీవితం భూలోకంతో మూడి పెట్టాడు ఆ శివయ్యా.. ముడులు ఎలా విప్పాలో ఆయనకు బాగా తెలుసంటూ వివరిస్తాడు. తాను తన భర్తకు దూరంగా ఉండడమే మేలు అని అంటుంది. మరెందుకు ఇంకా ఈ ఆరాటం నాగలోకం వెళ్లిపోవచ్చు కదమ్మా అని నాగ సాధువు అనగా.. మోక్ష బాబు సంతోషంగా ఉంటే వెళ్లిపోతానని వివరిస్తుంది.
ఆ తర్వాత అక్కడకు ఫణీంద్ర వచ్చి అత్యవసరమైన బాధ్యత పడింది.. మనం నాగలోకం వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని పంచమితో చెబుతాడు. నాగదేవతే స్వయంగా వచ్చి మనల్ని నాగలోకం రావాలని చెప్పిందని... మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అంటాడు. నాకు మోక్ష బాబు తర్వాతే ఏదైనా.. ఆయన సంతోషంగా ఉంటే తప్ప నేను నాగలోకం రాలేనని అంటుంది. నేను పట్నానికి వెళ్లాలని.. మేఘనతో మోక్ష బాబు పెళ్లి ఆపి.. కరాళీ ఎక్కడుంతో తెలుసుకుని తాడోపేడో తేల్చుకోవాలని.. అప్పుడే నాగలోకం వస్తానని అంటుంది.

నాగ సాధువు కూడా గొడవ పడడం కంటే మీరిద్దరూ వెళ్లి మేఘనతో మోక్ష పెళ్లి ఆపి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోమని సలహా ఇస్తాడు. దీనికి ఇద్దరూ ఓకే అనగా.. రేపే పట్నం వెళ్లాలని డిసైడ్ అవుతారు. ఇక ఆ తర్వాత శబరి తన కూతురు, మనవళ్లతో మాట్లాడుతూ.. మేఘనతో మోక్ష పెళ్లి ఆపాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మోక్ష రావడం.. మేము మీతో మాట్లాడాలని అనడం చూపిస్తారు. అలాగే నేరుగా వెళ్లి పంచమితో మాట్లాడడం బెటర్ అని శబరి అనగా.. అది సరికాదని.. మోక్షతోనే మాట్లాడాలని భావిస్తారు.
ముఖ్యంగా పంచమి తన వద్దకు రావాలంటే ఇదే కరెక్ట్ అని.. ఒకవేళ పంచమి రాకపోతే వచ్చే జన్మలో అయినా తనతో కలిసి జీవించవచ్చని అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని ఆయన నేరుగా శబరి, మేనత్తలకు వివరించి చెప్పాడు. అందుకే తాను మేఘనను పెళ్లి చేసుకోబోతున్నానని అన్నాడు. కానీ మేఘనను పెళ్లి చేసుకుంటే తాను చనిపోతడన్న విషయం వారికి తెలియదు. ఆ తర్వాత మోక్ష, మేఘనల పెళ్లి జరుగుతున్నట్లు కలగన్న పంచమి నిద్రలోంచి లేచి వద్దు, వద్దు అంటుంది. ఆ తర్వాత అసలు విషయాన్ని తల తల్లికి చెప్పడం చూపిస్తారు. పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











