Naga Panchami 5th March: మోక్షను తీసుకెళ్లి కరాళీ చేతిలో పెట్టిన పంచమి.. సినిమా రేంజ్ ట్విస్ట్ ఇది!
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో షాకింగ్ ఘటన జరిగింది. మేఘనను చస్తే పెళ్లి చేసుకోను, ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పిన మోక్షనే.. నేరుగా మేఘనను పెళ్లి చేసుకుంటానని చెప్పించాడు. మేఘనను పెళ్లి చేసుకోవాలని లేకోతే చనిపోతానంటూ పంచమియే బెదిరిస్తుంది. ఆమె మీద ప్రేమతోనే మోక్ష ఈ పెళ్లికి ఒప్పకుంటాడు. ముఖ్యంగా పంచమి కళ్లెదుటే నిశ్చితార్థం కూడా జరిపిస్తారు.
మేఘన, మోక్షలు పట్టుబట్టల్లో మెరవగా.. కుటుంబ సభ్యులు అందరి ముందు ఈ ఎంగేజ్ మెంట్ నిర్వహిస్తారు. అందరికీ ఇష్టం లేకపోయినా మోక్షన పెళ్లికి ఒప్పుకోవడం.. వైదేహి కూడా వెంటనే నిశ్చితార్థం చేయాలనడంతో ఎవరూ నోరు మెదపరు. ఇలా అందరూ కష్టంగానే ఈ వేడుక చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మోక్ష, మేఘనలు ఉంగరాలు మార్చుకుంటుంటే అంతా షాక్ బాధగా చూస్తుంటారు. పంచమి కూడా బాధ పడుతున్నా లోలోపల మోక్ష ప్రాణాలు కాపాడగల్గుతున్నందుకు సంతోషంగా ఉంటుంది.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా పంచమి, మోక్షలను చూపిస్తారు. పంచమి.. మేఘనను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తుంది. మన ఇద్దరిలో ఎవరి ప్రాణాలు దక్కాలన్నా వెంటనే మీరు మేఘనను పెళ్లి చేసుకోవాలంటూ ఫోర్స్ చేస్తుంది. లేదంటే వెంటనే తాను నాగలోకం వెళ్లిపోతానని.. ఆ కరాళీ బాధ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకున్నా, ఫణీంద్ర భారి నుంచి బయటపడాలన్నా మీరు మేఘనను పెళ్లి చేసుకోవాలని ఏడుస్తుంది. దీంతో పంచమి బాధ చూడలేని మోక్ష పెళ్లికి ఒప్పుకుంటాడు. మాట ఇస్తాడు.
కానీ మనసులో మాత్రం మేఘనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పంచమిని ఇక్కడే ఉంచాలని.. ఆలోపే శాస్త్రవేత్తలు తామిద్దరూ కలిసి ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారని భావిస్తాడు. మేఘనను పెళ్లి చేసుకోను అనుకునే ఈ పెళ్లికి ఒప్పుకుంటాడు. పంచమిని ఇక్కడ ఉంచేందుకు మోక్ష ఈ ప్లాన్ చేస్తాడు. ఇక ఆ తర్వాత మోక్ష తండ్రి ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఇంట్లో జరుగుతున్న ఘటనల గురించి చెప్పి వైదేహి కన్నీరు పెట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత అందరినీ పిలిచి మోక్ష ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకుంటారు.ఇలా పెళ్లికి ఒప్పిస్తారు.

మోక్షనే తానంతట తాను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. కానీ వైదేహి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వెంటనే నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసేందుకు పంతులుకు ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత మోక్ష బయటకు వస్తాడు. అక్కడే ఆయనకు పంచమి ఇచ్చిన నెమలి ఈక దొరుకుతుంది. అది చూస్తూ ఉండగా.. సుబ్బు వస్తాడు. అది గమనించిన మోక్ష కూర్చోమనగానే కూర్చొని... పంచమి గురించి మాట్లాడుకుంటారు. ఎలా ఉన్నారు మీరు అనగానే.. పంచమి నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటూ సుబ్బుకు ఫిర్యాదు చేస్తాడు.
కానీ పంచమి ప్రేమ నీకు అర్థం కావట్లేదని.. సుబ్బు అంటాడు. నువ్వే తనను అర్థం చేసుకోవట్లేదు.. నువ్వు తనను ద్వేషించినా తాను మాత్రం నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుందని చెబుతాడు. తను మీద నువ్వు నీ ప్రేమను చూపిస్తే.. తాను నీ నుంచి అస్సలే దూరం కాదు అని వివరిస్తాడు. ఆ తతర్వాత వెళ్లిపోతాడు. మోక్ష కూడా నెమలి ఈకు చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత వైదేహి ఏర్పాట్లు అన్నీ చేయమంటూ హడావుడి చేస్తుంది. మేఘనను చీర, నగలు తీసుకునేందుకు షాపింగ్ కు వెళ్దామనగా.. మోక్ష వచ్చి పంచమిని కూడా తీసుకెళ్లమంటాడు.


Click it and Unblock the Notifications











