Naga Panchami: ఇష్టరూప జాతి నాగుల కాటుకు విరుగుడు.. ఎక్కడ దొరుకుతుందో తెలుసుకున్న పంచమి!
Naga Panchami December 26th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోరుజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని విధంగా అద్భుతమైన ట్విస్టులతో సీరియల్ ను రక్తి కట్టిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో నాగమణి వల్లే కాకుండా మరో పద్ధతి ద్వారా కూడా ఇష్టరూప జాతి నాగుల కాటు నుంచి కాపాడుకోవచ్చని పంచమి తెలుసుకుంది. ముఖ్యంగా పంచమిని పెంచిన తల్లి నాగ సాధువు వద్దకు వెళ్లి... తన అల్లుడు మోక్షను కాపాడుకునే వేరే పద్ధతి ఏమైనా ఉందా అని అడుగుతుంది. అందుకు స్పందించిన నాగ సాధువు దివ్య దృష్టితో ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని చూస్తారు. అలా చూడగా నాగ లోకం కనిపిస్తుంది.
వెంటనే కళ్లు తెరిచిన నాగ సాధువు.. నాగ లోకంలో ఉండే నాగ చంద్రకాంత అనే మొక్క నీటి అడుగులో పెరుగుతుందని దాని వల్ల మోక్ష ప్రాణాలు కాపాడవచ్చని చెబుతాడు. ఇష్టరూప జాతి నాగుల విషానికి ఆ మొక్కే విరుగుడు అని అయితే అతి నీటి అడుగులో మాత్రమే దొరుకుతుందని కూడా వివరిస్తాడు. ఇదే విషయాన్ని తల్లి పంచమికి ఫోన్ చేసి చెప్పగా... పంచమి చాలా ఎగ్జైట్ అవుతుంది. తన భర్తను కాపాడుకోవడానికి ఇది మంచి పద్ధతి అని.. మోక్షకు కూడా చెబుతుంది. కానీ ఇదంతా విన్న మోక్ష మాత్రం తనకు దేని మీద ఆశలు లేవని, నమ్మకాలు కూడా లేవని.. అన్నీ కనుమరుగు అయిపోయాయని.. తాను ఏ క్షణం అయినా ఎవరికీ కనిపించకుండా కనుమరగైపోవచ్చు అని చెబుతూ కనిపించాడు. ఇదంటా ఈరోజుటి ఎపిసోడ్ లో చోటు చేసుకోగా.. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

మోక్ష తల్లి పంచమితో మాట్లాడుతూ కనిపిస్తుంది. మహా మృత్యుంజయ యాగం వల్ల తన కొడుకుకు ఉన్న గండాలు అన్నీ తొలగిపోయాయని... తాము భావిస్తున్నట్లు వైదేహి పంచమితో చెబుతుంది. అలాగే మరేవైనా గండాలు ఉంటే చెప్పాలని అంటుంది. ఇందుకు పంచమి చప్పుడు చేయకుండా చూడగా.. నీలో ఏదో సమస్య ఉందని నీ మొహం చూస్తుంటేనే అర్థం అవుతోందని అంటుంది. అలాగే నువ్వు మోక్షతో ఎందుకు కాపురం చేయడం లేదో కూడా నాకర్థం కావట్లేదని.. దానికి కారణం ఏంటో చెప్పాలంటూ ఫైర్ అవుతుంది. పంచమి మాత్రం అలాగే చూస్తూ ఉంటుంది. మోక్ష నీ మాయలో పడి పూర్తిగా పిచ్చి వాడైపోతున్నాడని.. నువ్వు వాడి కంటికి కనిపించకుండా వెళ్లిపోవాలని అంటుంది.
దీనికి పంచమి.. నా మనసులో ఓ కోరిక ఉంది.. అది తీరిన వెంటనే నేను మోక్ష బాబు జీవితం నుంచి వెళ్లిపోతానని వైదేహికి చెబుతుంది. కేవలం మోక్ష బాబు కళ్లకే కాదు ఆయన మరెవరి కంటికి కూడా కనిపించకుండా పోతానని అంటుంది. ఇక ఆ తర్వాత మోక్ష తన దగ్గరకు వస్తాడు. మీరు ప్రాణాలతో ఉండాలంటే తాను ఇక్కడి నుంచి వెళ్లక తప్పదని అనుకొని బాధ పడుతోంది. నాకేమైనా అయిన మరుక్షణమే నీవు ఈ ఇంట్లోంచి వెళ్లిపోవాలని.. లేకపోతే ఇంట్లో వాళ్లు నిన్ను అష్టకష్టాలు పెడతారంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను ప్రాణాలతో ఉండగానే.. నాగ లోకం వెళ్లాలని సూచిస్తాడు. కానీ పంచమి మాత్రం ఫణీంద్ర తనకు సాయం చేస్తాడని పంచమి చెప్పగా.. నిన్ను నాగలోకం తీసుకు వెళ్లేందుకు ఆశ పెడుతున్నాడని మోక్ష అంటాడు.

ఇదంతా కాదని తన బిడ్డకు జన్మనిస్తే చాలని ఇద్దరూ కలిస్తే తనకు ప్రాణ హాని కాబట్టి టెస్ట్ ట్యూబ్ బేబీకి జన్మనివ్వాలని సూచిస్తాడు. ఇందుకోసం ఒకరోజు గడువు కూడా ఇస్తాడు. ఇది కుదరకపోతే ఎవరి దారి వాళ్లదని అంటాడు. మరోవైపు కరాళీ తాను నాగకన్య అని ఫణీంద్ర పూర్తిగా నమ్మాడని అనుకుంటుంది. అంతలోనే ఫణీంద్ర వస్తాడు. అతడితో మాట్లాడుతుంటే... తన మనసులోని మాటలను పసిగడుతుంది. అతడు కేవలం పంచమిని నాగ లోకం తీసుకు వెళ్లాలని మాత్రమే భావిస్తున్నట్లు గుర్తిస్తుంది. యువరాణిని మోసగిస్తే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోదని ఫణీంద్రతో చెబుతుంది. మోసం చేసి పాపం మూట గట్టుకోవద్దని.. నాగమణిని తీసుకొచ్చి పంచమి ప్రాణాలు కాపాడాలని అంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


Click it and Unblock the Notifications











