Naga Panchami 6th February: పంచమి చేతులమీదుగానే మోక్ష, మేఘనల పెళ్లి.. ఏం జరగబోతుంది?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరూ ఊహించని రీతిలో ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వైదేహి తన భర్తకు ఫోన్ చేయడం.. మోక్ష నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేయమనడం ముందుగా చూపించారు. అయితే ఇంట్లో వాళ్లందరినీ పిలిచి వైదేహి ఎంగేజ్ మెంట్ సింపుల్ గా చేద్దామని.. కాకపోతే కొంతమంది బంధువులను పిలవాలని అంటుంది. వారి లిస్టు చెబుతాను ఫోన్ చేసి చెప్పమని అడుగుతుంది. అదంతా విన్న కుటుంబ సభ్యులు వద్దని వారిస్తారు.
ఈక్రమంలోనే జ్వాలలోకి నంబూద్రీ ఆత్మ పూని.. కచ్చితంగా పెళ్లి చేయాల్సిందేనని అంటుంది. నీకు దెయ్యం పట్టిందంటే అందరిపై ఫైర్ అవుతుంది. మేఘన జీవితం పాడు చేయకూడదని.. తొందరగా పెళ్లి చేసేయాలని అంటుంది. అలాగే శబరి కూడా బాగా ఫైర్ అవుతుంది. నా కొడుకు ఉంటే వాడి కాలర్ పట్టుకుని మరీ అడిగేదాన్ని అని.. ఈ పెళ్లి వద్దు అంటూ గొడవ చేస్తుంది. కనీసం ఓసారి పంచమితో అయినా సరే మాట్లాడి చూద్దామని చెబుతుంది. ఇలా అద్భుతంగా ఈ సీరియల్ సాగగా.. వెంటనే సీన్ లోకి పంచమి ఎంట్రీ ఇస్తుంది.

పంచమితో పాటు ఫణీంద్ర కూడా వస్తాడు. కానీ ఆయన పాముగా మారి లోపలికి రాగా.. పంచమి తనకు ఈ పెళ్లి ఇష్టమేనని.. మేఘనతో పెళ్లి జరిగితే వారిద్దరూ చాలా సంతోషంగా ఉంటారని అంటుంది. పంచమి నోట ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ షాక్ కు గురవుతారు. ఆ తర్వాత మోక్ష... పంచమిని తీసుకుని గదిలోకి వెళ్తాడు. ముందు నేను నీతో మాట్లాడాలి రా అంటూ తీసుకెళ్తాడు. ఆ తర్వాత అంతా హాల్లోంచి వెళ్లిపోగా... జ్వాలను చూసిన చిత్ర భయంతో పారిపోతుంది. పంచమిని లోపలికి తీసుకు వెళ్లిన మోక్ష.. నేను ప్రేమించింది నిన్ను.. వేరే వాళ్లను పెళ్లి ఎలా చేసుకోమంటావు అంటూ ఫైర్ అవుతాడు.
మా అమ్మ కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నానే తప్ప.. నేను సంతోషంగా ఉంటానని కాదని అంటాడు. ఇంతలోనే పంచమి.. మేఘన నాగకన్య అనుకున్నాను కానీ.. తను విషకన్య కాదని.. ఆ విషయం తెలిసిందని అంటుంది. తనను పెళ్లి చేసుకుంటే మీరు హాయిగా పిల్లాపాపలతో సంతోషంగా ఉంటారని చెప్పుకొస్తుంది. మరోవైపు మోక్ష నీతోనే కలిసి ఉంటానని అంటాడు. నాగలోకం కూడా వస్తానని చెబుతాడు. నాతో ఉంటే కష్టాలపాలవుతారని చెబుతుంటే.. నేను ఆ కష్టాలను ఎదుర్కుంటానని అంటాడు. ఇది చాలా తప్పు మోక్ష బాబు.. నాతో ఉంటే సమస్యలు తప్పవు.. అలాంటి సమస్య మీకు తీసుకు రానని చెప్పుకొస్తుంది.

నాకోసం నువ్వు ఇక్కడికి వచ్చావు.. నా మీద నువ్వు ప్రేమ ఉంచుకోవచ్చు కానీ నేను మాత్రం ఉంచుకోకూడదా అంటూ మోక్ష ప్రశ్నిస్తాడు. నాకేం ప్రేమ లేదని పంచమి అనగా.. మరి నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావని అడుగుతాడు. మేఘన నాగకన్య అని మీ ప్రాణాలు పోతాయని వచ్చానని చెప్పగా.. దాన్నే ప్రేమ అంటారని అంటుంది. నేను చనిపోవాలని అనుకునే మేఘనను పెళ్లి చేసుకోవాలనుకున్నాని, తనను ఇప్పుడే ఇంట్లోంచి పంపించి వేస్తానని అంటాడు. ఇదంతా విన్న పంచమి కాళ్లపై పడి మరీ అలా చేయొద్దని వేడుకుంటుంది.
మేఘన చాలా కష్టాల్లో ఉందని... ఆమెకు పెళ్లి ఆశ కల్పించి ఇప్పుడు వద్దంటే చాలా బాధ పడుతుందని పంచమి వివరిస్తుంది. ఆమెను పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషంగా ఉంటానని అంటుంది. అయితే నీ చేతుల మీదుగానే ఈ పెళ్లి జరిపించాలి.. అప్పుడే నీకు నా మీద ప్రేమ లేదని నేను నమ్ముతానని మోక్ష అంటాడు. మా పెళ్లి అయ్యే వరకు నువ్వు నా పక్కనే ఉండాలని అంటాడు. దీనికి పంచమి.. మీరు పెళ్లికి ఒప్పుకున్నారు అది చాలు మోక్ష బాబు అంటూ చెబుతుంది. అందుకోసం మీరు ఏం చెప్పినా చేస్తానని అంటుంది.

ఇక ఆ తర్వాత చిత్ర బయట చిప్స్ తింటూ ఉండగా.. పాముగా ఉన్న ఫణీంద్ర మనిషిగా మారడం.. ఆమె చూసిందనుకుని.. మళ్లీ పాముగా మారడం చూపిస్తారు. ఆ తర్వాత చిత్ర భయపడుతూ అరుస్తుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications











