Naga Panchami 8th March: మేఘనే కరాళీ అని తెలుసుకున్న పంచమి.. కత్తితో చంపబోతున్న కరాళీ!

Naga Panchami: నాగ పంచమ సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మేఘనే కరాళీ అని పంచమి తెలుసుకుంది. కరాళీ మహాంకాళి అమ్మవారి ముందుకు వెళ్లి ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి అయిందని.. పెళ్లి కాగానే మోక్షను తీసుకొచ్చి బలిస్తానని చెబుతుంది. అంతలోపే పంచమి, ఫణీంద్రలు అక్కడకు వస్తారు. అదంతా విన్న పంచమి కరాళీ.. నీ ఆటలు ఇక సాగవు... ఎవరో తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసురుతుంది. ఇదంతా విన్న మేఘన.. వీళ్లకు నిజం తెలిసిపోయిందని.. అక్కడే ఉన్న కత్తితో పంచమి, ఫణీంద్రలను చంపేందుకు యత్నిస్తుంది.

నిన్నటి ఎపిసోడ్ లో మేఘన.. పంచమితో మాట్లాడుతూ కనిపిస్తుంది. మా పెళ్లి అయ్యాక నువ్వు మోక్షకు కనిపించకూడదు అంటూ చెప్పుకొస్తుంది. పంచమి కూడా నీ చేతుల్లో పెట్టాకా నేను వెళ్లిపోతానంటూ వివరిస్తుంది. ఇక ఆ తర్వాత జ్వాల వచ్చి మీరిద్దరూ ఇంత క్లోజ్ గా ఎలా ఉండగల్గుతున్నారని ప్రశ్నిస్తుంది. శబరి ఊరుకో అని చెప్తుండగానే.. కుటుంబ సభ్యులు అంతా అవుతారు. ఆ తర్వాత వైదేహి మోక్ష ఎక్కడ అని అడుగుతుంది. నేను తీసుకొస్తానని పంచమి అనగా.. నువ్వు గెస్టువు మేఘన మాత్రమే ఈ ఇంటి కోడలు అంటూ వివరిస్తుంది.

Panchami Has Come to Know Meghana is Karali on Naga Panchami March 8th 2024 Episode

పంచమిని పూర్తి మనిషిగా మార్చేందుకు సమయం : ఇక ఆ తర్వాత మేఘన వెళ్లి మోక్షను పిలుచుకు వచ్చేందుకు బయలు దేరుతుంది. ఆలోపే మోక్ష శాస్త్రవేత్తలకు ఫోన్ చేసి తాను పంచమి కలవడం గురించి అడుగుతాడు. వంశపారంపర్యంగా ఉన్న జెన్యు సమస్యలను తీర్చడం కాస్త ఆలస్యం అవుతుంది... నేను ఇప్పటికే అనేక పరీక్షలు చేయించానని చెబుతాడు. ఆ తర్వాత అక్కడకు మేఘన రాగా నేను మిమ్మల్ని నేరుగా వచ్చి కలుస్తానని చెబుతాడు. ఆ తర్వాత మేఘన భోజనానికి రమ్మనగా మోక్ష రానంటాడు. పంచమి పిలిస్తే వచ్చే వారు నేనొచ్చి తప్పు చేశాంటూ చెబుతుంది.

భోజనం చేయకుండా శబరి వాకౌట్ : నేనేదో నా స్వార్థానికి మీతో పెళ్లికి ఒప్పుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు... కానీ నేను మీరు, పంచమి కలవాలనే ఇలా చేస్తున్నానంటూ వివరిస్తుంది. పీటల మీద పెళ్లికి ఆగిపోతే పంచమి మీదేనంటూ వివరిస్తుంది. ఇప్పటికీ మీరిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నానంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక ఆ తర్వాత తను రానని చెబుతున్నాడని మేఘన వచ్చి చెప్పగా... మేం వడ్డించుకుంటాం.. నువ్వు పాలు తీసుకెళ్లు అంటూ చెబుతుంది. ఇక నుంచి మోక్షకు సంబంధించినవి అన్నీ నువ్వే చూసుకోవాలని అనగా.. శబరి, ఆమె కూతురు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

Panchami Has Come to Know Meghana is Karali on Naga Panchami March 8th 2024 Episode

నువ్వు కచ్చితంగా యువరాణిని నాగలోకం తీసుకుస్తావు : ఇక ఆ తర్వాత ఫణీంద్ర నాగలోకానికి వెళ్తాడు. యువరాణిని పెళ్లి చేసుకోవాలనే ఆశ నీలో ఉంది కాబట్టి నువ్వు తప్పనిసరిగా తీసుకురాగలవు అంటూ నాగదేవత అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర యువరాణి తనకు తానుగా కచ్చితంగా వస్తానని చెప్పినట్లు వివరిస్తుంది. మోక్ష పెళ్లి కాగానే యువరాణి నాతో వస్తానని అంటుందని చెబుతాడు. యువరాణి ఇక్కడకు వచ్చే ఒక్కరోజు ముందు మాకు వర్తమానం పంపించు.. ఘనంగా ఏర్పాట్లు చేయిస్తానని నాగదేవత అంటుంది. ఆ తర్వాత ఫణీంద్ర అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

నిన్ను పూవుల్లో పెట్టి చూసుకుంటాను పంచమి : ఆ తర్వాత పంచమి తన భర్తతో బంధాన్ని తలుచుకుంటూ కన్నీరు పెడుతూ కనిపిస్తుంది. అంతలోనే ఫణీంద్ర పాము అక్కడకు వస్తుంది. కరాళీనీ పట్టించుకోకుండా వెళ్లిపోవాలనగా.. మోక్ష పెళ్లి అయ్యేలోపు కరాళీని చంపేస్తానని పంచమి అంటుంది. నాకే శక్తులు గనుక ఉంటే కరాళీని చంపేసేదాన్నని.. దాన్ని చంపితేనే మోక్షకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతుంది. కానీ ఫణీంద్ర మాత్రం అవన్నీ మర్చిపోయి.. నువ్వు నాగలోకం గురించి మాత్రమే ఆలోచించాలని.. అక్కడకు వెళ్లాకా నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానంటూ ఫణీంద్ర చెబుతాడు.

అత్యాశ, అతి ఆత్మవిశ్వాసం మంచివి కావు : ఆ తర్వాత మేఘన పాలు తీసుకుని మోక్ష గదికి వెళ్తుంది. కానీ అక్కడ మోక్ష కనిపించకపోయేసరికి ఇల్లంతా వెతుకుతుంది. అంతలోనే పంచమి బయట కూర్చోగా మోక్ష అక్కడకు వెళ్తాడు. నేను చెబుతున్నానను కదా.. నువ్వు మామూలు మనిషిగా మారుతావు అంటూ మోక్ష చెబుతాడు. అత్యాశ, అతివిశ్యావసం మంచివి కావని పంచమి అంటుంది. ఆ తర్వాత మేఘన అక్కడకు రాగా.. నువ్వు, మోక్ష కలిసిపోతారంటూ చెబుతుంది. కానీ మోక్ష మాత్రం అది కుదరదు అంటూ చెప్పుకొస్తాడు. చివరి నిమిషం వరకు మీరే కలిసుండాలని కోరుకుంటానంటూ చెప్పుకొస్తుంది. మీ పెళ్లి అయిన మరుక్షణమే నేను ఎవరి కంటికి కనిపించను.. నాగలోకం వెళ్లిపోతానంటూ పంచమి చెప్పగా.. మేఘనకు అలాంటి ఆశలు కల్పించకు అంటూ ఫైర్ అవుతాడు మోక్ష. పంచమి, నేను ఇప్పటికీ, ఎప్పటికీ భార్యాభర్తలమే అంటూ వివరిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X