Naga Panchami: ఇంట్లోంచి వెళ్లిపోయిన పంచమి.. మోక్షకు పూర్తిగా దూరమైనట్లేనా.. ఇక నాగలోకమే దిక్కా?

Naga Panchami December 29th Episode: నాగ పంచమి సీరియల్ లో అద్భుతమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో సీన్లను క్రియేటే చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు సీరియల్ నిర్వాహకులు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో పంచమి ఇంట్లోంచి వెళ్లిపోవడం హైలెట్ గా నిలిచింది. నిన్నటి ఎపిసోడ్ మోక్ష.. పంచమిపై కోప్పడడం, ఆమె చెంప పగులగొట్టడం జరగ్గా.. ఈరోజు ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. భర్తతో గొడవ జరిగిన తర్వాత గదిలోకి వెళ్లిన పంచమి వద్దకు మోక్ష తల్లి వైదేహి వస్తుంది. నీ వల్ల నా కొడుకు హాయిగా ఉండలేకపోతున్నాడు.. వాడు కోరుకున్న జీవితం ఇవ్వలేని నువ్వు ఇక్కడ ఉండడానికి వీళ్లేదని చెబుతుంది.

నువ్వు ఒక్క గంట కూడా ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకోను.. ఇంట్లోంచి వెళ్లిపో పంచమి అంటూ అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్లగొడుతుంది. ఏం చేయాలో పాలుపోని పంచమి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. అయితే మరుసటి రోజు ఉదయమే భార్య పంచమి వద్దకు వెళ్తాడు మోక్ష. అప్పటికే ఆమె గదిలో లేకపోవడంతో పంచమి, పంచమి అంటూ కిందకు వస్తాడు. ఈక్రమంలోనే అందర్నీ అడుగుతాడు. దానికి మోక్ష తల్లి సమాధానం చెబుతుంది. పంచమి ఇక్కడ లేదని.. ఇకపై నీ జీవితంలోకి రాదని వివరిస్తుంది. తానే ఇంట్లోంచి వెళ్లగొట్టినట్లు కూడా చెబుతుంది వైదేహి. అది విన్న అందరూ షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

Panchami Left Home After Moksha Mother Viadehi Warning on December 29th Episode Number239 in Naga Panchami Telugu Serial

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. ముందుగా మేఘన, పంచమి, ఫణీంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. చంద్రకాంత మొక్కను తీసుకు వచ్చి మోక్ష ప్రాణాలు కాపాడితే బాగుంటుందని పంచమి అంటుంది. మీరు నాగలోకం వెళ్లి ఆ మొక్కను తీసుకు వచ్చి ఇస్తే తాను నాగలోకానికి వస్తానని పంచమి అంటుంది. కానీ మీరు మాట తప్పే అవకాశం ఉందని ఫణీంద్ర అనగా.. ఇవన్నీ కుదిరే పనులు కావని మేఘన అంటుంది. నాగమణి వల్లే మోక్ష ప్రాణాలు కాపాడవచ్చని చెబుతుంది. మరోవైపు ఫణీంద్ర ఏది చేసిన ముక్కోటి ఏకాదశిలోపే చేయాలని అంటాడు. లేకపోతే మోక్షను కాటేసి వెళ్లిపోతానని అంటాడు.

ఇదంతా విన్న మేఘన ఇదంతా కుదిరే పని కాదని.. పంచమి నువ్వు అయితే నాగమణి తీసుకువచ్చే ప్లాన్ లోనే ఉండని అంటుంది. ఏం చేయాలో పాలుపోని పంచమి దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మోక్ష తండ్రి, వైదేహి మాట్లాడుకుంటూ కనిపిస్తారు. మోక్షకు పంచమి కరెక్టు కాదని.. పంచమిలో ఏదో లోపం ఉందని వైదేహి భర్తకు వివరిస్తుంది. అందుకే వారిద్దరూ కలవట్లేదని.. ముఖ్యంగా జాతకరీత్యా వచ్చిందో, లేక ఇంకేదైనా సమస్యో తెలియదు గానీ పంచమిలో పెద్ద లోపమే ఉందని అంటుంది. మోక్ష తండ్రి మాత్రం తొందరపడుతున్నావు వైదేహి అనగా... లేదండీ వారు కలవట్లేదు.. కలవరు.. ఇప్పటికే ఆలస్యం అయింది.. విసుగొచ్చి మోక్షను వదిలేసి వెళ్లిపోమని చెప్పినా సరేనని అందంటూ భర్తకు వివరిస్తుంది.

Panchami Left Home After Moksha Mother Viadehi Warning on December 29th Episode Number239 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత చిత్ర ప్లేటు నిండా బోండాలు తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటుంది. తాగేందుకు నీళ్లు తెచ్చుకోలేదని వెళ్లి తీసుకు వచ్చేలోపే మేఘన వచ్చి అవన్నీ మింగేస్తుంది. అంతోలనే డ్రై ఫ్రూట్స్ తింటూ జ్వాల రాగా.. ఆమే తినేసిందనుకుని చిత్ర కోప్పడుతుంది. నేను తినలేదని అనేలోపే చేతిలో ఉన్న నీళ్లన్నీ మాయం అవుతాయి. ఇదేంటి అనగా ఖాళీ బాటిల్ తెచ్చావేమో అంటుంది. ఇక ఆ తర్వాత జ్వాల చేతిలోని డ్రై ఫ్రూట్స్ కూడా మాయమవుతాయి. ఆ తర్వాత వారిద్దరూ పంచమి కోపం పెంచుకుని ఎవరో ఒకర్ని ఇంటికి తీసుకువస్తూ.. ఇలా చేస్తుందని మాట్లాడుకుంటారు. అంతోలనే మేఘన కనిపించి బోండాలు, డ్రై ఫ్రూట్స్ బాగున్నాయంటూ త్రేన్పులు తీస్తూ వెళ్లిపోతుంది. ఆమె వెళ్లగానే యథాప్రకారం వారి బోండాలు, నీళ్లు, డ్రై ఫ్రూట్స్ వారి చేతిలో ప్రత్యక్షం అవుతాయి.

ఇక ఆ తర్వాత మోక్ష గదిలో పడుకోనంటూ దిండు, దుప్పటి తీసుకుని హాల్లోకి వస్తాడు. వద్దని వారిస్తూనే పంచమి వెంట పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ అతడు ఎంత చెప్పినా వినడు. నేను ఇక్కడే ఉంటానని.. అడగడానికి నీకు అర్హత లేదంటూ కోప్పడతాడు. ఈక్రమంలోనే మోక్ష తల్లిదండ్రులతో పాటు మేఘన చాటుగా వీరి గొడవను చూస్తూ ఉంటారు. ఈక్రమంలోనే మోక్ష.. పంచమి చెంపపై కొట్టడం, నీవల్లే నేను పశువులా మారానంటూ ఫైర్ అవడం చూసి బాధ పడతారు. చెంపపై కొట్టగానే పంచమి కూడా గదిలోకి వెళ్లిపోతుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X