Naga Panchami: హత్తుకునేందుకు వచ్చిన మోక్షను తోసిన పంచమి.. కారణం ఏంటంటే?
Naga Panchami November 16th Episode: నాగ పంచమి సీరియల్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టీఆర్పీతో ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో సీరియల్ రోజురోజుకూ మలుపులు తిరుగుతోంది. ఓవైపు కరాళీ, ఆమె పంపిన భటులతో పాటు నాగదేవత, యువరాజు ఫణీంద్రలు పంచమిని తెగ ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఇంట్లోనే ఉన్న సుబ్బు పంచమికి సమస్యలు సృష్టించాలనుకుంటున్న కరాళీ భటులతో పాటు చిత్ర, జ్వాలలకు కూడా తరచుగూ బుద్ధి చెబుతూనే ఉన్నాడు.
ఈరోజుటి ఎపిసోడ్ లో బతికినన్ని రోజులు పంచమితో హాయిగా బతకాలని మోక్ష అనుకుంటాడు. అదే విషయాన్ని భార్యకు చెబుతాడు. ఎలాగైనా సరే ఈరోజు ఒక్కటి అవుదాం అనుకుంటూ ఆమెను హత్తుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ అంతలోనే పంచమికి ఏసీలోంచి వల్లె గాలిలో యువరాజు ఫణీంద్ర పాము రూపంలో కనిపిస్తాడు. అది చూపి తీవ్రంగా భయపడిపోయిన పంచమి.. భర్త మోక్షను నెట్టేస్తుంది. కౌగిలించుకునేందుకు వెళ్లిన తనను పంచమి తోసేయడంతో మోక్ష మొహం మాడిపోతుంది. ఏం జరుగుతుందో తెలియని అతను.. పంచమిని టెన్షన్ గా చూస్తూ ఉంటాడు. ఇదంతా మనం ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా పంచమికి మోక్ష తల్లి ఇంటి పెత్తనం అందిచడం కనిపిస్తుంది. ఇక అది చూసిన మోక్ష ఇక నుంచి నువ్వు నా భార్యవు మాత్రమే కాదు.. ఇంటి యజమానురాలివి అంటూ భార్యను పొగుడుతాడు. ఇది జీర్ణించుకోలేని చిత్ర, జ్వాలలు ఇంటి నుంచి బయటకు వచ్చి ఫుల్లుగా కోప్పడతారు. ఇంత చదువుకొని, ఇంటికి ఎప్పుడో వచ్చిన మనకు కాకుండా నిన్న మొన్న వచ్చిన పంచమికి ఇంటి పెత్తనం ఎలా ఇస్తారంటూ ఫైర్ అవుతూ ఉంటారు. ఈక్రమంలోనే ఏదో ఒకటి చేసి ఇంటి పెత్తనాన్ని లాక్కోవాలనుకుంటారు. ఈక్రమంలోనే జ్వాల.. మోక్షను చంపి ఆ నింద పంచమిపై తోసేస్తే.. సమస్య తీరిపోతుందని మనకు ఇంటి పెత్తనం దక్కుతుందని వివరిస్తుంది.
ఇదేదో బాగుందని చిత్ర చెప్పగా.. ఇద్దరూ ఐఫై ఇచ్చుకోబోతారు. అలా చేతులు కలిపిన అక్కాచెల్లెల్లు చేతులు అతుక్కుపోతాయి. ఇది సుబ్బుయే చేసుంటాడని ఇద్దరూ అనుకోగా.. అక్కడకు శిశిర వస్తుంది. ఇంట్లో వాళ్లకు చెబుతానంటూ పరిగెడుతుంది. వద్దని వాళ్లు వారిస్తున్నా వినదు. ఇక వెంటనే సుబ్బు వస్తాడు. తమ చేతులను అతుక్కుపోయాయని.. తప్పైందని, ఇక ఎప్పుడూ ఎవరినీ చంపమని చిత్ర చెబుతుంది. ఏంటి హత్యా అంటూ సుబ్బు భయం నటిస్తాడు. నేను వెళ్లిపోతున్నానంటూ వెళ్లిపోతాడు. తన మాయతో వారి చేతులను విడిపిస్తాడు.

ఇక ఆ తర్వాత పంచమి నాగ దేవతను ప్రార్థిస్తూ కనిపిస్తుంది. మోక్షను కాటేసి చంపుతానని.. కానీ నీవే బతికించాలని వేడుకుంటుంది. ఇంతలోనే నాగలోక యువరాజు ఫణీంద్ర రావడం, పంచమిని పౌర్ణమి రోజు పవిత్రంగా తీసుకువెళ్తానని చూపించడం మనకు కనిపిస్తుంది. భర్తను బతికించుకున్న తర్వాతే వస్తానని పంచమి చెప్పగా.. నిన్ను పెళ్లాడతానని ఫణీంద్ర వివరిస్తాడు. వెంటనే మోక్ష రావడం పంచమిని హత్తుకోవడం జరుగుతుంది. అదంతా చూసిన యువరాజు ఆగ్రహానికి గురికాగా నాగ దేవత ప్రత్యక్షం అవుతుంది. నువ్వు కోపంతో ఏమీ చేయకూడదని.. పంచమి మానవ జన్మలో ఉంది కాబట్టి వారికి ఇలాంటి భావనలు సహజమేనని చెబుతుంది.
ఇక ఆ తర్వాత కరాళీ పంపిన భటులు... కిచెన్ లో చేరి సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తారు. కానీ సుబ్బు వచ్చి వారి స్పూన్లతో కొట్టగా.. భయపడి వారు పారిపోతారు. ఆ తర్వాత పంచమి దగ్గరకు మోక్ష రావడం, హత్తుకునే ప్రయత్నం చేయడం.. కానీ ఆమె మాత్రం భర్తను తోసివేయడం చూపిస్తారు. ఇక పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే ఈరోజుటి ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











