Naga Panchami: ఐదు పడగల పాములా మారిపోయిన పంచమి.. విజయవంతమవుతున్న యాగం!

Naga Panchami December 11th Episode: నాగ పంచమి పంచమి సీరియల్ లో గత పది రోజులుగా వేచి చూస్తున్న కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. అయిందే ఈ రోజు సీరియల్ లో ముందుగా యాగం ప్రారంభం అవడాన్ని చూపిస్తారు. ఈ యాగం చేయడం వల్ల శివయ్య ఆశీస్సులు ఉండి... ఎలా మృత్యువు అయినా తప్పుకుంటుందని సప్త రుషులు చెబుతారు. అలాగే యాగం జరిగే సమయంలో అనేక దుష్ట శక్తులు యాగాన్ని ఆపాలని చూస్తాయని.. మీరు ఎట్టి పరిస్థితుల్లో శివయ్య మీద నుంచి మనస్సును తప్పించకూడదని వివరిస్తారు. ఏం జరిగినా పట్టించుకోకుండా శివయ్యను వేడుకుంటూనే ఉండాలని సూచిస్తారు.

ఇక ఆ తర్వాత ఫణీంద్రతో పాటు మరో ఇద్దరు నాగులు యాగాన్ని చూస్తారు. ఇంకా యాగం ప్రారంభం కాలేదని మాట్లాడుకుంటారు. ఇక ఆ తర్వాత నాగ దేవత కనిపిస్తుంది. నాగ లోకంలోని నాగులు అన్నీ అమ్మవారి చెంతకు రాగా... ఈరోజు కార్తీక పౌర్ణమి అని.. మనం ఆరాధించే చంద్రుడు మనకు శక్తిని ప్రసాదించే రోజు అంటూ పేర్కొంటుంది. ఇక ఆ తర్వాత ఈరోజుకు మరో ప్రాముఖ్యత కూడా ఉందని.. ఈరోజే మన రాణి ఇక్కడకు తిరిగి వస్తుందని నాగ దేవత చెబుతుంది. రాత్రికి రాణీ రాగానే.. ఘనంగా పట్టాభిషేకం నిర్వహించి పంచమిని రాణీ పీఠంపై కూర్చోబెట్టాలని చెబుతుంది. అలాగే అప్పటి వరకు యాగం చేస్తూ ఉండాలని చెప్పగా.. అంతా పూజలు చేస్తూ ఉంటారు.

Panchami Request Moksha to Stay in Temple For His Safety on December 11th Episode Number 223 in Naga Panchami Telugu Serial

ఇక ఆ తర్వాత మోక్ష, పంచమిలు గుడిలో ఉన్నట్లు కనిపిస్తారు. ముందుగా పంచమి నాగ సాధువు ఇచ్చిని విభూదిని గుడి చుట్టూ ముగ్గులా వేస్తుంది. ఇక ఆ తర్వాత మోక్షతో మాట్లాడుతూ... మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి దాటి వెళ్లకూడదని చెబుతుంది. అందుకు మోక్ష ఓకే చెప్పగా.. మీకు మరోసారి ఎలాంటి సమస్య రాకూడదని నేను ఒక కార్యం చేపట్టబోతున్నానను.... బయటకు వెళ్తాను.. ఉదయం వరకు మీరు గుడిలోంచి బయటకు రాకూడదని చెప్పి వెళ్తుంది. నన్ను కాపాడేందుకు ఇన్ని ఏర్పాట్లు చేశావు.. మరి నీ క్షేమం ఎలా పంచమి అంటూ మోక్ష అడుగుతాడు. నాకేమీ భయం లేదు.. నేను ఎక్కడికి ఎలా వెళ్లాలో అక్కడకే వెళ్తానంటూ పంచమి చెబుతుంది.

ఇక ఆ తర్వాత చాలా బాధగా భర్తను విడిచి ఆత్మాహుతి కావడానికి వస్తుంది. భర్తను వదిలి రాలేక నానా ఇబ్బందులు పడుతూ.. మనసంతా కటువు చేసుకుని కన్నీళ్లతో అక్కడి నుంచి కదులుతుంది. మోక్ష కూడా భార్యను అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక ఆ తర్వాత పంచమిని కరాళీ ఫాలో అవుతూ వెళ్తుంది. అడవిలో చాలా సేపు తిరిగినప్పటికీ.. పంచమి కరాళీకి కనిపించదు. దీంతో ఇప్పుడు కనిపించకపోయినా... అర్ధరాత్రి పాముగా మారకా కచ్చితంగా మోక్షను కాటేసేందుకు వస్తావు కదా... అప్పడే నిన్ను బంధించి పట్టుకెళ్తానని కరాళీ అనుకుంటూ వెళ్లిపోతుంది.

మరోవైపు ఫణీంద్రతో పాటు మరో ఇద్దరు నాగ కన్యలు... మహా మృత్యుంజయ యాగం జరుగుతున్న చోటుకు వెళ్లి యాగాన్ని చెడగొట్టాలనుకుంటారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కానీ నాగులు వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన సప్త రుషులు... తమ శక్తితో యాగ మందిరం చుట్టూ అగ్ని వలయం వేస్తారు. దీంతో నాగులు ఎంత ప్రయత్నం చేసినా లోపలికి రాలేకపోతాయి. చాలా సేపు ప్రయత్నించి.. తమ రూపాల్లోకి మారి కోపంగా యాగం జరగడాన్ని చూస్తారు. ఇదిలా ఉండగా.. పంచమి ఆత్మాహుతి అయ్యేందుకు ముందు... మోక్షతో తన పెళ్లి, వారిద్దరి మధ్య జరిగిన మధుర స్మృతులను గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక తరువాయి భాగంలో... పంచమి ఆత్మాహుతి అవ్వడానికి మంటల్లో దూకుతుంది. అయితే నాగ లోకంలో ఉన్న నాగ దేవత ఆ విషయాన్ని ముందుగానే గుర్తించి... భర్తను కాపాడుకోవడానికి ఆత్మాహుతి అవుతున్నావా... నిన్ను ఎట్టి పరిస్థితుల్లో చావ నివ్వను అంటూ శపథం చేస్తుంది. ఇక ఆ తర్వాత పంచమిని వెతుక్కుంటూ... మోక్ష, కరాళీలు పంచమి ఆత్మాహుతి అవుతున్న చోటుకు వస్తారు. అక్కడే ఐదు పడగలు ఉన్న ఓ పెద్ద పాముని చూసి షాకవుతారు. భయంతో వణికిపోతారు. ఆ పాము పంచమే అని చూస్తుంటేనే అర్థం అవుతోంది. మరి ఆమెకే శక్తులు వస్తాయా.. నాగ దేవత వచ్చే ఆమెకు ఏమీ కాకుండా కాపాడుతుందా అనేది తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X