Naga Panchami బెడిసికొట్టిన కరాళీ ప్లాన్.. సాయానికి ఫణీంద్ర నిరాకరణ.. మోక్షను పంచమి ఎలా కాపాడుకోబోతుందంటే?

Naga Panchami December 28th Episode: నాగ పంచమి సీరియల్ లో ప్రతీ పౌర్ణమి ఓ టర్నింగ్ పాయింట్ లా మారుతోంది. ప్రతీసారి మోక్షను గండం నుంచి తప్పించేందుకు పంచమి పడే ఆరాటం చూస్తుంటే మహా అద్భుతంగా అనిపిస్తుంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఆసక్తికరంగా సాగుతున్న ఈ సీరియల్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతున్న ఈ షోలో... మోక్ష, పంచమి, కరాళీల మధ్య గొడవ రాజేసుకుంది. ముఖ్యంగా వీరు ముగ్గురూ కలిసి... నాగమణిని భూలోకానికి తీసుకువచ్చి మోక్షను బతికించాకా తీసుకెళ్లాలని ప్లాన్ లు వేశారు. అయితే పంచమి నాగలోకం వస్తానంటేనే తాను సాయం చేస్తానని ఫణీంద్ర వివరించాడు.

అయితే ఇప్పుడీ ప్లాన్ బెడిసి కొట్టింది. మోక్షను బతికించడానికి నాగమణి అవసరం లేదని.. చంద్రకాంత మొక్క ఉంటే సరిపోతుందని తెలుసుకున్న పంచమి.. అదే చెబుతుంది. అయితే ఫణీంద్ర ముందుగా ఆ మొక్కను తేవడానికి తాను అంగీకరించనని.. అది తెచ్చి ఇచ్చాక నువ్వు నాగలోకం రాకపోతే ఎలా అంటూ అడిగాడు. తాను కచ్చితంగా వస్తానని పంచమి చెప్పినా ఆయనకు నమ్మకం కుదరకపోవడంతో తాను పంచమికి సాయం చేసేందుకు అస్సలే ఒప్పుకోనని కుండ బద్ధలు కొట్టేశాడు. అలాగే నాగదేవత చెప్పినట్లుగా ముక్కోటి ఏకాదశి రోజు కచ్చితంగా మోక్షను కాటేస్తానని వివరించాడు.

Panchami Searching Ways to Save Moksha on December 238th Episode Number 238 in Naga Panchami Telugu Serial

ఇదంతా ఇలా ఉండగా మరోవైపు మోక్ష, పంచమిల మధ్య చాలా పెద్ద గొడవే జరిగింది. భార్యను ఇన్నాళ్లూ చాలా ప్రేమగా చూసుకుంటూ వస్తున్న మోక్ష తొలిసారి ఆమెపై విపరీతంగా కోప్పడ్డాడు. ముఖ్యంగా ఆమె చెంప పగులగొట్టాడు. దాన్ని మోక్ష తల్లిదండ్రులతో పాటు మేఘన రూపంలో ఉన్న కరాళీ కూడా చూస్తుంది. తొలిసారి నన్ను పశువును చేశావంటూ మోక్ష అరవడం... పంచమి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి అవుతుంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా మోక్ష, పంచమిలను చూపిస్తారు. ఒకటి కావాలంటే మరోటి వదులుకోక తప్పదు అంటూ మోక్ష పంచమికి చెబుతాడు. ఆ తర్వాత పంచమి తల్లి గౌరీ ఫోన్ చేస్తుంది. పక్కన ఎవరైనా ఉన్నారా అని అడిగి.. మీ భార్యాభర్తల సమస్యకు పరిష్కారం దొరికిందని అంటుంది. ఏంటమ్మా అనగా.. ఇష్టరూప జాతి నాగుల పాము కాటుకు విరుగుడు తెలిసిందమ్మా.. నాగ సాధువు చెప్పారంటూ వివరిస్తుంది. నాగలోకంలో దొరికే చంద్రకాంత మొక్క వాళ్ల ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొంటుంది. అది తెలిసిన వెంటనే పంచమి తెగ సంబరపడిపోతుంది. అదే వియషయాన్ని పంచమి భర్తకు కూడా చెబుతుంది.

తాను నాగలోకం వెళ్తే అనేక అవకాశాలు ఉన్నాయని పంచమి అనగా.. మోక్ష మాత్రం నాకు దేనిమీద ఆశలు, నమ్మకాలు ేలవు.. అన్నీ కనుమరుగు అయిపోయాయి అంటూ వివరిస్తాడు. తాను ఏ క్షణం అయినా ఎవ్వరికీ కనిపించకుండా పోతానంటూ అప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు అంటూ చెబుతాడు. ఇది కాగానే.. మోక్ష తల్లి వైదేహి మెట్లు దిగుతూ.. ఫోన్ మాట్లాడుతూ వస్తుంది. ఇది గమనించిన కరాళీ ఆమెను మచ్చికచేసుకోవాలని ఓ ప్లాన్ వేస్తుంది. తన మంత్రశక్తితో వైదేహిని కింద పడేస్తుంది. దెబ్బ తగిలి విలవిల్లాడుతుంటే.. వెంటనే పంచమి, మోక్షలు పరిగెత్తుకు వస్తారు. వారితో పాటే కుటుంబ సభ్యులూ వస్తారు.

Panchami Searching Ways to Save Moksha on December 238th Episode Number 238 in Naga Panchami Telugu Serial

కానీ వైదేహి మాత్రం పంచమి, మోక్షను దగ్గరకు రానీయదు. ఈక్రమంలోనే కరాళీ వచ్చి నాకు పసరు వైద్యం తెలుసంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏవో ఆకులు తీసుకు వస్తుంది. వైదేహితో పాటు అంతా వద్దని వారిస్తుంటే.. తాను మాత్రం తగ్గకుంటే వెళ్లండి అంటూ పసరు రాస్తుంది. కాలుకు మసాజ్ చేస్తుంది. తన మంత్ర శక్తితో ఆ నొప్పిని మాయం చేస్తుంది. ఇలా వైదేహి మనసు గెలుచుకున్న కరాళీ తెగ సంబరపడుతుంది. నీలాంటి వాళ్లు ఈ ఇంటికి చాలా అవసరం.. క్షణాల్లోనే నొప్పి తగ్గించావమ్మా అంటూ వైదేహి చెబుతుంది. ఇక ఆ తర్వాత ఫణీంద్, మేఘనలు పంచమి దగ్గరకు వస్తారు.

నీ భర్తను ఒప్పించావా అనగా అతడు ఒప్పుకోలేదు, శత్రువు ప్రాణాలు కాపాడాల్సిన అవసరం వాళ్లకు ఏంటంటూ అడుగుతున్నారని అంటుంది. తాను రాకుండా నాగమణిని ఇక్కడకే తీసుకు వస్తే భర్తను బతికించుకోవచ్చ అనగా.. నాగమణిని ఇక్కడకు తీసుకు రావడం కుదరదని ఫణీంద్ర అంటాడు. నాగమణి లేకపోయినా మోక్ష ప్రాణాలు కాపడవచ్చని పంచమి అంటుంది. అది విన్న కరాళీ తెగ టెన్షన్ పడిపోతుంటుంది. ఎలా అని ఇద్దరూ అడగ్గా.. చంద్రకాంత మొక్క తెస్తే ప్రాణాలు కాపడవచ్చని పంచమి చెబుతుంది. కానీ ఆ మొక్క చనిపోయిన తర్వాత తెస్తే ఎలాంటి ఫలితం ఉండదని మోక్ష చెబుతాడు. దీంతో మేఘన తన అన్న నంబూద్రీని ఎలా కాపాడుకోవాలి అని ఆలోచిస్తుండగా... నువ్వు నాగలోకం వస్తేనే నేను ఆ మొక్క తెస్తానని ఫణీంద్ర అంటాడు. నువ్వు తెచ్చాకే వస్తానని పంచమి అంటుంది. ఇవన్నీ కుదిరేవి కావని కేవలం నాగమణి వల్లే బతికించవచ్చని మేఘన అనగా నిన్నటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X