Naga Panchami 25th January: ఈరోజే పంచమి అస్థికలు మోక్ష చేతుల్లోకి.. మరి ఫణీంద్ర ఏం చేయనున్నాడు?
Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతూ.. అనుక్షణం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఎట్టకేలకు పంచమి మోక్షను కాటేయడం.. అనేక రకాల సమస్యల మధ్య అతని ప్రాణాలు కాపాడడం జరిగింది. కానీ ఇక్కడే ఓ అద్భుతమైన ట్విస్ట్ ను ఇచ్చారు సీరియల్ నిర్వాహకులు. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో అయితే ఏంతో ప్రేమానురాగాలతో కలిసి ఉండే పంచమి, మోక్షల మధ్య గొడవ జరుగుతుంది. మోక్ష తన భార్యను ఇంటికి రమ్మని కోరగా.. తాను ససేమిరా రానని చెబుతుంది.
అంతేకాకుండా మోక్ష ప్రేమించే పంచమి ఎప్పుడో చనిపోయిందని.. కేవలం నాగకన్య మాత్రమే ఇప్పుడు బతికి ఉందని అంటుంది. అలా మాట్లాడొద్దు పంచమి ఇంటికి రా అంటూ మోక్ష బతిమాలుతుంటే మరింత ఫైర్ అవుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపోమంటూ చెప్పుకొస్తుంది. ఈక్రమంలోనే మోక్ష నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని అంటాడు. ఉండండి.. మీరేమైనా చేసుకోండి నేను చనిపోతానని అంటుంది. రేపు పొద్దునే మీ చేతికి నా అస్థికలు వస్తాయంటూ హెచ్చరిస్తుంది. ఇది విన్న మోక్ష ఆపు పంచమి అంటూ గట్టిగా అరుస్తాడు. ఆపై బాధతో మాటలు రాక కుమిలిపోతాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ప్రాణాలతో బయట పడ్డ మోక్షను ఇంటికి తీసుకుని వస్తారు. అంతలోపే చిత్ర, జ్వాలలు టిఫిన్ చేస్తూ.. అసలు మోక్ష మళ్లీ ఎలా బతికాడు అంటూ మాట్లాడుకుంటారు. అతడికి నా చేతిలోనే చావాలని రాసిపెట్టి ఉందేమో అందుకే ప్రాణాలతో బతికి బయట పడ్డాడేమో అని జ్వాల అంటుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు రావడం చూసి గబగబా చేయి కడుక్కొని పరిగెట్టుకుంటూ బయటకు వస్తారు. అంతలోపే కుటుంబ సభ్యులు అంతా ఇంట్లోకి రాగా.. వైదేహి మోక్షకు కొన్ని విషయాలు చెబుతుంది. కన్న నాకంటే.. నిన్ను ఇప్పుడు కాపాడి పునర్జన్మను ప్రసాదించిన మేఘనకే నువ్వు ఎక్కువగా రుణపడి ఉండాలంటూ చెబుతుంది.
అందరూ అలాగే చెబుతారు. మేఘన వల్లే మోక్ష ప్రాణాలు కాపాడగలిగామని అంటారు. ఆమె లేకపోతే అతడి ప్రాణాలు దక్కి ఉండకపోయేవని బాధ పడతారు. ఇక ఆ తర్వాత మోక్షతో నువ్వు ఇక పంచమిని మర్చిపో అంటూ వైదేహి సూచిస్తుంది. తను నా ప్రాణం మర్చిపోయే అవకాశమే లేదు.. తాను నేను బతికున్నంత వరకు నా గుండెల్లోనే ఉంటుందని చెబుతాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు. మరోవైపు మేఘన మోక్ష మాటలను గుర్తు చేసుకుంటూ మరింత బాధ పడుతుంది. ఇతడిని త్వరగా బలి ఇవ్వాలని అప్పుడే అన్ని శక్తులు పొందవచ్చని అనుకుంటుంది.

ఆ తర్వాత ఫణీంద్రను చూపిస్తారు. పంచమి మొండితనం వల్లే తనకు ఇన్ని సమస్యలు వచ్చాయని... హాయిగా యువరాణిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటే.. కనీసం నాగలోకం వెళ్లే యోగం కూడా లేకుండా పోయిందని బాధ పడతాడు. ఆ తర్వాత పంచమిని చూపిస్తారు. ఆమె ఓ చోట కూర్చొని తన జీవితం ఇలా అయిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏడుస్తూనే ఉంటుంది. ఇంతలోనే అక్కడకు సుబ్బు వస్తాడు. సుబ్బును గమనించిన పంచమి.. సుబ్బు వచ్చావా, ఎప్పుడు వచ్చావంటూ అడుగుతుంది.
అప్పుడే వచ్చాను నువ్వు ఏడుస్తున్నావు కదా అని ఏమీ అనలేదని చెబుతుంది. కానీ మరోవైపు పంచమి మాత్రం అలా తనకు కన్నీళ్లే దిక్కు అయ్యాయని.. జీవితాంతం ఏడ్చినా తన బాధ తీరేది కాదని చెబుతుంది. సుబ్బు మాత్రం అలా కాదు పంచమి.. శారీరక సుఖం పువ్వు లాంటిది అది ఎండి రాలిపోతుంది.. కానీ ప్రేమ మకరందం లాంటిది కనిపించకపోయినా హాయిని ఇస్తుంది అంటూ చెబుతాడు. కామీ పంచమి మాత్రం తాను మోక్షకు దూరం అవ్వడమే మంచిదని వివరిస్తుంది. ఇలా ఈరోజుటితో సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











